చంద్ర‌గిరి కోట‌పై జెండా పాతేదెవరు?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-18 12:12:55

చంద్ర‌గిరి కోట‌పై జెండా పాతేదెవరు?

చిత్తూరు జిల్లా రాజ‌కీయాలు చూస్తే నారా, న‌ల్లారి, గ‌ల్లా, పెద్దిరెడ్డి  కుటుంబాల రాజ‌కీయాలు వారి వైరాలు ముందుగా గుర్తుకువ‌స్తాయి..జిల్లాలో  బాబు స్వ‌గ్రామం నారావారిప‌ల్లె, ఇది చంద్ర‌గిరి అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉంది..1952 లో అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంగా ఏర్ప‌డి, త‌ర్వాత త‌వ‌నంప‌ల్లి - బంగారు పాలెంలో విలీన‌మై ఓ సెట్మెంగ్ గా మారింది చంద్ర‌గిరి.
 
ప్ర‌స్తుతం సీఎంగా ఉన్న చంద్ర‌బాబు నాయుడు ఎస్వీ యూనివ‌ర్సిటిలో పీహెచ్ డీ  చేస్తున్న స‌మ‌యంలో రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు.. 1978 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌పున ఆయ‌న ఎమ్మెల్యే అయ్యారు.. ఇక త‌ర్వాత చంద్ర‌గిరిలో రాజ‌కీయాలు ప‌లు ట‌ర్నింగ్ లు తీసుకున్నాయి.. ప‌లు పార్టీల్లో నాయ‌కుల వార‌సులు వారి కుటుంబాల ఎంట్రీల‌తో పొలిటిక‌ల్  హీట్ పెంచాయి... ఇక చిత్తూరు జిల్లాలో రాజ‌కీయ కురువృద్దుడు గ‌ల్లా రాజ‌గోపాల్ నాయుడు ఇక్క‌డ త‌వ‌రంప‌ల్లి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు.. ఇక ఈ సెగ్మెంట్ లో చంద్ర‌బాబు నాయుడు త‌మ్ముడు రామ్మూర్తినాయుడు అలాగే గ‌ల్లా అరుణ కుమారి ప్రాతినిధ్యం వ‌హించారు.ఈ సెగ్మెంట్ పై జనహితం గ్రౌండ్ రిపోర్ట్...
 
2009 ఎన్నిక‌ల్లో ఈ సెగ్మెంట్ నుంచి తెలుగుదేశం త‌ర‌పున ఆర్కే రోజా ఎమ్మెల్యేగా నిల‌బ‌డ్డారు.. ఇటు కాంగ్రెస్ త‌ర‌పున గ‌ల్లా అరుణ‌కుమారి పోటి చేసి రోజా పై విజ‌యం సాధించారు.. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కాంగ్రెస్ నుంచి గ‌ల్లా కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014 ఎన్నిక‌ల్లో తెలుగుదేశం తర‌పున చంద్ర‌గిరి నుంచి గ‌ల్లా అరుణ కుమారి పోటిచేశారు. ఇటు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున చెవిరెడ్డి భాస్క‌ర రెడ్డిపోటి చేసి, ఆమె పై విజ‌యం సాధించారు.. ఈ సెగ్మెంట్లో క‌మ్మ‌,రెడ్డి, బీసీ ఓట‌ర్ల సంఖ్య మెజార్టీగా ఉంటుంది, మొత్తం ఇక్క‌డ‌ రెండు ల‌క్ష‌ల 62 వేల మంది ఓట‌ర్లు ఉన్నారు.
 
ఈ మండ‌లం  తెలుగుదేశం కంచుకోట‌గా ఉండేది.. కాని ఈ మూడేళ్ల‌లో వైసీపీ త‌న స‌త్తా చాటుకుంది. ఇక్క‌డ వైసీపీ త‌ర‌పున మండ‌లాధ్య‌క్షునిగా కొటాల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి కొన‌సాగుతున్నారు... ఎమ్మెల్యే చెవిరెడ్డి వెంట ఉంటూ  పార్టీని ముందుకు న‌డుపుతున్నారు... ఇక‌ మండ‌లంలో తెలుగుదేశం త‌ర‌పున గౌస్ భాషా మాజీ మండలాధ్య‌క్షుడు చురుకుగా ఉంటున్నారు..
 
మ‌రో ప‌క్క అధికార పార్టీలో ధ‌నుంజ‌య్ రెడ్డి గ‌ల్లా యువ‌సేన‌తో పార్టీలో కొన‌సాగుతున్నారు..కాని వీరిద్ద‌రి మ‌ధ్య వ‌ర్గ‌పోరుతో తెలుగుదేశం పార్టీకి ఇక్క‌డ ఎదురుదెబ్బ త‌గులుతూ పార్టీ చ‌తికల‌బ‌డుతోంది.. అయినా  ఇక్కడ‌  16 ఎంపీటీసీల‌కు గాను 11 ఎంపీటీసీలు గెలుచుకుంది వైసీపీ.. అలాగే ఓ జెడ్పీటీసీ త‌న ఖాతాలో వేసుకుంది. బాబు సొంతగ్రామం నారావారి ప‌ల్లె ఈ మండ‌లంలోనే ఉంది. అయినా అభివృద్దికి నోచుకోవ‌డం లేదు ఆ గ్రామం.ఇక్క‌డ వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీకి 70 శాతం ప్ర‌జా మ‌ద్ద‌తు ఉంది. అలాగే తెలుగుదేశానికి 30 శాతం ప్ర‌జా మ‌ద్ద‌తు ఉంది.
 
సెగ్మెంట్లో ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేగా ఉండ‌టం వల్ల ఇక్క‌డ అభివృద్ది కుంటుప‌డింది అంటున్నారు ప్ర‌జ‌లు.. సీఎం సొంత గ్రామం ఉన్న సెగ్మెంట్ అయినా కూడా  చంద్రబాబు చేసింది ఏమి లేదు అంటున్నారు అక్కడ ప్రజలు.. రామచంద్రాపురం మండలం సి.రామాపురంలోని డంపింగ్‌ యార్డును తొలగించాలంటూ చెవిరెడ్డి పోరాటం చేసి ప్ర‌జ‌ల‌కు మ‌రింత ద‌గ్గ‌ర అయ్యారు. అంతే కాకుండా ఎక్కువ నియోజ‌క‌వ‌ర్గంలో అందుబాటులో ఉంటారు అనే ఫేమ్ కూడా ఉంది ఆయ‌న‌కు. అధికార పార్టీ అధినేత సీఎం చంద్ర‌బాబుపైనే నేరుగా ఆయ‌న విమ‌ర్శ‌లు చేయ‌డం, ప్ర‌జా స‌మ‌స్య‌ల పై దూకుడు స్వ‌భావం ఆయ‌న‌కు  ఫేమ్ తెచ్చిపెట్టాయి.
 
వచ్చే ఎన్నికలలో గల్లా అరుణకుమారి పోటీ చేయనని చెప్పారు...అంతేకాకుండా నా కుమార్తె రమాదేవికి కూడా పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేసారు గల్లా అరుణకుమారి....అందుకే ఆమె ఇప్పుడు ఈ సెగ్మెంట్లో ఆక్టివ్ గా లేరు. పంచాయతీ, జన్మభూమి, నీరు చెట్టు కార్యక్రమం ఇలా అన్నింట్లో లోకేష్ తలదూరుస్తున్నాడని అందుకే ఆమె పోటీచేయడంలేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నియోజకవర్గంలో కార్యకర్తల మధ్య సమన్వయం లేకపోవడంతో పోటీ నుంచి తప్పుకున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి..
 
చంద్రగిరిలో బలమైన నాయకురాలు తప్పుకోవడంతో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది.. ఇప్పుడు చంద్రగిరిలో పోటీ చేయడానికి సరైన నాయకుడు లేకపోవడంతో టీడీపీ ఓడిపోవడం ఖాయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు... 
 
మరో వైపు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిత్యం ప్రజల్లో ఉంటూ, వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నారు...చెవి రెడ్డి ఎప్పుడు ప్ర‌జా పోరాటాల్లో ఉంటారు, ప్ర‌జ‌ల‌కు అందుబాటులో అనే పేరును తెచ్చుకున్నారు. అయితే గ‌ల్లాకు నారాకు   కంచుకోట‌గా ఉన్న‌చంద్ర‌గిరి రూపు రేఖలు జ‌గ‌న్ మార్చుతార‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా ఆ కోట‌పై త‌న జెండా ఎగురువేస్తాను అంటున్నారు ప్ర‌స్తుత వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.