అభివృద్ది గాలికి ఆధిప‌త్యంకోసం పాకులాట‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-17 18:10:13

అభివృద్ది గాలికి ఆధిప‌త్యంకోసం పాకులాట‌

ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంత జిల్లా క‌డ‌ప జిల్లా, ఈ జిల్లాలో  బ‌ద్వేలు నియోజ‌క‌వ‌ర్గం పెద్ద నియోజ‌క‌వర్గంగా భావిస్తారు. అలాగే రాజ‌కీయంగా చైత‌న్యం ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ గా పేరుంది. ఇక్క‌డి నుంచి ఏడుసార్లు గెలిచి రికార్డ్ సాధించారు బిజివేముల వీరా రెడ్డి. అంతేకాదు ఆయ‌న మంత్రిగా కూడా ప‌నిచేశారు. 34 వేల‌కు రెడ్డి సామాజిక ఓట్లు ఉంటే బ‌లిజ సామాజిక వ‌ర్గానికి చెందిన ఓట్లు 20 పైగా ఉన్నాయి.
 
ఇక ఎస్సీల‌కు బీసీల‌కు 55 వేల‌కు పైగా ఓట్లు ఉన్నాయి. 2009 నుంచి బ‌ద్వేలు నియోజ‌కవ‌ర్గం ఎస్సీల‌కు రిజ‌ర్వు అయింది. తెలుగు రాష్ట్రాలు విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత 2014లో మొద‌టి సారిగా సార్వ‌త్రిక‌ ఎన్నిక‌లు జ‌రిగితే ఆ ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున పోటీ చేసిన జ‌య‌రాములు టీడీపీ అభ్య‌ర్ధి ఎన్ డీ విజ‌య‌జ్యోతిపై 10,079 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. కొంత‌కాలంపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో కొన‌సాగిన జ‌య‌రాములు ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగు దేశంపార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఫిరాయింపు రాజ‌కీయాల‌కు ఆక‌ర్షితులై ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌కుండానే ప‌చ్చ‌కండువా క‌ప్పుకున్నారు. 
 
సంపాద‌న‌కే ప‌రిమితం..
 
నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ది కోస‌మే తాను టీడీపీలో చేరుతున్నాన‌ని త‌న‌తోపాటు ఉన్న వైసీపీ నేత‌ల‌కు చెప్పారు. ఎమ్మెల్యే తిరివేది జ‌య‌రాములు తెల‌గుదేశం పార్టీలో చేరిన‌ప్ప‌టి నుంచి ఇక్క‌డ స్థానికి టీడీపీ నేత‌ల‌పైన ఆధిప‌త్యం కోసం గొడ‌వ‌ప‌డుతూ నిత్యం వివాస్ప‌దంగా మారుతున్నారు త‌ప్ప ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను పూర్తిగా మ‌ర్చిపోయారు. ఎస్సీల‌కు ఉచిత క‌రెంట్ ఇప్పిస్తాన‌ని  ఎమ్మెల్యే గ‌తంలో హామీ ఇచ్చారు కానీ ఇంత‌వ‌ర‌కు క‌రెంట్ ఇవ్వ‌లేదు. ఎస్సీల‌కు ఉచిత క‌రెంట్ అని చెప్పిన ఎమ్మెల్యే ఇప్పుడు ఇక్కడ పేద‌వారి ఇళ్ల‌కు వేల‌కు వేలు బిల్లులు వ‌స్తున్నా ఆయ‌న ప‌ట్టించుకున్న దాఖ‌లాలు లేవు. ఎంత‌సేపు ఎమ్మెల్యే జ‌య‌రాములు త‌న సంపాద‌న‌కే ప‌రిమితం అయ్యార‌ని వామ‌ప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. హామీలు నెర‌వేర్చ‌డానికి ఉప‌యోగించాల్సిన ఎస్సీ, ఎస్టీ నిధులు ఏమైపోతున్నాయో చెప్పాల‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. 
 
నియోజ‌క‌వ‌ర్గంలో కీల‌క‌మైన చిన్న‌త‌ర‌హా ప్రాజెక్ట్ స‌గిలేరు నుంచి చుక్క‌నీరు ఇప్పించ‌లేక‌పోయార‌ని ఎమ్మెల్యే జ‌య‌రాములు తీరును ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ ఆధునీక‌ర‌ణ అంటూ కాంట్రాక్ట్ లు తీసుకుని ల‌బ్ది పొందుతున్నారు త‌ప్ప బ్ర‌హ్మం సాగ‌ర్ నుంచి నీటిని మ‌ళ్లించాల‌నే డిమాండ్ ను ప‌ట్టించుకోవ‌డంలేదు. ఇక అన్నంటికంటే ముఖ్యంగా ఇదే నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోకి వ‌చ్చే సోమ‌సిల్ల రిజ‌ర్వాయ‌య‌ర్ బ్యాక్ వాట‌ర్ నుంచి నియోజ‌క‌వ‌ర్గంలోని ఏడు మండ‌లాల‌కు ముఖ్యంగా బ‌ద్వేలు మున్సిపాలిటికి తాగునీరు అందిస్తామంటూ జ‌య‌రాములు హామీ ఇచ్చారు. అయితే ఈ నాలుగున్న‌ర ఏళ్ల‌లో ఆయ‌న ప్ర‌య‌త్నించిన దాఖ‌లాలు లేవు. ఇక మ‌రోవైపు బ‌ద్వేలు మున్సిపాలిటి దాహాన్ని తీర్చేందుకు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న డిమాండ్ అలానే ఉండి పోయింది.
 
వైఎస్ హ‌యాంలో జ‌రిగింది..
 
దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి బ‌ద్వేల్ ను మున్సిపాలిటిగా తీర్చి దిద్దారు. ఇక ఆయ‌న పాల‌న‌లోనే సోమ‌సిల్లు నుంచి తాగునీటి ప్ర‌తిపాద‌న‌తో పాటు మొత్తం వంద‌కోట్ల నిధుల‌ను ఇచ్చేందుకు రంగం సిద్దం అయింది. ఇక వైఎస్ మ‌ర‌ణించ‌డంతో ఆ తర్వాత వ‌చ్చిన ప్ర‌భుత్వాలు దాని ఊసే ఎత్త‌లేదు. ఇక్క‌డ రోడ్ల‌న్ని అద్వానంగా త‌యారు అయ్యాయి. మంచినీరు లేదు డ్రైనేజీ వ్య‌వ‌స్థ అస్థ‌వ్య‌స్తంగా మారిపోయింది. బ‌ద్వేల్ మున్సిపాలిటీ గంద‌ర‌గోళంగా త‌యారు అయింద‌ని తాము ఎక్క‌డైనా స‌రే చ‌ర్చ‌కు సిద్ద‌మ‌ని బ‌హిరంగంగానే స‌వాల్ విసురుతున్నారు.
 
నెల్లూరు జిల్లా గ్రామాల స‌రిహ‌ద్దుల‌తో పాటు బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలోని గ్రామాల‌కు బ‌ద్వేలు ప‌ట్ట‌ణం వ్యాపార ప‌రంగా కీల‌క‌మైన‌ది. అయితే దీని అభివృద్ది మాత్రం ఎమ్మెల్యేకు ప‌ట్ట‌డంలేదు. ఒక మున్సిప‌ల్ క‌మిష‌న్ గా ప‌ని చేసి ఆ త‌ర్వాత రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన జ‌య‌రాములు ఇలా వ్య‌వ‌హ‌రించ‌డంపై ప్ర‌జ‌లు తీవ్ర స్థాయిలో వ్య‌తిరేకిస్తున్నారు. ఎన్న‌డూ లేని విధంగా డ్రైనేజి వ్య‌వ‌స్థ అత్యంత ఘోరంగా త‌యారు అయింది.
 
ఎమ్మెల్యే జ‌య‌రాములు వైసీపీకి వెన్నుపోటు పొడిచి టీడీపీలోకి జంప్ అయిన సంద‌ర్భంలో అనేక స‌మ‌స్య‌ల చిట్టాను బ‌య‌టికి తీశారు. ఇక వీట‌న్నింటికోస‌మే తాను పార్టీ మారుతున్నాన‌ని చెప్పుకొచ్చారు. అంతేకాదు వాటితో ఒక లేఖ రాసి ముఖ్య‌మంత్రికి ఇచ్చానంటూ చేతులు దులుపుకున్నారు. అయితే చంద్ర‌బాబు నాయుడు య‌దావిదిగా ఎమ్మెల్యే డిమాండ్ల‌ను బుట్ట ధాఖ‌లు చేశారు. ఇక ఈ జాబితాలో బ‌ద్వేల్ మున్సిపాలిటికి వంద‌కోట్ల రూపాయ‌లు పోరుమామిళ్ల‌కు మ‌రో 50 కోట్ల రూపాయ‌లు కావాల‌ని అడిగారు.
 
నిధుల విష‌యంలో జ‌య‌రాములు విఫ‌లం.. 
 
కానీ ఒక్క రూపాయి కూడా ప్ర‌భుత్వం ఇవ్వ‌లేదు. నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ద్వేల్ పోరుమామిళ్ల‌ ప్ర‌ధాన‌ ప‌ట్ట‌ణాలు అంతేకాదు అధిక జ‌నాభా ఇక్క‌డే కేంద్రీకృతం అయి ఉంటుంది. ఇక ఈ రెండు ప‌ట్ట‌ణాల మ‌ధ్య రాక‌పోక‌ల కోసం చిన్న‌పాటి రోడ్డు మాత్ర‌మే ఉంది. ఇక దాన్ని విస్త‌రించాల‌నేది బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జల ఆకాంక్ష‌. ఇక దీనికోసం 40 కోట్ల రూపాయ‌ల‌ను తీసుకువ‌చ్చి ప‌నులు చేయిస్తాను అన్న ఎమ్మెల్యే జ‌య‌రాములు ఈ విష‌యంలో విఫ‌లం అయ్యారు. కేవ‌లం నీరు-చెట్టు నిధుల‌ను మింగ‌డానికి టీడీపీ నేత‌లు ప‌రిమితం అవుతున్నారు త‌ప్ప అభివృద్ది చేయ‌డంలేద‌ని విప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. 
 
ఖ‌చ్చితంగా బుద్ది చెబుతాం..
 
నియోజ‌క‌వ‌ర్గంలోని కీల‌కమైన రోడ్ల నిర్మాణం పేద‌ల‌కు ప‌క్కా గృహాల హామీ ఆర్వో ప్లాంటులు, ఓవ‌ర్ హెడ్ ట్యాంకులు ఇలా ఎన్నో హామీల‌ను ఇచ్చిన ఎమ్మెల్యే జ‌య‌రాములు అన్ని విష‌యాల్లో ఫెయిల్ అయ్యారు. త‌మ లాంటి సొంతింటి క‌ల క‌ల‌గానే మిగిలిపోయింద‌ని నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు వాపోతున్నారు. ఎంతో రాజ‌కీయ చైత‌న్యం క‌లిగిన‌ బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గానికి ఒక మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఎమ్మెల్యేగా వ‌చ్చార‌ని ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తీర్చ‌డంలో ఆయ‌న ప్ర‌త్యేక శ్ర‌ద్ద చూపుతార‌ని ప్ర‌జ‌లు భావించారు. అయితే ఆయ‌న సొంత ప్ర‌యోజ‌నాల‌కే ప్రాధాన్యం ఇచ్చి పార్టీ ఫిరాయించి టీడీపీ ఆధిప‌త్యం కోసం పోరాటం చేశారు త‌ప్ప ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై ఒక్క రోజు కూడా పోరాటం చేయ‌డంలేదు. దీంతో నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు త‌మ ఎమ్మెల్యే జ‌య‌రాములుపై తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త‌తో ఉన్నారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో స‌రైన రీతిలో స్పందిస్తామ‌ని హెచ్చ‌రిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.