రాఘ‌వేంద్ర‌స్వామి స‌న్నిధిలో పాగా వేసేదెవ‌రు..?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-20 10:45:33

రాఘ‌వేంద్ర‌స్వామి స‌న్నిధిలో పాగా వేసేదెవ‌రు..?

ఆంధ్రప్ర‌దేశ్ లో క‌ర్నూలు రాజ‌కీయాలు ఎప్పుడూ ఆస‌క్తిక‌రంగానే ఉంటాయి. ఈ  జిల్లాలో గ‌త ఎన్నిక‌ల్లో మొత్తం 14 స్ధానాల‌కుగానూ మూడింట మాత్ర‌మే తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్ధులు గెలిచారు. మిగ‌తా 11 నియోజ‌క‌వ‌ర్గాల్లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్ధులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. 
 
అయితే ఎన్నిక‌ల త‌ర్వాత ఏర్ప‌డిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో వైసీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి ఫిరాయించారు. రాష్ట్రంలో ఫిరాయింపులు ఎక్కువగా జ‌రిగిన జిల్లా కావ‌డంతో రాష్ట్రంలో అంద‌రి క‌ళ్లు ఈ జిల్లా పైనే ఉన్నాయ‌ని చెప్ప‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. 
 
ఇక ఈ జిల్లాలో ఉన్న మంత్రాల‌యం నియోజ‌క‌వ‌ర్గం మ‌న రాష్ట్రానికే కాదు..ప‌క్క రాష్ట్రాల‌కు కూడా పరిచయం. ఎందుకుంటే ఇక్క‌డ రాఘ‌వేంద్ర స్వామి పుణ్య‌క్షేత్రం ఉన్నందున వివిధ రాష్ట్రాల నుండి పెద్ద  ఎత్తున భ‌క్తులు త‌ర‌లివ‌స్తుంటారు. 
 
దివంగ‌త నేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌పుడు 2008 లో జ‌రిగిన‌ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో ఎమ్మిగ‌నూరులో ఉన్న మంత్రాల‌యం కొత్త అసెంబ్లీ సెగ్మెంట్ గా ఏర్ప‌డింది. అప్పుడు ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ హ‌వా కొన‌సాగుతూ ఉండేది. దీంతో ఎమ్మిగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గంలో తిరుగులేని నాయ‌కుడిగా ఉన్న దివంగ‌త టీడీపీ సీనియ‌ర్ నేత, మాజీ మంత్రి  బి.వి మోహ‌న్ రెడ్డి స‌హ‌కారంతో అప్ప‌టికే మంత్రాల‌యం ప్రాంతంలో రాజ‌కీయ నేప‌థ్యం క‌లిగి ఉండి,  మంచి పేరున్న వై. బాల‌నాగి రెడ్డికి 2009 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున టికెట్టు ద‌క్కింది. 
 
2009 ఎన్నిక‌ల్లో బాల‌ నాగి రెడ్డి గెలిచిన్న‌ప్ప‌టికీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేదు. దీంతో బాలనాగి రెడ్డి,  కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ఇచ్చి టీడీపీ రెబ‌ల్ ఎమ్మెల్యేగా కొన‌సాగారు. ఆ త‌ర్వాత జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాలు అంద‌రికీ తెలిసిందే. హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో  ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి  మ‌ర‌ణించ‌డం... వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీని స్ధాపించ‌డం.........దీంతో   బాల‌నాగి రెడ్డి వైసీపీలో చేరి ఆ పార్టీ త‌ర‌పున  2014 ఎన్నిక‌ల్లో పోటీ చేసి గెలుపొంద‌డం జ‌రిగిపోయింది. అయితే దుర‌దృష్ట‌వశాత్తు రెండో సారి కూడా బాల నాగి రెడ్డి ప్ర‌తిపక్ష ఎమ్మెల్యేగానే కొన‌సాగాల్సి వ‌చ్చింది. 
 
ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి  ప్ర‌తిప‌క్షపార్టీకి చెందిన  ఎమ్మెల్యే  కావ‌డం చేత ప్ర‌భుత్వం నుండి నిధులు తీసుకు రాలేక‌పోతున్నారు. మొన్న‌టి వ‌ర‌కు వైసీపీలో ఉన్న ఎంపీ బుట్టా రేణుక స‌హాయంతో ప‌లు అభివృద్ది కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు ఎమ్మెల్యే బాల‌నాగి రెడ్డి. పెద్ద‌క‌డుబూరు మండ‌లంలో ఫ్లోరైడ్ వంటి స‌మ‌స్య‌ల‌ను ఇంకా ప‌రిష్క‌రించాల్సి ఉంది. 
 
ఈ నియోజ‌క‌వ‌ర్గం తుంగ‌భ‌ద్ర నది తీరాన ఉన్న‌ప్ప‌టికీ ప‌లు గ్రామాల్లో ఇంకా తాగునీటి స‌మ‌స్య  ఉండ‌టం గ‌మ‌నార్హం. దీంతో పాటు  పులిక‌నుమ‌, ఆర్టీఎస్ వంటి ప‌లు స్కీంలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యే కావ‌డం చేత‌నే తాను ఈ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కారించ‌లేక‌పోతున్నామ‌నేది ఎమ్మెల్యే వాద‌న‌.
 
రాఘ‌వేంద్ర స్వామి పుణ్య క్షేత్రం ఉన్నందున  క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం నిధులు కేటాయించింది. దీని ద్వారా మంత్రాల‌యంలో స్ధానికంగా రోడ్లు, తాగు నీటి స‌మ‌స్య‌లు తీరిపోతున్నాయి. వ్య‌క్తిగ‌తంగా ఆధ్యాత్మికత ఎక్కువ ఉండ‌టం చేత స‌హాయం కోరితే మాత్రం ఏమాత్రం సందేహం చేయ‌కుండా  ఆదుకునే మ‌న‌స్త‌త్వం బాల‌నాగి రెడ్డిది.
 
ఈ నియోజ‌క‌వ‌ర్గం క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దులో ఉన్నందున ప్ర‌భుత్వ అధికారులు ఎక్కువగా దృష్టి సారించ‌డం లేదు. ఈ కార‌ణంగా కూడా అభివృద్దికి నోచుకోవ‌డం లేద‌ని చెప్ప‌వచ్చు. కాంగ్రెస్ హ‌యాంలో బాల‌నాగి రెడ్డి  చేసిన అభివృద్దే ఇంకా క‌నిపిస్తూ ఉంది అంతేకాని కొత్త‌గా చెప్పుకోద‌గిన ప‌నులు ఏవీ జ‌ర‌గ‌లేదు. 
 
గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున పోటీ చేసి ఓడిపోయిన తిక్కా రెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో క్షేత్ర స్ధాయిలో బ‌లాన్ని పెంచుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. తిక్కా రెడ్డిని ఇక్క‌డ ప్ర‌జ‌లు ఇంకా పారిశ్రామిక వేత్త‌గానే చూస్తున్నారు కావున,  తిక్కా రెడ్డి  పూర్తి స్ధాయిలో రాజ‌కీయ ల‌క్ష‌ణాల‌ను అల‌వ‌ర్చుకుని పార్టీ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల్సిన అవ‌స‌రం ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా ఎమ్మెల్యేగా తిక్కా రెడ్డినే పోటీ చేస్తార‌ని ఇప్ప‌టికే ఉప ముఖ్య‌మంత్రి కే.ఈ క్రిష్ణ‌మూర్తి ప్ర‌క‌టించారు కావున,  స్ధానికంగా ఉన్న కీల‌క నేత‌లతో విభేదాలు  ప‌రిష్క‌రించుకుని, అంద‌రిని క‌లుపుకుని ఇప్ప‌టికైనా ప్ర‌జ‌ల్లోకి దూసుకుపోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. 
 
వైసీపీ త‌ర‌పున పోటీ చేసిన బాల‌నాగి రెడ్డి కుటుంబానికి ఇక్కడ చాలా మంచి పేరుంది. దానికి తోడు వైసీపీకి ఓటు బ్యాంకు ఉండడంతో ఇక్కడ గెలుపు సులభమైంది.  బాల‌నాగి రెడ్డి స్ధానికుడు కావ‌డం వైసీపీకి బ‌ల‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. వైసీపీ నుండి బాల‌నాగి రెడ్డి కాకుండా ఇత‌రులు ఎవ‌రైనా పోటీ చేస్తే టీడీపీకి అవ‌కాశం ఇచ్చిన‌ట్లే అవుతుంద‌ని ఖ‌చ్చితంగా చెప్ప‌వ‌చ్చు. 
 
మంత్రాల‌యం గ‌తంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోట‌. టీడీపీలో ఉన్న నాయ‌కుల మ‌ధ్య స‌ఖ్య‌త లేక‌పోవ‌డం కార‌ణంగానే పార్టీల కంటే కూడా అభ్య‌ర్ధికే ఇక్క‌డ ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నారు. అందువ‌ల్ల ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటూ స్ధానిక టీడీపీ నేత‌ల‌ను, క్యాడ‌ర్ ను క‌లుపుకుని పోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. టీడీపీ నేత‌లు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కంటే కూడా ఎక్కువ‌గా ప‌క్క నియోజ‌క‌వ‌ర్గమైన ఎమ్మిగ‌నూరులో ఉంటార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తిక్కారెడ్డి అంబాటులో ఉండరు అంటున్నారు అక్కడ ప్రజలు... 
 
క‌న్క్లూజ‌న్ 
 
మొత్తానికి రాఘ‌వేంద్ర స్వామి పుణ్య‌క్షేత్రం గ‌త ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్న  వై. బాల‌నాగి రెడ్డిని కాద‌ని తెలుగుదేశం పార్టీ పాగా వేయాలంటే,  స్ధానిక  టీడీపీ నేత‌లు అందరూ క‌లిసిగ‌ట్టుగా ముందుకు సాగిన, టీడీపీ అభ్యర్థి విజయం సాధించడం కష్టం... 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.