వైసీపీలోకి వెళ్తె ఖ‌చ్చితంగా భౌతిక దాడి చేస్తాం మంత్రి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ysrcp and tdp flags
Updated:  2018-07-17 05:57:06

వైసీపీలోకి వెళ్తె ఖ‌చ్చితంగా భౌతిక దాడి చేస్తాం మంత్రి

అనంత‌పురం జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ జిల్లాలో నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గం కొత్త‌గా ఏర్ప‌డింది. పెనుకొండ నియోజ‌క‌వ‌ర్గంలోని రామ‌గిరి, క‌న‌గాన ప‌ల్లి, చెన్నెకొత్త‌ప‌ల్లి మండ‌లాలు అలాగే అనంత‌పురం రూర‌ల్ లోని ఆత్మ‌కూరు, రాప్తాడు మండ‌లాలు క‌లిపి కొత్త‌గా రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇక అప్ప‌టిదాక పెనుకొండ‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తు వ‌స్తున్న ప‌రిటాల కుటుంబం రాప్తాడు మారిపోయింది. 2009, 2014 ఎన్నిక‌ల్లో ప‌రిటాల సునిత రాప్తాడు నుంచి తెలుగుదేశం పార్టీ త‌ర‌పున పోటీ చేసి త‌న ప్ర‌త్య‌ర్ధుల‌పై గెలిచారు. 
 
అయితే ఈ ప్రాంతం ప‌రిటాల సునిత కుంటుంబానికి ఏలు బ‌డిలోనే ఉంది.  2014 ఎన్నిక‌ల్లో రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గానికి అనేక హామీల‌ను ఇచ్చారు ప‌రిటాల సునిత. హంద్రినివా ద్వారా రైతుల‌కు నీరు ఇప్పిస్తామ‌ని గ్రామాల్లో నెల‌కొన్న తాగునీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌న్నారు. అలాగే రామ‌గిరిలో మూత‌బ‌డ్డ బంగారు గిరుల‌ను తిరిగి ప్రారంభించి స్థానికంగా ఉపాధి హామీల‌ను క‌ల్పిస్తామ‌న్నారు. అలాగే త‌న‌ను గెలిపించిన ఏడాదిలోగా పేరురుకు నీరు తీసుకువ‌చ్చి ఈ ప్రాంతం అంతా  స‌స్య‌శామ‌లం చేస్తామ‌ని గ‌త ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఊరు వాడ తిరిగి ప్ర‌చారం చేశారు ప‌రిటాల సునిత‌. ఇక దీనికి తోడు రుణ‌ల మాఫీ అంటూ చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న‌ను అన్ని గ్రామాల్లో వాల్ పేయింటింగ్ ద్వారా ప్ర‌చారం చేసి గ‌త ఎన్నిక‌ల్లో ల‌బ్దిపొందారు.
 
వైఎస్ కు వ్య‌తిరేకంగా... 
 
ఇక ఆ ఎన్నిక‌ల్లో గెలిచిన త‌ర్వాత రుణ మాఫీ స‌హా అన్ని ప‌క్క‌న పెట్టేశార‌ని నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు వాపోతున్నారు. రుణాల బాధ త‌ట్టుకోలేక రైతుల అత్మ‌హ‌త్య‌లు జ‌రుగుతున్నా మంత్రి ప‌రిటాల సునిత‌కు చీమ‌కుట్టినట్లు కూడా లేద‌ని గ్రామ‌స్తులు అంటున్నారు. అంతేకాదు నియోజ‌క‌వ‌ర్గంలోని పేరురు డ్యామ్ కు నీరు ఇచ్చేందుకు దివంగ‌త నేత మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌తిపాద‌న‌లు సిద్ద‌మ‌య్యాయి. హంద్రినివా ప్రాజెక్ట్ లో భాంగంగా పేరురు డ్యామ్ సులువుగా నీరు ఇవ్వ‌వ‌చ్చు. ఇక ఈ ప్ర‌తిపాద‌న‌లు బుట్ట దాఖ‌లు చేసిన మంత్రి సునిత... అధిక వ్య‌యంతో కూడిన మ‌రో మార్గంలో నీటిని తీసుకువెళ్లాల‌ని ప్ర‌తిపాద‌న‌లు పంపి స‌ర్కార్ తో ఆమోదింప చేసుకున్నారు. 
 
సునిత టార్గెట్ ఇదే... 
 
ఇక ఈ ప్ర‌తిపాద‌న వ‌ల్ల రాష్ట్ర ప్ర‌తిపాధ‌న‌పై సుమారు వెయ్యికోట్ల రూపాయ‌లు అద‌న‌పు భారం ప‌డుతోంది. పైసా ఖ‌ర్చులేకుండా పేరురు డ్యామ్ కు నీరిచ్చే మార్గాన్ని సూచించినా దాన్ని ఎందుకు ప‌ట్టించుకోవ‌టం లేద‌ని వైసీపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. టీడీపీ అధికారంలో రైతులు బాగుప‌డ‌కూడ‌ద‌ని నిరుద్యోగుల‌కు ఉద్యోగాలు రాకూడ‌ద‌ని ప్ర‌జ‌లు యాచ‌కులుగా మారాల‌నేది మంత్రి ప‌రిటాల సునిత ల‌క్ష్యంగా చేసుకున్నార‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. 
 
నియోజ‌క‌వ‌ర్గంలో త‌న వ‌ర్గీయులు పెద్ద ఎత్తున‌ హింస‌కు పాల్ప‌డుతున్నా మంత్రి సునిత వాదించిన ధాఖ‌లాలు లేవు. పైగా పోలీసుల ద్వారా కేసుల‌ను తారుమారు చేసేందుకు త‌నదైన శైలిలో ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌య‌త్నిస్తున్నార‌నే వాద‌న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో గ‌ట్టిగానే ఉంద‌ని అంటున్నారు. రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం ఆరు మండ‌లాలు ఉన్నాయి. అయితే త‌న కుటుంబ స‌భ్యుల‌ను మంత్రి సునిత ప్ర‌తి మండ‌లానికి ఒక‌రు చొప్పున ఇంచార్జ్ లుగా నియ‌మించి వారిని రాజ్యంగేత‌ర శ‌క్తులుగా మార్చుకున్నార‌ని విప‌క్షాలు మండిప‌డుతున్నాయి. 
 
మంత్రి పరిటాల సునిత‌ది రామ‌గిరి మండ‌లం వెంక‌టాపురం గ్రామం, ఈ గ్రామంలో టీడీపీ మిన‌హా ఇత‌ర పార్టీల‌కు చోటు ఉండ‌కూడ‌ద‌నేది ప‌రిటాల కుటుంబం సిద్దాంతం. అందుకే ఎవ‌రైనా ఇత‌ర పార్టీల‌వైపు వెళ్తె వారిపై భౌతిక దాడులు చేయించ‌డం ఇక్కడ‌ శ‌రా మాములుగా అయిపోయింది. అంతేకాదు రాప్తాడు నియోజ‌క‌ర్గంలో టీడీపీ నేత‌లు చెబితేనే పోలీస్ అధికారులు కేసులను న‌మోదు చేస్తున్నారు. ఇదే క్ర‌మంలో ప‌రిటాల వ్య‌తిరేకులు పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తే వాటికి కౌంట‌ర్ కేసులను పెట్టి వేదించ‌డం ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మాములు అయిపోయింది. 
 
ఇక ప‌రిటాల అగ‌చాట్ల‌కు పోలీస్ అధికారులు సైతం చ‌ట్టాన్ని ర‌క్షించ‌లేక‌పోతున్నారు. పరిటాల వ‌ర్గానికి చెందిన వారు బ‌హిరంగంగానే దాడుల‌కు పాల్ప‌డుతున్నా పోలీసులు చూసీ చుడ‌న‌ట్లు వ్య‌హ‌రిస్తున్నార‌ని వైసీపీ నాయ‌కులు వాపోతున్నారు. గ‌త నాలుగేళ్లుగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మంత్రి వ‌ర్గంలో ఉన్న మంత్రి ప‌రిటాల సునిత రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గానికి చేసింది శూన్యం అనే విమ‌ర్శ‌లు  ప్ర‌తి గ్రామంలో చెబుతూనే ఉన్నారు. ప్ర‌తీ ప‌నిలోను ప‌రిటాల వ‌ర్గీయులు క‌మీష‌న్లు ఇసుక అక్ర‌మ దందా, ల్యాండ్ సెటిల్ మెంట్లు  ప‌ర్సెంటేజీలు వంటి అరోప‌ణ‌లు ప‌రిటాల కుటుంబానికి అనేకంగా ఉన్నాయి.
 
ఇక వీటికి తోడు రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి సునిత త‌న‌యుడు ప‌రిటాల శ్రీరామ్ రాజ్యాంగేత‌ర‌ శ‌క్తిలా మారి అన్ని వ్య‌వ‌హారాల్లో జోక్యం చేసుకుంటున్నార‌ని ఆరోప‌ణ‌లు బలంగా ఉన్నాయి. ఇక వీట‌న్నింటికి రానున్న ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఎలాంటి స‌మాధానం చెబుతారో వేచి చూడాలి.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.