దెందులూరులో దూసుకుపోయేదెవ‌రు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-17 16:29:35

దెందులూరులో దూసుకుపోయేదెవ‌రు

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా లో దెందులూరు రాజ‌కీయం చాలా డిఫ‌రెంట్ గా ఉంటుంది... కమ్మ సామాజిక‌వ‌ర్గానికి ఇక్క‌డ విజ‌యం కేరాఫ్ అడ్ర‌స్ అని చెబుతారు... అయితే ఇక్క‌డ జ‌రిగిన రాజ‌కీయం జిల్లావాసుల‌కు మంత్రుల‌కు మాత్ర‌మే తెలుసు... అయితే సినీ ఇండ‌స్ట్రీలో ఫేమ్ ఉన్న కుటుంబం మాగంటి కుటుంబం, ఇక్క‌డ రాజ‌కీయంగా కూడా మాగంటి ఫ్యామిలీకి ఎంతో పేరు ఉంది ఓ సారి దెందులూరు రాజ‌కీయాలు ప‌రిశీలిస్తే?
 
1989 లో మాగంటి ర‌వీంధ్ర‌నాధ్ చౌద‌రి ఎమ్మెల్యేగా గెలుపొందారు.. ఇక జెడ్పీ చైర్మ‌న్ గా అలాగే మంత్రిగా రాష్ట్రంలో బాధ్య‌త‌లు చేప‌ట్టారు.. ఇక 1991 లో నేదురుమ‌ల్లి క్యాబినెట్లో మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన కొద్ది సేప‌టికే గుండెపోటుతో మ‌ర‌ణించారు ఆయ‌న‌... ఇక ఆత‌ర్వాత జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో ఆయ‌న భార్య వ‌ర‌ల‌క్ష్మి విజ‌యం చెందారు.త‌ర్వాత కొంత కాలం ఆమె కూడా మంత్రిగా ప‌నిచేశారు.. ఇక 2004 ఎన్నిక‌ల్లో మాగంటి త‌న‌యుడు వెంక‌టేశ్వ‌ర‌రావు బాబు కాంగ్రెస్ త‌ర‌పున నిలుచున్నారు ఎమ్మెల్యే అభ్య‌ర్దిగా, ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఎమ్మెల్యేగా గెలిచారు.. మంత్రిగా వైయ‌స్ ఆయ‌న‌కు అవ‌కాశం ఇచ్చారు. ఇక మాగంటి ఫ్యామిలీలో తండ్రి త‌ల్లి త‌న‌యుడు మంత్రుగా చేసి ఏపీలో చ‌రిత్ర సృష్టించారు.
 
ఇక ఆ స‌మ‌యంలో జ‌రిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవ‌డంతో నైతిక బాధ్య‌త వ‌హించి మంత్రి ప‌ద‌వి నుంచి బ‌య‌ట‌కు రావాలి అని ఒత్తిడి వ‌చ్చింది... దీంతో ఆయ‌న అవ‌మానంగా ఫీల్ అయ్యి మంత్రి ప‌ద‌వితో పాటు  శాస‌న‌స‌భ స‌భ్య‌త్వాన్ని వ‌దిలి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు... ఆ వెంట‌నే తెలుగుదేశంలో చేరారు మాగంటి బాబు.ఇక క‌మ్మ‌సామాజిక వ‌ర్గం అలాగే మాగంటి ఫ్యామిలీకి ఫేమ్ ఉండ‌టంతో 2009 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఆయ‌న‌కు ఏలూరు పార్ల‌మెంట్ ఎంపీ టికెట్ ఇచ్చారు..ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓట‌మి పాలయ్యారు...
 
అలాగే 2014 లో కూడా ఆయ‌న‌కు చంద్ర‌బాబు  టికెట్ ఇవ్వ‌డంతో ఆయ‌న ఏలూరు ఎంపీగా గెలిచారు.... ఇక 2009 ఎన్నిక‌ల్లో చింత‌మ‌నేని ప్ర‌భాకర్ కు దెందులూరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు.. దెందులూరులో కాంగ్రెస్ హావాలో గెల‌వ‌డంతో ఆయ‌న‌కు రెండ‌వ ట‌ర్మ్ లో కూడా టికెట్ ఇచ్చారు  చంద్ర‌బాబు... దీంతో 2014 ఎన్నిక‌ల్లో కూడా చింత‌మ‌నేని గెలుపొందారు.
 
ఇక 2014 ఎన్నిక‌ల్లో గెలిచ‌న ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తుంది అనుకున్నారు... అయితే చంద్ర‌బాబు ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేదు... ఆయ‌న‌కు ప్ర‌భుత్వ విప్ ప‌ద‌వి ఇచ్చారు సీఎం చంద్ర‌బాబు. ఇక ఇక్క‌డ 2009 లో కొఠారు రామ‌చంద్ర‌రావు కాంగ్రెస్ త‌ర‌పున చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్  పై నిలుచున్నారు... అయితే ఆయ‌న ఓట‌మి పాల‌య్యారు.. ఇక కాంగ్రెస్ పార్టీ 2014 లో ఏపీలో ఉనికిని కోల్పోయింది... వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీని   జ‌గ‌న్ స్ధాపించ‌డంతో, త‌ణుకు మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వ‌ర‌రావుకు ఇక్క‌డ సీటు ఇచ్చారు జ‌గ‌న్..
 
దీంతో ఆయ‌న స్ధానికుడు కాక‌పోవ‌డం సామాజిక అంశాల లెక్క‌ల్లో  ఏపీలో బీజేపీ బాబు హావాతో కారుమూరి ఓట‌మిపాల‌య్యారు... ఇక  ఇక్క‌డ బాధ్య‌త‌లు కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరిన  కొఠారు రామ‌చంద్ర‌రావుకు అప్ప‌గించారు జ‌గ‌న్.. ఇటీవ‌ల ఆయ‌న త‌న‌యుడు కొఠారు అబ్బ‌య్య చౌద‌రి యూకే నుంచి రావ‌డంతో ఇక్క‌డ ఆయ‌న‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు మ‌ర‌లా జ‌గ‌న్.
 
ఇప్ప‌డు దెందులూరు బాధ్య‌త‌లు అబ్బ‌య్య‌చౌద‌రి చూసుకుంటున్నారు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున‌.. ఇక దెందులూరులో అనేక వివాదాలకు కేరాఫ్ అడ్ర‌స్ అయ్యారు చింత‌మ‌నేని... ఇసుక వివాదం, నాయ‌కుల పై దూష‌ణ‌లు, ఉద్యోగుల‌పై దూష‌ణ‌లు, పార్టీ కాని వారి పై దాడులు చేయ‌డం,  చెరువుల వివాదం, ఇసుక వివాదంలో ఎమ్మార్వో వ‌న‌జాక్షి పై దాడి ఇలా ప‌లు వివాదాలు ఆయ‌న‌ను చుట్టుముట్టాయి.
 
అలాగే మాజీ మంత్రి వ‌ట్టి వ‌సంత‌కుమార్ పై దాడి కేసులో శిక్ష కూడా ప‌డింది.. అయినా ఆయ‌న దూకుడులో ఎటువంటి వెన‌క‌డుగు ప‌డ‌టం లేదు... ఇక గ‌తంలో అట‌వీ అధికారులపై విరుచుకుప‌డ‌టం, పార్టీ నాయ‌కుల‌పై కారు పై కూర్చుని దూష‌ణ‌లు చేయ‌డం, అలాగే తెలుగుదేశం నాయ‌కుల‌కు పెత్త‌నం ఇవ్వ‌డం ఇవ‌న్ని ఆయ‌న పై వ్య‌తిరేక‌త‌ను మ‌రింత పెంచాయి. ఇక మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేద‌ని పార్టీ పై గుర్రుగా కొద్ది రోజులు ఉండ‌టం ఇవ‌న్నీ ఆయ‌న‌కు మైనస్ అయ్యారు.
 
ఇక వైసీపీ త‌ర‌పున కూడా ఇక్క‌డ మ‌రింత ముందుకు వెళ్లాలి... ఎంత వ్య‌తిరేక‌త చింత‌మ‌నేని పై ఉన్నా తెలుగుదేశం పై అభిమానం మాత్రం ఇక్క‌డ బ‌లంగా ఉంది కొద్ది మంది ప్ర‌జ‌ల్లో.. అయితే పార్టీ ఫెయిల్ అవ్వ‌డం ప్ర‌త్యేక హూదా విష‌యంలో  రెండు నాల్క‌ల దోర‌ణి అవ‌లంభించ‌డం ఇవ‌న్నీ పార్టీకి మైన‌స్ అవుతున్నాయి. ఇక దెందులూరు ఎమ్మెల్యేగా చింత‌మ‌నేని రెండు సార్లు గెలిచారు... అయితే అభివృద్ది మాత్రం న‌త్త‌న‌డ‌క‌న సాగుతోంది అంటున్నారు
 
ఇక వైసీపీ నాయ‌కుడు స‌మ‌న్వ‌య‌క‌త్త అబ్బ‌య్య చౌద‌రి కూడా నెల రోజుల పాటు విరివిగా క‌లిసి మెలిసి నాయ‌కుల‌తో తిరిగారు ....పార్టీ కేడ‌ర్ ను స‌మాయ‌త్తం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు... వ‌య‌సుతో భేదం లేకుండా తండ్రి వెనుక ఉన్న‌కేడ‌ర్ తో ముందుకు వెళుతున్నారు ఆయ‌న‌..... ఇక దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలో జ‌గ‌న్ కూడా అబ్బ‌య్య చౌద‌రిని వ‌చ్చే ఎన్నిక‌ల్లో నిల‌బ‌డ‌మ‌ని కొఠారు ఫ్యామిలీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.
 
ఇక తెలుగుదేశంలో చింత‌మ‌నేని కాకుండా ఎవ‌రికి ఇక్క‌డ సీటు ఇవ్వ‌డానికి ప్ర‌త్యామ్నాయం క‌నిపించ‌డం లేదు... లేక‌పోతే మాగంటి ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఎవ‌రో ఒక‌రు ఇక్క‌డ నిలిచే అవ‌కాశం ఉంది అని అంటున్నారు మ‌రి కొంద‌రు. మ‌రోసారి గెలిచి చింత‌మ‌నేని త‌న విజయంతో  హ్యాట్రిక్  చేస్తా అంటున్నారు... మ‌రో ప‌క్క యంగ్ ఎమ్మెల్యే అవ్వాలి అని కొఠారు అబ్బ‌య్య చౌద‌రి ప్లాన్ ర‌చించుకుంటున్నారు.. ప్ర‌జా తీర్పు ఎటువైపు అనేది చూడాలి వెయిట్ అండ్ సీ.

షేర్ :

Comments

1 Comment

  1. Ycp win

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.