శ్రీకాంత్ రెడ్డి దూకుడును టీడీపీ ఆపేనా..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-16 15:37:11

శ్రీకాంత్ రెడ్డి దూకుడును టీడీపీ ఆపేనా..

క‌డ‌ప జిల్లా రాజ‌కీయాలు ఎప్పుడూ ఆస‌క్తికరంగానే ఉంటాయి. ఎందుకంటే వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన‌టువంటి ఈ జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీ పాగా వేసేందుకు  చేస్తున్న ప్ర‌య‌త్నాలు అన్నీ ఇన్నీ కావు. ఏ మాత్రం అవ‌కాశం ఉన్నా టీడీపీ నాయ‌కులు ప‌రిస్ధితుల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. కాని వైసీపీకి కంచుకోట కావ‌డంతో టీడీపీకి ఇది సాధ్యప‌డ‌టం లేద‌ని చెప్ప‌వ‌చ్చు. 
 
క‌డప జిల్లాలో కరువు నియోజ‌క‌వ‌ర్గంగా పేరున్న రాయ‌చోటి పై అధికార పార్టీ ఎప్ప‌టి నుండో క‌న్నేసింది. కాని అక్క‌డ  వైయ‌స్ ఫ్యామిలీకి అత్యంత స‌న్నిహితుడు అయిన‌ గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్నారు. దీంతో టీడీపీ చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌డం లేదు. రాయ‌చోటి నియోజ‌క‌వ‌ర్గం నీటి స‌మ‌స్య‌ల‌కు పుట్టినిల్లు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యేల గెలుపోట‌మిలో మైనారిటీలు కీల‌క పాత్ర పోషిస్తున్నారు. 
 
రాయ‌చోటి నియోజకవర్గంపై జనహితం గ్రౌండ్ రిపోర్ట్..
ఎమ్మెల్యేగా ఉన్న శ్రీకాంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యల మీద పోరాడటంలో ముందుంటారు.. కేవలం నియోజకవర్గంలోని సమస్యలపైనే కాకుండా, రాష్ట్రంలోని అన్ని సమస్యలపైనా పోరాడుతూ, టీడీపీ చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతూ, టీడీపీ వైఫల్యాలను ఎండగడుతూ.రాష్ట్రంలో రాజ‌కీయంగా తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు.అధికార పార్టీకి కౌంటర్లు ఇవ్వడంలో ముందుంటారు,దీంతో జగన్ కి రైట్ హ్యాండ్ గా పేరు తెచ్చుకున్నారు.
 
ప్ర‌తిపక్ష‌ హోదాలో  ఉన్నందున రాయచోటి నియోజకవర్గంలో త్రాగునీటి సమస్యను పూర్తి స్ధాయిలో ప‌రిష్కరించ‌లేక‌పోయారు. దీంతో ప్ర‌జ‌లు కాస్త అసంతృప్తితో ఉన్నారు.టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ర‌మేష్ రెడ్డి గ‌తంలో కాంగ్రెస్ పార్టీలో ప‌నిచేశారు. ప్ర‌స్తుతం రాయ‌చోటి టీడీపీ  నియోజ‌క‌వ‌ర్గ ఇన్ చార్జ్ బాధ్య‌తలు నిర్వ‌హిస్తున్నారు. పైగా ఆయ‌న త‌మ్ముడు శ్రీనివాస్ రెడ్డి  క‌డ‌ప జిల్లా అధ్యక్ష ప‌ద‌విలో ఉన్నారు.దీంతో ర‌మేష్ రెడ్డి వ‌ర్గానికి, స్ధానిక సీనియ‌ర్ టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే పాల‌కొండ్రాయుడు వ‌ర్గానికి మ‌ధ్య దూరం పెరిగింది. 
 
ప్ర‌జా స‌మ‌స‌ల్య‌పై ర‌మేష్ రెడ్డి స్పందిస్తున్న‌ప్ప‌టికీ ఎమ్మెల్యే ప‌ద‌వి కోస‌మే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌నే భావ‌న ప్ర‌జ‌ల్లో ఉంది. ఇక నియోజ‌క‌వ‌ర్గంలో మైనారిటీలు, రెడ్లు అధికంగా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ క్ర‌మంలో  అధికారంలో ఉన్నారు కావున అన్ని సామాజిక వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకునేలా ప‌లు అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేపడితే గాని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో  ర‌మేష్ రెడ్డిని ప్ర‌జ‌లు ఆద‌రించేలా క‌నిపించ‌డం లేదు. 
 
ఈ నియోజకవర్గంలో గెలుపోటములను డిసైడ్ చేసే మైనార్టీలు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. రెడ్డి సామాజిక వర్గం కూడా ఎక్కువగా ఉండటం వైసీపీకి కలిసివచ్చే అంశం. దీనికి తోడు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సమస్యల పై పోరాడటంలో ముందు ఉండడంతో మెజారిటీ ప్రజలు వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నారు. బీసీలు వైసీపీకి దూరంగా ఉంటున్నారు, వరుసగా మూడు సార్లు గెలిచినా శ్రీకాంత్ రెడ్డిపై కొంచెం వ్యతిరేఖత ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ టీడీపీ వ్యతిరేఖ ఓట్లతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో శ్రీకాంత్ రెడ్డి గెలుపు నల్లేరుపై నడకే.
 
ఈ నియోజకవర్గంలో ముస్లింల తర్వాత స్థానం బీసీలదే.. వీరంతా టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడుకు, ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ రెడ్డికి మధ్య ఉన్న ఆధిప‌త్య పోరుతోపాటు టీడీపీ వైపు నడుస్తున్న బీసీలను ముందుండి నడిపించే సరైన నాయకుడు లేకపోవడంతో బీసీలలో టీడీపీ పైన ఉన్న నమ్మకం సన్నగిల్లడంతో ఇప్పుడు వాళ్ళు కూడా వైసీపీవైపే మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయి. పాలకొండ్రాయుడు, రమేష్ రెడ్డిలు అంత‌ర్గ‌త పోరు ప‌క్క‌కు పెట్టి కార్యకర్తలను కలుపుకొని ముందుకు సాగితే కాస్త ఫలితం క‌నిపింస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. 
 
మూడు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన‌టువంటి శ్రీకాంత్ రెడ్డిని ఢీ కొట్టడానికి శతవిధాలుగా ప్రయత్నాలు జరుపుతుంది. ఈ ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతమవుతాయనేది చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.