టీడీపీ ఎమ్మెల్యే @ భూ క‌జ్బా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp flag
Updated:  2018-07-17 02:01:41

టీడీపీ ఎమ్మెల్యే @ భూ క‌జ్బా

ఓ వైపు స‌ముద్ర తీరం మ‌రోవైపు ఎతైన కొండ‌ల‌పై ఇళ్లు, ఇలాంటి విభిన్న‌మైన వాతావ‌ర‌ణం మద్య విశాక తూర్పు నియోజ‌క‌వ‌ర్గం విస్త‌రించింది. గ్రేట‌ర్ మున్సిప‌ల్ విశాఖ ప‌రిధిలోని ఒక‌టి నుంచి ప‌ద‌కొండు వార్డుల‌తో పాటు అటు 53,54,55, వార్డులు తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్నాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పేద సామాన్య‌ మ‌ధ్య త‌ర‌గ‌తి తోపాటు ధ‌నిక వర్గాని చెందిన వారుకూడా నివ‌సించే సంకేతాలు ఉన్నాయి. అంతేకాదు నియోజ‌క‌వ‌ర్గంలో 2ల‌క్ష‌ల 56 వేల 548 మంది ఓట‌ర్లు ఉండ‌గా ఇందులో పురుషుల ఓట‌ర్ల సంఖ్య 1 ల‌క్షా 29 వేల 482 ఓట‌ర్లు ఉండగా, మ‌హిళా ఓట‌ర్లు  1 ల‌క్షా 27వేల 56 ఓట్లు ఉన్నాయి. 
 
గెలుపు ఓట‌ముల‌ను నిర్ణ‌యించేది వీరే..
 
అయితే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో యాద‌వ సామాజిక వ‌ర్గానికి చెందిన వారి ఓట్ల ప్ర‌భావం అధికంగా ఉంటుంది. ఇక వీరి త‌ర్వాత ద‌ళితులు, కాపులు, మ‌త్స్య‌కార ఓట్ల అభ్య‌ర్థులు గెలుపు ఓట‌మిల‌పైన చూపుతూ ఉంటాయి. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత విశాఖ న‌గ‌రంలో నియోజ‌క‌వ‌ర్గాలు ఏర్ప‌డ్డాయి. ఇక వీటిలో ఒక‌టైన విశాఖ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో 2014లో తెలుగుదేశం పార్టీ త‌ర‌పున పోటీ చేసి వెల‌గ‌పుడి రామ‌కృష్ణ బాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి వంశికృష్ణ శ్రీనివాస్ యాద‌వ్ పై 47, 883 ఓట్ల ఆధిక్య‌తతో గెలిచారు. అయితే ప్ర‌స్తుతం నాలుగేళ్లు పూర్తిచేసుకుని ఐద‌వ సంవ‌త్స‌రంలోకి ప్ర‌వేసించిన ఎమ్మెల్యే వెల‌గ‌పుడి రామ‌కృష్ణ బాబు ప‌రిపాల‌పై నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు అనేక విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.
 
ఎమ్మెల్యే @ వైన్ షాప్..
 
త‌మ ఎమ్మెల్యే నాలుగేళ్ల‌లో జ‌రిగిన శాస‌స‌భా స‌మావేశాల్లో నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌ను ఒక్కరోజు కూడా  ప్ర‌స్తావించ‌లేద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ ఎయిమ్స్ ను ఉత్త‌రాంధ్ర‌లతో పాటు అటు పొరుగు రాష్ట్రాలు ఒరిస్సా ఛ‌త్తీశ్ గ‌డ్ రోగుల‌కు ఎయిమ్స్ త‌ర‌హాలో వైద్య‌సేవ‌లు అందించేందుకు వీలుగా తీర్చి దిద్దుతామ‌ని గ‌త ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో టీడీపీ అధినేతతో పాటు వెల‌గ‌పుడి రామ‌కృష్ణ బాబు కూడా హామీ ఇచ్చారు. అయితే ప్ర‌స్తుతం ఆ సంస్థ‌ను ప్రైవేటీ క‌ర‌ణ‌ చేయ‌టానికి టీడీపీ స‌ర్కార్ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. ఇక నియోజ‌క‌వ‌ర్గంలోని ఏరులై పారుతున్న మ‌ధ్యాన్ని నియ‌త్రించాల్సిన ఎమ్మెల్యే తానే అనేక వైన్స్ షాప్ల‌ను త‌న అనుచ‌రుత‌లో క‌లిసి నిర్వ‌హిస్తుండ‌టంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల పాలు అవుతున్నారు. 
 
నీకు 50 నాకు 50 అన్న చందంగా..
 
తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలోని ఆద‌ర్శ్ న‌గ‌ర్ లో గుర్ర‌పు పందాల‌ను నిర్వ‌హించ‌డంతో వేలాది కుటుంబాలు అప్పుల పాలు అవుతున్నాయి. అయితే నిజానికి ఈ గుర్ర‌పు పందాలు నిర్వాహంను ఎమ్మెల్యే అడ్డుక‌ట్ట‌క వేయ‌క‌పోగా పందాల నిర్వాహ‌కుల‌తో చేతులు క‌లిపార‌ని నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌జ‌లు ఆరోపిస్తున్నారు. సంక్రాంతి పండుగ వ‌చ్చినా ద‌స‌రా పండుగ వ‌చ్చినా తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో విచ్చ‌ల‌విడిగా కోడిపందాల నిర్వాహ‌ణ సాగిపోతుంది. అయితే కోడిపందాల నిర్వాహ‌ణ‌పై హైకోర్ట్ నిషేదం ఉన్నా కోర్ట్ నింద‌ల‌ను ఉళ్లంగించి ద‌గ్గ‌రుండి ఎమ్మెల్యేనే పోటీల‌ను నిర్వ‌హిస్తార‌న్న ఆరోప‌న‌లు కోకొల్లులుగా వినిపిస్తున్నాయి. 
 
సింహాచ‌లం కొండ‌ల‌పై నివాసం ఉంటున్న ప్ర‌జ‌ల భూ స‌మ‌స్య‌ల‌ను ప‌రిస్క‌రిస్తాన‌న్నఎమ్మెల్యే వెల‌గ‌పుడి ఆ హామీల‌ని ఎప్పుడో ప‌క్క‌న పెట్టేశారు. దేశంలో పురాత‌న విశ్వ‌విద్యాల‌యంగా ప్ర‌సిద్ది చెందిన ఆంధ్ర‌విశ్వ‌విధ్యాలాయంలోని మ‌రో వెయ్యి మంది ఉద్యోగుల‌ను క్ర‌మ బ‌ద్దీక‌రిస్తామ‌న్న హామీను నేటికి నెర‌వేర్చ‌లేదు. 
 
ఎక్క‌డి స‌మ‌స్య అక్క‌డే..
 
ఇక ముడ‌స‌ర్లోవ రిజ‌ర్వ‌యార్ ఆధునీక‌ర‌ణ చేప‌ట్ట‌లేదు. అలాగే తీర ప్రాంతాలైన జోడుగుళ్ల‌పాళెం, పెద‌జాల‌రిపేట‌, అప్పూఘ‌ర్ ప్రాంత మ‌త్స్య‌కారుల స‌మ‌స్య‌ల‌ను అలాగే ఉన్నాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో చాలా వార్డుల్లో నీటి స‌మ‌స్య‌తో పాటు డ్రైనేజ్ స‌మ‌స్య తీవ్ర‌స్థాయిలో ఉంది.
 
చిన్న‌ వ‌ర్షాల‌కే చాలా ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మ‌వుతున్నాయి. అధికారులు నాసి ర‌కం ప‌నుల‌ను చేప‌ట్ట‌డం వల్ల అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్ట‌మ్ స‌రిగ్గా ప‌నిచేయ‌టం లేదు. అయితే ఈ క్ర‌మంలో ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌ల‌ను ఎన్ని సార్లు వివ‌రించినా ఎమ్మెల్యేలో  ఏ మాత్రం స్పంద‌న ఉండటం లేదు. రాష్ట్రంలో అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉన్న‌ట్లే ఇక్క‌డ కూడా జ‌న్మభూమి క‌మిటీలు టీడీపీ కార్య‌క‌ర్త‌లు దౌర్జ‌న్యాలు నిస్సీగ్గుగా కొన‌సాగుతున్నాయ‌ని ప్ర‌జ‌లు వాపోతున్నారు. 
 
నువ్వు టీడీపీ వ్య‌క్తివా అయితే ఇళ్లు తీసుకో..
 
పేద‌లు ఇచ్చిన ఇళ్ల‌ను ఎమ్మెల్యే త‌న మ‌నుషుల‌కే కేటాయించేలా ద‌గ్గ‌రుండి జాగ్ర‌త్తలు తీసుకుంటున్నార‌ని ప్ర‌జ‌లు వాపోతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్క‌డ కాళీ స్థలం క‌నిపిస్తే అక్క‌డ ఎమ్మెల్యే త‌న అనుచ‌రుల‌తో పాగ‌వేయించేస్తార‌ని ప్ర‌జ‌లు చేబుతున్నారు. బీసీల‌సు ఉద్ద‌రిస్తున్నామ‌ని, బీసీల కోసమే పార్టీ పుట్టంద‌ని చెప్పుకుని ప్ర‌చారం చేసుకునే టీడీపీ నాయ‌కులు వెనుక‌బ‌డిన కులాల‌వారిని దోచుకుంటున్నార‌ని నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ఆవేద‌న చెందుతున్నారు. 
 
సాదువుల‌ను కూడా వ‌ద‌ల‌డంలేదు..
 
ఇక చివ‌రిగా సాదువుల భూముల‌ను కూడా వ‌ద‌ల‌ని ఎమ్మెల్యే వెల‌గ‌పుడి హ‌నుమంత వాక‌లో సుమారు 500 కోట్ల రూపాలు విలువ‌చేసే ప‌ద‌కొండు ఎక‌రాలు స్వాధీనం చేసుకుంటున్న‌ట్లుగా ప్ర‌జ‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అయితే ఇప్ప‌టికే త‌న అనుచ‌రుల‌తో సుమారు రెండు ఎకరాల‌ను త‌న ఖాతాలో వేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఏపీ ఐఐసీకి కోట్ల రూపాల‌కు విల‌వ‌చేసే భూముల‌ను ప్రైవేట్ సంస్థ నూలు కంపెనీకి కారు చౌక‌గా క‌ట్ట‌బెట్టిన ఘ‌న‌త కూడా ఎమ్మెల్యే వెల‌గ‌పుడి రామ‌కృష్ణ బాబుదే అని విమ‌ర్శ ఉంది. ఇక ఇలాంటి ఎమ్మెల్యేకు సీఎం చంద్ర‌బాబు నెంబ‌ర్ వ‌న్ అని గ్రేడింగ్ ఎలా ఇస్తార‌ని వామ‌ప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. 
 
భూ దందాలు సెటిల్ మెంట్ ల ద్వారా వ‌సూళ్లు ఏరులై ప్ర‌వ‌హిస్తున్న మ‌ధ్యం దుకాణాలు బెల్ట్ షాపుతో రెచ్చిపోతున్న ఎమ్మెల్యే వెలగ‌పుడిపై ప్ర‌జ‌ల్లో తీవ్రస్థాయిలో వ్య‌తిరేక‌త ఉంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఏ వ‌ర్గాన్ని క‌దిలించినా అంద‌రూ త‌మ‌కు ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌డంలేద‌ని ప్ర‌స్తావిస్తూ ఆవేద‌న చెందుతూ, వెలగ‌పుడి రామ‌కృష్ణ బాబుకు ఓటు వేసినందుకు బ‌హిరంగంగానే చెప్పుకుంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.