జ‌మ్మ‌ల‌మ‌డుగులో కొత్త పంచాయ‌తీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-04 17:21:15

జ‌మ్మ‌ల‌మ‌డుగులో కొత్త పంచాయ‌తీ

క‌డప జిల్లాలో జ‌మ్మ‌ల‌మ‌డుగు రాజ‌కీయాల గురించి తెలిసిందే.. వ‌ర్గ విభేదాలు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టినా మ‌ళ్లీ కొత్త వివాదాలు పొలిటిక‌ల్ గా రాజుకుంటున్నారు...గ‌తంలో తన‌కు  ఎమ్మెల్సీ రామ‌సుబ్బారెడ్డికి-  చెరో అర్ద‌రూపాయి వాటాలు సీఎం పంచుకోమ‌న్నారు అని బాబు పంచాయ‌తీ చేశారు అని మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి ఓ స‌మావేశంలో బ‌హిరంగంగా చెప్పింది తెలిసిందే...అయితే ఇరువురు బాగానే స‌ర్దుకుంటున్నారు  అని  అక్క‌డ జ‌నాల‌కు కూడా అర్దం అయింది... ప్ర‌జ‌ల‌కు మాత్రం వైరంగా ఉంటున్నా పంప‌కాలు మాత్రం బాగానే చేసుకుంటున్నారు అని ప్ర‌జ‌లు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు.
 
ఇక ఆళ్ల‌గ‌డ్డ పంచాయ‌తీలో బిజీగా ఉన్న సీఎం  చంద్ర‌బాబు ఇక ఆ పంచాయ‌తీకి పుల్ స్టాప్ పెట్టాను అని భావిస్తున్నారు... అయితే అక్క‌డ కూడా నిప్పు చ‌ల్లార‌లేదు .. ఈ లోపు జ‌మ్మ‌ల‌మ‌డుగులో పంచాయ‌తీ తెర‌మీద‌కు వ‌చ్చింది... జిల్లా అంతా నాదే తెలుగుదేశం స‌ర్వ‌హ‌క్కులు జిల్లాలో నాకే అని మంత్రి ఆదినారాయణ రెడ్డి దూసుకుపోతున్నారు.. 
 
చంద్ర‌బాబు నా అవ‌స‌రం పార్టీకి ఉంది అని అనుకుని త‌న‌ని పార్టీలోకి తీసుకున్నారు, అలాగే మంత్రి ప‌ద‌వి ఇచ్చారు అని ఆయ‌న అంటున్నారు... అయితే మంత్రిగా ఉండ‌టంతో ఆదినారాయ‌ణ రెడ్డికి తెలుగుదేశం నాయ‌కులు ఎవ‌రూ ఎదురుచెప్ప‌డం లేదు. ఇక జిల్లా బాధ్య‌త‌లు కూడా సీఎం ఆయ‌న‌కే అప్ప‌చెప్పారు అని కేడ‌ర్ భావిస్తోంది.
 
అయితే ఇటీవ‌ల  జిల్లాలో ఎమ్మెల్యే టికెట్లు ప్రకటించడానికి ఆదినారాయణ రెడ్డి ఎవరని  ప్ర‌శ్నించారు ఎమ్మెల్సీ రామ‌సుబ్బారెడ్డి ...జమ్మలమడుగులో పోటీ చేసేది తానేనని ఆదినారాయణరెడ్డి ఎలా ప్రకటిస్తారు? ఎమ్మెల్సీ ఇచ్చే సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు లేకపోలేదని అని త‌న‌కు హామీ ఇచ్చారు.పార్టీ పెట్టిన మొద‌లు ఎన్‌టీఆర్‌ హయాం నుంచి టీడీపీలో టికెట్స్‌ ప్రకటించే హక్కు మంత్రులకు, జిల్లా అధ్యక్షులకు లేదు. పార్టీ క్రమశిక్షణకు తూట్లు పొడుస్తున్నారు. లేని పోనీ ప్రకటనలు చేసి నియోజకవర్గంలో వర్గపోరు పెంచుతున్నారు  అని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు..
 
టీడీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వ్యాఖ్యలకు మంత్రి ఆదినారాయణ రెడ్డి  కౌంటర్‌ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగు అసెంబ్లీ టిక్కెట్‌ తనదేనంటూ మంత్రి ఆదినారాయణ రెడ్డి కుండబద్దలు కొట్టి చెప్పారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా సీనియర్‌ నాయకుడినని చెప్పారు మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి.. మొత్తానికి చంద్ర‌బాబు ఇరువురికి సీట్లు ఇస్తాను అని హామీ ఇచ్చి ఉంటారు అందుకే ఇరువురు బ‌హిరంగంగా సీటు త‌మ‌కంటే త‌మ‌కు అని చెప్పుకుంటున్నారు అని విశ్లేష‌కులు అంటున్నారు. 
 
జిల్లాలో  ఆదినారాయ‌ణ రెడ్డిని పార్టీలోకి  తీసుకునే స‌మ‌యంలో, మంత్రిగా అవ‌కాశం ఇచ్చిన స‌మ‌యంలో రామ‌సుబ్బారెడ్డి తీవ్రంగా  వ్య‌తిరేకించారు... అలాగే ఆయ‌నకు ప‌ద‌వి ఇస్తే పార్టీ మారుతారు అని అంద‌రూ అనుకున్నారు... చివ‌రకు ఆయ‌న్ని కూల్ చేసి ఆయ‌న‌కు ఎమ్మెల్సీగా అవ‌కాశం ఇచ్చారు  సీఎం చంద్ర‌బాబు... ఇక వీరు ఇరువురికి గ‌తంలో ఉన్న ఫ్యాక్ష‌న్ వివాదాల‌తో క‌చ్చితంగా రాజ‌కీయంగా సాయం చేసుకునే ప‌రిస్దితి లేదు.
 
ఇటు రామ‌సుబ్బారెడ్డి కుటుంబం అయితే అస‌లు ఆదినారాయ‌ణ రెడ్డితో క‌లిసి ముందుకు వెళ్ల‌వ‌ద్దు అని అంటుంటారు అని ఇక్క‌డ నాయ‌కులు అంటున్నారు... మ‌రి ఈ పంచాయ‌తీ ఎలా సెట్ చేస్తారో చూడాలి. అయితే ఎప్ప‌టికి అయినా ఈ సీటు విష‌యంలో వివాదం మాత్రం క‌చ్చితం అనేది అంద‌రూ చ‌ర్చించుకుంటున్న అంశం. ..ఇక రామ‌సుబ్బారెడ్డి రంగంలోకి దిగిన‌ట్టు తెలుస్తోంది. సీఎంతో ఆయ‌న భేటీ అవ్వ‌నున్నార‌ట... ఇప్ప‌టికే త‌న కేడ‌ర్ చీలుతోంద‌ని, ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు చేసి త‌న కేడ‌ర్ ను ద‌గ్గ‌ర‌కు చేర్చుకుంటున్నారు అని కంప్లైంట్ ఇవ్వ‌నున్నారు అని తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.