మాయ‌మాట‌లు చెప్ప‌డంలో ఆ ఎమ్మెల్యే దిట్టా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp
Updated:  2018-07-30 04:12:05

మాయ‌మాట‌లు చెప్ప‌డంలో ఆ ఎమ్మెల్యే దిట్టా

అనంత‌పురం కేంద్రంగా 1950లో అనంత‌పురం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డింది. ఆ తర్వాత 2009 లో నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత అనంత‌పురం నుంచి రాప్తాడు బుక్క‌రాయ‌స‌ముద్రం మండ‌లాలు విడ‌దీసి వ‌రుస‌గా రాప్తాడు, సింగ‌న‌మ‌ల నియోజ‌వ‌ర్గల్లో క‌లిపారు. అనంత‌పురం న‌గ‌రంతో పాటుగా రుద్రంపేట రాజీవ్ కాల‌ని నారాయ‌ణపురం పంచాయితీల‌తో క‌లిసి అనంత‌పురం నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డింది. 
 
నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డిన త‌ర్వాత మొత్తం ఓట‌ర్లు 2 ల‌క్ష‌ల 40వేల 973 ఓట్లు ఉండ‌గా అందులో పురుషులల ఓట్లు 1 ల‌క్షా 22వేల 411 మంది ఉన్నారు. ఇక‌ మ‌హిళా ఓటర్లు 1 ల‌క్షా 18 వేల 562 ఓట్లు ఉన్నాయి. అనంత‌పురం అర్భ‌న్ నియోజ‌క‌వ‌ర్గంలో కులాల‌వారిగా ఒక్క‌సారి ప‌రిశీలిస్తే బ‌లిజ ఓట్లు 40 నుంచి 45 వేల వ‌ర‌కు ఉన్నాయి. అలాగే మైనార్టీ ఓట్లు 42 వేల నుంచి 46 వేల వ‌ర‌కు ఉండ‌గా బీసీ ఓట్లు 70 వేల నుంచి 80 వేల వ‌ర‌కు ఉన్నాయి. 
 
మున్సిప‌ల్ చైర్మ‌న్ గా అనుభ‌వం ఉన్న వైకుంఠం ప్ర‌భాక‌ర్ చౌద‌రి గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసి గెలిచారు. ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఆయ‌న ఓట‌ర్ల‌కు అనేక హామీలు ఇచ్చారు. అయితే వాటిని అమ‌లు చేయ‌డంలో విఫ‌లం అయ్యారు. అనంత‌పురం న‌గ‌రానికి అండ‌ర్ గ్రౌండ్ డ్రైనెజీని కేంద్ర రాష్ట్ర భాగ‌స్వామ్యంతో నిర్మించాల్సి ఉంది. అయితే ఇందుకోసం కాంగ్రెస్ ప్ర‌భుత్వం 420 కోట్ల‌ను విడుద‌ల చేసినా ఇక్క‌డ అనేక కార‌ణాల‌తో ప‌నులు మొద‌లు కాలేదు. 
 
2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో అనంత‌పురంలో అండ‌ర్ గ్రౌండ్ నిర్మిస్తామ‌ని హామీ ఇచ్చి అధికారంలోకి వ‌చ్చింది టీడీపీ. అనంత‌ ప్ర‌జ‌లు వెయ్యి క‌ళ్ల‌తో ఎదురు చూసినా ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు చెయ్య‌లేద‌ని ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. అండ‌ర్ గ్రౌండ్ డ్రైనెజీ లేక‌పోవ‌డంతో పారిశుద్యం ప‌డ‌కేసి విష‌జ్వ‌రాలు వ‌స్తున్నాయ‌ని ప్ర‌జ‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.
 
అనంత‌పురం అర్భ‌న్ నియోజక‌వ‌ర్గం అభివృద్ది కాక‌పోవ‌డానికి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌రిస్కారం కాక‌పోవ‌డానికి టీడీపీ నేత‌ల గ్రూపు రాజ‌కీయ‌లు కూడా మేయిన్ కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ చౌద‌రిల మ‌ధ్య‌ప‌చ్చ‌గ‌డ్డివేస్తే భ‌గ్గుమ‌న్నంత వైర్యం వీరిద్ద‌రి మ‌ధ్య నెల‌కొంది. అటు ఎంపీ ఇటు ఎమ్మెల్యే ఆదిప‌త్య రాజ‌కీయ‌ల కార‌ణంగా అనంత‌పురం అర్భ‌న్ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు అనేక కష్టాలు పడుతున్నారు. అనంత‌పురం పాతూరులోని రోడ్డును విస్త‌రించాల‌ని ఎంపీ జేసి దివాక‌ర్ రెడ్డి ప్ర‌య‌త్నిస్తే రోడ్లు విస్త‌రించ‌నంటు స్థానికికుల‌కు  హామీ ఇచ్చినందున  అలా చెయ్య‌టానికి వీలు లేద‌ని ఎమ్మెల్యే ప్ర‌భార్ అనేక సంద‌ర్భాల్లో అడ్డుకున్నారు. 
 
అయితే అనంత‌పురంలో కీల‌క న‌గ‌రాలు, అర‌వింద్ న‌గ‌ర్, రామ్ న‌గ‌ర్ ఈ రెండు ప్రాంతాల‌కు మ‌ధ్య‌లో రైల్వే గేటు ఉండ‌డం వ‌ల్ల ప్ర‌జ‌లు అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కోవ‌డంతో ఇక్క‌డ రైల్వే ఓవ‌ర్ బ్రిడ్జిని నిర్మించాల‌ని టీడీపీ ప్ర‌భుత్వం అట్ట హాసంగా నిర్మించినా ప‌నులు చాలా నెమ్మ‌దిగా నడుస్తున్నాయి. 
 
అయితే ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని రాజీవ్ కాల‌నీని ద‌త్త‌త గ్రామంగా ఎంపిక చేసుకున్నారు. ఈ గ్రామాన్ని తాను ఆద‌ర్శవంత‌మైన గ్రామంగా తీర్చి దిద్దుతామ‌ని ఎమ్మెల్యే హామీ కూడా ఇచ్చారు. కానీ ఎక్క‌డి గొంగ‌లి అక్క‌డే అన్న‌ట్లు రాజీవ్ కాల‌ని స‌మ‌స్య‌లు రోడ్డున ప‌డుతున్నాయి. 
 
ఇక మ‌రో వైపు టీడీపీ అధికారంలోకి వ‌స్తే డ్వాక్రా మ‌హిళ‌ల‌కు రుణ‌మాఫి చేస్తాన‌ని చెప్పి మోసం చేశార‌ని డ్వాక్రా మ‌హిళ‌లు ప్ర‌భుత్వం పై మండిప‌డుతున్నారు. తాము వేలాది రుపాయ‌లు వ‌డ్డీలు క‌డుతూ నానా అగ‌చాట్లు ప‌డుతున్నామ‌ని వారు వాపోతున్నారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క‌టి ఎమ్మెల్యే నెర‌వేర్చ‌క‌పోయార‌ని కేవ‌లం హామీల మాయ‌మాట‌ల‌తోనే కాలం గ‌డిపేస్తున్నార‌ని ప్ర‌జలు మండిప‌డుతున్నారు. గ‌త నాలుగేళ్ల ప‌రిపాల‌న‌లో ఎమ్మెల్యేలు ఏదైనా సాధించారా అంటే అది కేవ‌లం అభివృద్దిలో అవినీతిలో మాత్ర‌మే అనే ప్ర‌జ‌లు వాపోతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.