తంబళ్లపల్లెలో పెరిగిన గ్రాఫ్...జనహితం గ్రౌండ్ రిపోర్ట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-16 14:37:52

తంబళ్లపల్లెలో పెరిగిన గ్రాఫ్...జనహితం గ్రౌండ్ రిపోర్ట్

చిత్తూరు జిల్లాలో రోజురోజుకీ రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మారిపోతున్నాయి.  2014 ఎన్నిక‌ల్లో చిత్తూరు జిల్లాలో ఉన్న 14 అసెంబ్లీ స్ధానాల్లో  8 వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ, 6 తెలుగుదేశం పార్టీ గెలుచుకున్నాయి. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు సొంత జిల్లా అయిన చిత్తూరులో వైసీపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రిన్ని స్దానాల్లో గెల‌పొందేందుకు వ్యూహాలు ర‌చిస్తోంది.ఇక పార్టీని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు టీడీపీ అధిష్టానం తీవ్ర  క‌స‌ర‌త్తులు మొద‌లుపెట్టింది. 
 
జిల్లాలో తంబ‌ళ్లప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఎన్నిక‌ల్లో  వైసీపీ అభ్య‌ర్ధి ప్ర‌వీణ్ కుమార్ రెడ్డిపై టీడీపీ అభ్య‌ర్ది శంక‌ర్ యాద‌వ్ గెలుపొందారు. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ లో ల‌క్షా 47 వేల 786 మంది ఓట్ల‌రు ఉన్నారు. సుమారు 36 శాతం మంది బిసీలు ఈ నియోజ‌వ‌ర్గంలో ఉన్నారు. ఈ సెగ్మెంట్ లో గెలుపోటములను బీసీలు నిర్ణయిస్తారు...
 
ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్న శంక‌ర్ యాద‌వ్ స్థానికుడు కాకపోవడంతో, ఆయ‌న ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌ర‌నే వాద‌న బలంగా వినిపిస్తోంది. ఎమ్మెల్యేను క‌ల‌వాలంటే బెంగుళూరుకు వెళ్లాల్సిందేన‌ని స్ధానికులు చెబుతున్నారు. అందుబాటులో ఉండ‌ర‌నే విష‌యాన్ని స్వ‌యంగా ఎమ్మెల్యేనే ఒప్పుకున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే తన అనుచరులకు భాద్యతలు అప్పగించడంతో అనుచరుల హవా ఎక్కువగా కనసాగుతుంది. వీరిపైన ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉంది. 
 
పెద్ద‌మండ్యం మండ‌లంలో ఉన్న సుగాలి తాండా వాసుల‌కు రుణాలు ఇప్పించేందుకు మాత్రం ఎమ్మెల్యే ప్ర‌య‌త్నం జ‌రిపార‌నే మాట మాత్రం వినిపిస్తోంది. కేవ‌లం రెండు మండ‌లాల్లో మాత్ర‌మే అడ‌పా ద‌డ‌పా కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌వుతుంటార‌ని నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్ప‌టికీ కొన్ని గ్రామాల్లో తాగేందుకు కూడా నీరు లేదంటే ప‌రిస్ధితి ఎంటో అర్ధం చేసుకోవ‌చ్చు. ఓ రకంగా స్ధానికేత‌రుడికి ప‌ట్టం క‌ట్టిన ప్ర‌జ‌లు మాత్రం తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే శంకర్ యాదవ్ పై 2014 తో పోలిస్తే ఇప్పుడు వ్యతిరేఖత పెరిగిపోయింది అనే చెప్పాలి.
 
అధికార పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం. నియోజగవర్గంలోని సమస్యలను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదనే వాదనతో పాటు, అనుచరుల హవా కొనసాగుతుండడంతో ప్రజల్లో వ్యతిరేకత ఉంది. అయినప్పటికీ ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్న శంక‌ర్ యాద‌వ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వాడు కావడం ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉండడం టీడీపీకి కలిసివచ్చే అవకాశం ఉంది. 
 
వైసీపీ తంబళ్లపల్లె నియోజ‌క‌వ‌ర్గ ఇన్ ఛార్జ్ గా ఉన్న ద్వార‌కానాధ్ రెడ్డి నిత్యం ప్ర‌జ‌ల్లో తిరుగుతూ ఉండడం కలిసి వచ్చే అంశం. ద్వార‌కానాధ్ రెడ్డి అందరిని కలుపుకొని ముందుకు వెళ్తున్నారు. దీంతో వైసీపీ బలం పుంజుకుంది. 2014 లో బీసీలు అందరు టీడీపీ వైపే మొగ్గు చూపారు. ఇప్పుడు పరిస్థితి మారింది ఎమ్మెల్యే శంకర్ యాదవ్ అందుబాటులో లేకపోవడంతో, ద్వార‌కానాధ్ రెడ్డి బీసీలకు అందుబాటులో ఉంటూ తన హవాను పెంచుకుంటున్నారు... మాజీ ఎమ్మెల్యే ప్ర‌వీణ్ కుమార్ రెడ్డిని కలుపుకొని ద్వార‌కానాధ్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు దీంతో వైసీపీ తన గ్రాఫ్ ని పెంచుకుంది.
 
2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతి ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే కలిచెర్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి ఫ్యామిలీ ప్ర‌స్తుతం వైసీపీ కండువా కప్పుకోవడంతో వైసీపీ తన బలాన్ని పెంచుకుంది. ఈ నియోజకవర్గంలో బీజేపీ నేత చల్లపల్లి నరసింహ రెడ్డి కి కూడా బలం ఉంది... బీజేపీ 2014 లో టీడీపీకి మద్దతు ఇవ్వడంతో టీడీపీకి కలిసివచ్చింది..కానీ ఇప్పుడు టీడీపీ తో బీజేపీ తెగతెంపులు తెంచుకోవడంతో టీడీపీకి పెద్ద దెబ్బ.
 
తంబ‌ళ్ల‌ప‌ల్లె, పెద్ద‌మండ్యం, కురుబ‌ల్ల‌కోట, ములకలచెరువు మండలాల్లో వైసీపీ బలంగా కనిపిస్తుంటే, కొత్త‌కోట, పెద్దతిప్పి స‌ముద్రం మండలాల్లో టీడీపీ బలంగా కనిపిస్తుంది...2014 కంటే ఇప్పుడు వైసీపీ తన గ్రాఫ్ ని పెంచుకొని విజయం వైపు ప్రయాణిస్తుంటే, టీడీపీ తప్పుడు హామీలు, ఎమ్మెల్యే శంకర్ యాదవ్ ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో తన పట్టును కోల్పోతూ ఓటమి వైపు పయనిస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.