జేసి వారసుడి భ‌విష్య‌త్తు ఎలా ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-26 16:44:59

జేసి వారసుడి భ‌విష్య‌త్తు ఎలా ?

రాజ‌కీయాల్లో  ప‌రిచ‌యం అక్క‌ర్లేని వ్య‌క్తులు జేసి బ్ర‌ద‌ర్స్ ... రాజ‌కీయంగా ఎంత‌టివారినైనా ఎదిరించే స‌త్తా జేసి బ్ర‌ద‌ర్స్ కు ఉంటుంది అంటారు పాలిటిక్స్ లో...  గ‌తంలో కూడా జేసి దివాక‌ర్ రెడ్డి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి వార్త‌ల్లో నిలిచారు తెలుగుదేశం పార్టీలో ఉండి ఆయ‌న పై వ్యాఖ్య‌లుచేసిన రికార్డు బ‌హుశా జేసి బ్ర‌ద‌ర్స్ కే సొంతం...  అనంత‌లో జేసి బ్ర‌ద‌ర్స్  చెప్పిందే వేదం, వారు తెలియ‌చేసిందే శాస‌నం అన్న చందంగా ఉంటుంది అక్క‌డ రాజ‌కీయం. 
 
మాజీ ముఖ్య‌మంత్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన జేసి బ్ర‌ద‌ర్స్ వైఎస్ అకాల మ‌ర‌ణం త‌ర్వాత త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్  దృష్ట్యా ... 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న త‌రుణంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు... గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో మంచి ఊపు మీద ఉన్న జేసి బ్ర‌ద‌ర్స్ కు  బాబు రాజ‌కీయంగా పార్టీలో అవ‌కాశం ఇచ్చారు.. జేసి దివాక‌ర్ రెడ్డికి అనంతపురం ఎంపీ టికెట్ , అలాగే జేసి ప్ర‌భాక‌ర్ రెడ్డికి   తాడిప‌త్రి నుంచి అసెంబ్లీ సీటు ఇచ్చారు బాబు.
 
అయితే ఈ ఎన్నిక‌ల స‌మ‌యంలో తాడిప‌త్రిలో సైకిల్ జోరు కంటే ఫ్యాన్ గాలి ఎక్కువగా వీచింది... దీంతో  జేసి ప్ర‌భాక‌ర్ రెడ్డి ఎప్ప‌టినుంచో టీడీపీలో కొన‌సాగుతున్న సీనియ‌ర్ నేత ఫ‌యాజ్ ను త‌మ గెలుపుకు స‌హ‌క‌రించాల‌ని కోరారు.. అయితే అత‌ని పిలుపు మేర‌కు ఫ‌యాజ్ ప్ర‌భాక‌ర్ కు అండ‌గా నిలిచారు... అంతేకాదు తనను ఈ ఎన్నిక‌ల్లో గెలిపిస్తే ఫ‌యాజ్ కు తాడిప‌త్రిలో టీడీపీ త‌ర‌పున కీల‌క ప‌ద‌విని ఇస్తాన‌ని మాట ఇచ్చార‌ట జేసి ప్ర‌భాక‌ర్ రెడ్డి ... కానీ విజ‌యం పొందిన త‌ర్వాత పూర్తిగా ఫ‌యాజ్ ను జేసి దూరం పెట్టార‌ని ఆయ‌న స‌న్నిహితులు అంటున్నారు.
 
ఫ‌యాజ్ కు ఇస్తాన‌ని చెప్పిన కీల‌క ప‌ద‌విని అత‌నికి ఇవ్వ‌కుండా అత‌ని అనుచ‌రుడికి ఇవ్వ‌డం ఇక్క‌డ తెలుగుదేశంలో వ‌ర్గ పోరుకు ఆజ్యం పోసింది.. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో జేసి ప్ర‌భాకర్ రెడ్డి త‌న‌యుడు అస్మిత్ రెడ్డి తాడిప‌త్రి నుంచి పోటీ చేయాలి అని అనుకుంటున్నారు... ధ‌న బలం ఉన్నా ప్ర‌జా బ‌లం ఉన్నా ఇక్క‌డ ఈక్వేష‌న్లు వైసీపీకి ఓటు బ్యాంకు పెంచేలా కనిపిస్తున్నాయి అనే వార్త‌లు వినిపిస్తున్నాయి ..
 
ఓ సామాజిక‌వ‌ర్గానికి మ‌రింత జేసి ఫ్యామిలీ దూరం అయింది అని అక్క‌డ వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి.. రాజ‌కీయంగా ఎటువంటి వైరం ఉన్నా ఫ్యామిలీల జోలికి వ‌చ్చి రాయ‌ల‌సీమ‌లో మ‌హిళ‌ల పై రాజ‌కీయాలు చేసే సంస్కృతి లేదు.. అయితే జ‌గ‌న్ పై ఆయ‌న త‌ల్లి పై రోడ్డు వ‌ద్ద టెంట్ వేసి జేసి ప్ర‌భాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు తెలుగుదేశానికి మ‌ర‌క‌లే.
 
అయితే ఆయ‌న కుమారుడు ఎన్నిక‌ల్లో నిల‌బ‌డినా వార‌స‌త్వంగా అవి కూడా అస్మిత్ కు ప్ర‌తికూల ప్ర‌భావం చూపుతాయి అంటున్నారు విశ్లేష‌కులు..అందుకే తాడిప‌త్రిలో పెద్దారెడ్డి కూడా బ‌లంగా తిరుగుతున్నారు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ కూడా ఆయ‌న‌కు సీటు ఫిక్స్ అని తెలియ‌చేశారు.. దీంతో జేసి ఫ్యామిలీకి గ‌ట్టి పోటీ అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌క్కా అనేది తెలుస్తోంది. 
 
చూడాలి ఈ పొలిటిక‌ల్ వైకుంఠ పాళిలో పైకి ఎక్కేది ఎవ‌రో.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.