మొఖం చూపించ లేకపోతున్న టీడీపీ ఎమ్మెల్యే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-27 17:56:29

మొఖం చూపించ లేకపోతున్న టీడీపీ ఎమ్మెల్యే

ప‌ల్నాడు ఫ్యాక్ష‌న్ కు మారుపేరు అయిన ఈ ప్రాంతం చాలా సంవ‌త్సారాల నుంచి వెనుక‌బ‌డిన ప్రాంతంగా విమ‌ర్శ‌లు ఉన్నాయి. అయితే అక్క‌డి నుంచే గెలిచిన అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే శ్రీనివాస్ రావు మాత్రం ఈ వెనుక బాటుత‌నాన్ని పెట్టుబ‌డిగా మార్చుకున్నార‌ట‌. నియోజ‌వ‌ర్గంలోని ఖ‌నిజ సంప‌ద‌ను అక్క‌డ స్వాధినం చేసుకుని అక్ర‌మంగా డ‌బ్బుల‌ను సంపాదించుకుంటున్నారు. ఇక ఈ వ్య‌వ‌హారం తారాస్థాయికి చేరుకోవ‌డంతో చివ‌రికి హైకోర్ట్ జోక్యంతో మ‌రోసారి వెలుగులోకి వ‌చ్చింది. గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిచిన య‌ర‌ప‌తినేని శ్రీనివాస్ రావు నియోజ‌వ‌ర్గాన్ని ఏమైనా అభివృద్ది చేశారా అంటే చేప్పుకోవ‌టానికి ఏమిలేద‌ని అంటున్నారు గ్రామ‌స్తులు.
 
అయితే ఎమ్మెల్యే మాత్రం వంద‌ల‌కోట్లు దండుకుని ఎవ‌రికి అంద‌నంత స్థాయిలో అభివృద్ది చెందార‌న్న ఆరోప‌ణ‌ల‌ను సొంత త‌మ్ముళ్లే విమ‌ర్శ‌లు చేస్తున్నారు. నియోజ‌వ‌ర్గంలోని కేసాను ప‌ల్లే, పిడుగురాళ్ల త‌దిత‌ర ప్రాంతాల్లో వంద‌లాది ఎక‌రాల్లో ఉన్న సున్న‌పు రాయిని అడ్డంగా తవ్వి తీసేస్తున్నార‌ట‌. ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి అనుమ‌తుల‌ను తీసుకోకుండా అధికార ద‌ర్పంతో ఉన్న‌దంతా దోచుకుంటున్నారు. అంతేకాదు ఈ స‌రుకును రాష్ట్ర స‌రిహ‌ద్దుల‌ను దాటించి వంద‌ల‌కోట్ల‌ను దాచేస్తున్నారు. 
 
అయితే య‌ర‌ప‌తినేని అక్ర‌మాల‌పై గ‌తంలో స్థానికులు ప్ర‌జా ప్ర‌తిప‌క్ష‌నేత‌లు ఉన్నతాదికారుల‌కు ఫిర్యాదు చేసినా ఫ‌లితం లేకుండా పోయింది. దీంతో ఈ వ్య‌వ‌హారం కోర్టువ‌ర‌కు వెళ్లింది. అయితే కోర్ట్ అధికారులు మొటిక్కాయ‌ల‌ను వేసి అక్ర‌మ మైనింగ్ ఆప‌మ‌ని ఆయ‌న‌కు ఆదేశాల‌ను ఇచ్చినా ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని ఆప‌లేదు. ఇక చివ‌రికి మ‌ళ్లీ మ‌రోసారి మైనింగ్ వ్య‌వ‌హారం కోర్ట్ దృష్టికి వెళ్ల‌డంతో హైకోర్ట్ సీరియ‌స్ గా రియాక్ట్ అయింది. 
 
అధికారులు మౌనం దాల్చ‌డం ఎమ్మెల్యేకు స‌హ‌క‌రించ‌టంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అంతేకాదు కాగ్ తో విచార‌ణ జ‌రిపిస్తాన‌న‌టం కేంద్ర మైనింగ్ శాఖ‌తో విచార‌ణ చేయిస్తాన‌న‌టంతో అక్ర‌మ ఘ‌నుడు య‌ర‌ప‌తినేనికి వెన్నులో వ‌ణుకు మొద‌లైంద‌ట‌. 
 
ప్రస్తుతం ఈ వ్య‌వ‌హారం ఎటు తిరిగి ఎటు వ‌స్తుందో అన్న భ‌యం ఆ పార్టీ అధిష్టానంలో నెల‌కొంద‌ట‌. అయితే ఇప్ప‌టికే 270 కోట్ల‌కు పైగా ఖ‌నిజ సంప‌ద‌ను దోచుకున్నట్లు అధికారులు ప్రాథ‌మికంగా ఒక అంచ‌నాకు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. కానీ వాస్త‌వానికి అంత‌కంటే రెండు రెట్లు ఎక్కువ‌గా ఉంటుంద‌ని ప‌ల్నాడులో కోడై కూస్తోంది. దీంతో య‌ర‌ప‌తినేని వ్య‌వ‌హారం పార్టీలో అంత‌ర్మ‌ద‌నానికి దారి తీసింద‌ట‌. ఆయ‌న మైనింగ్ వ్య‌వ‌హారంలో జోక్యం చేసుకోవ‌డంతో పార్టీకే మొత్తం చెడ్డ‌పేరు వ‌చ్చింద‌ని పార్టీ పెద్ద‌లు చ‌ర్చించుకుంటున్నారు.
 
అస్స‌లు య‌ర‌ప‌తినేని ప్రోత్సహించ‌టం ద్వారా త‌మ నాయ‌కుడు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పెద్ద త‌ప్పు చేశార‌ని, అది చివ‌ర‌కు ఆయ‌న‌కే చుట్టుకుంటోందని విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ట‌. పోలీస్, మైనింగ్, రెవిన్యూ ఇలా అన్ని శాఖ‌ల‌ను మెయింటేన్ చేసిన య‌ర‌ప‌తినేని మ‌రికొన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను కుడా మెయింటేన్ చెయ్యాల‌ని చూస్తున్నారట‌. అయితే అది కుద‌ర‌లేదు. చివ‌రికి హైకోర్టు దృష్టికి వెళ్ల‌టం కోర్టు తీవ్రంగా ఆక్షేపించ‌టంతో అయ్య‌గారి బండారం మొత్తం బ‌ట్ట‌బ‌య‌లు అయింది. 
 
అయితే ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు ఏం స‌మాధానం చెప్పుకోలేనే ప‌రిస్థితి తెలుగు దేశం పార్టీ అధిష్టానంలో నెల‌కొంద‌ట‌. ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాస్ రావు మాత్రం ప్ర‌జ‌ల‌కు ముఖం చూపించ‌లేక ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు రావ‌టం లేద‌ట‌. ప్ర‌తిపక్షాలు ప్ర‌జా సంఘాల నాయ‌కులు ఆరోప‌ణ‌లు చేస్తే ఏదో ఒక‌టి అబ‌ద్దాలు చెప్పి ఆ  ఆరోప‌ణ‌ల‌ను తిప్పికొట్టేందుకు వీల‌య్యేది. ఇకప్పుడు క‌ల్పించుకున్న‌ది హైకోర్టు కావ‌డంతో య‌ర‌ప‌తినేనికి ఏం చెయ్యాలో దిక్కు తోచ‌టం లేద‌ట‌. ఇక మ‌రో వైపు అధికార నేత‌ల‌పై అక్ర‌మాల పోరాటం చేయ్యాల‌ని ప్ర‌తిప‌క్షాలు రెడి అవుతున్నాయి. 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.