టీడీపీ ఎమ్మెల్యేకు సూటి ప్ర‌శ్న‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-19 18:29:50

టీడీపీ ఎమ్మెల్యేకు సూటి ప్ర‌శ్న‌

గుంటూరు జిల్లా ప‌ల్నాడులో ప్ర‌ముఖ‌మైన నియోజ‌క‌వ‌ర్గం గుర‌జాల‌. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో సుమారు మూడున్న‌ర ల‌క్ష జ‌నాభ ఉండ‌గా ఇందులో ఓట‌ర్ల సంఖ్య 2 ల‌క్ష‌ల‌45వేల 373 అయితే వీరిలో పురుషుల ఓట‌ర్లు సంఖ్య 1 ల‌క్షా 20వేల 699 ఉండ‌గా, మ‌హిళా ఓట‌ర్లు 1 ల‌క్షా 24 వేలు ఉన్నాయి. అయితే 2014 తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన య‌ర‌ప‌తినేని శ్రీనివాస్ రావు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కృష్ణ‌మూర్తిపైన 7187 ఓట్ల ఆధిక్య‌త‌తో గెలిచారు. 
 
గుర‌జాల‌ అసెంబ్లీ సెగ్మెంట్ లో సిమెంట్ సున్నం పరిశ్ర‌మ‌ల‌కు ప్ర‌సిద్ది. ఇక్క‌డినుంచి ఇత‌ర రాష్ట్రాల‌కు సైతం సిమెంట్ సున్నం స‌ర‌ఫ‌రా అవుతోంది. సున్నం బట్టిల‌కు ఈ నియోజ‌క‌వ‌ర్గం ఫేమ‌స్ వీట‌న్నింటిలో ప‌నిచేసే కార్మికులు దాదాపు ఐదు నుంచి ఆరు వేల మంది ఉంటార‌ని అంచ‌నా వేస్తున్నారు. పేరుకు గుర‌జాల‌ నియోజ‌క‌వ‌ర్గం కేంద్రం అయిన‌ప్ప‌టి ప్ర‌ధాన ప‌ట్టనం పెడుగురాళ్ల అక్క‌డ సున్నం ప‌రిశ్ర‌మ ఎక్కువ ఉన్నందున లైమ్ సిటీగా పిలుస్తుంటారు.
 
అయితే ఇక్క‌డ ప‌నిచేసే కార్మికుల‌కు స్వాస‌కోశ సంబంబంధ‌మైన వ్యాధులు వ‌స్తుంటాయి. ప్ర‌తీ ఎన్నిక‌ల స‌మ‌యంలో కూడా ఇక్క‌డ ఈఎస్ ఐ ఆసుప‌త్రి నిర్మానం చేయిస్తాన‌ని హామీ ఇచ్చే  శ్రీనివాస్ రావు ఎమ్మెల్యే అయిన త‌ర్వాత దాని ఊసే ఎత్త‌రు. ఇదే కాకుండా పెడుగురాళ్ల‌లో వంద‌ప‌డ‌క‌లు ఆసుప‌త్రి నిర్మానం చేయిస్తాన‌ని అన్నారు. కానీ ప్ర‌స్తుతం ఆ హామీ మూల‌న పాడేశారు. 
 
ఈ నియోజ‌క‌వ‌ర్గంలో స‌రైన చ‌దువులు లేక ప‌ల్నాడులో ప‌లువురు యువ‌తీ యువ‌కులు మావోయిస్ట్ లు గాను అసాంఘిక శ‌క్తులుగా మారిపోతున్నారు. అయితే ప్ర‌స్తుతం ఇప్పుడు ఆ పోక‌డాలు లేవు అనేక మంది విద్యార్ధులు విద్యారంగం వైపు వెళ్తున్నారు. కానీ వారి మార్పుకు స‌దుపాయాల‌ను మాత్రం కల్పించ‌డంలేదు. డిగ్రీ కాలేజ్ నిర్మానం కావాలంటూ ప్ర‌తీ ఎన్నిక‌ల స‌మయంలో యువ‌కులు కోర‌డం తాను గెల‌వ‌గానే ఫస్ట్ ప్ర‌యారిటీ ఇదే నంటూ య‌ర‌ప‌తినేని చెప్ప‌టం శ‌రామాముల అయిపోయింది. 
 
పెడుగుర‌ళ్ల‌లో సిమెంట్ ఫ్యాక్ట‌రీలు ఎక్కువ‌గా ఉండ‌టంతో వాహ‌నాలు రాక‌పోక‌లు ఎక్కువ దీంతో ట్రాఫిక్ ఎక్కువ‌గా ఉంటుంది. అయితే ఇలాంటి ప‌రిస్థితిల్లో ప‌ట్ట‌నానికి బైపాస్ రోడ్డు కావాలంటూ నియోజ‌క‌వ‌ర్గ‌ప్ర‌జ‌లు ఎప్ప‌టినుంచో డిమాండ్ చేస్తున్నారు.
 
వంద‌కోట్ల అంచ‌నాతో బైపాస్ రోడ్ నిర్మానానికి నాలుగేళ్ల క్రితం శంకుస్థాప‌న కూడా జ‌రిగింది. బైపాస్ నిర్మానం జ‌రిపితే త‌మ అనుచ‌రుల‌కు ఇబ్బంది క‌లుగుతుంద‌న్న కార‌ణంతో దాన్నికూడా ఎమ్మెల్యే నిలిపివేశార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. నియోజ‌క‌వ‌ర్గం అయిన గుర‌జాల‌లో మంచినీటి స‌మ‌స్య కూడా ఎక్కువ‌గా ఉంటోంది. 
 
అయితే ప్ర‌జ‌లు నిత్య‌వ‌స‌ర స‌మ‌స్య‌ల గురించి అధికారుల‌ను ప్ర‌శ్నించినా త‌మ‌దేమీ లేద‌ని ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని అడ‌గాలంటూ అధికారులు సూచిస్తుంటారు. అంటే పూర్తిగా ఏ వ్య‌వ‌హారం అయినా ఎమ్మెల్యే క‌నుస‌న్న‌ల్లోని జ‌ర‌గాలి. అయితే చివ‌రికి కుల దృవీక‌ర‌ణ ప‌త్రం నుంచి ప‌ట్టాదారు పాస్ పుస్త‌కం వ‌ర‌కు ఏదైనా స‌రే ఎమ్మెల్యే చెబితేనే అధికారులు సంత‌కం పెట్టే పరిస్థితి ఏర్ప‌డిందని ప్ర‌జ‌లు ఆరోపిస్తున్నారు. ఇక ఇలాంటి ఆరోప‌ణ‌ల్లో ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు రంగంసిద్దం సిద్దం చేసుకుంటున్నారు. అయితే త‌మ‌కు హామీ ఇచ్చిన ప‌నులు ఎందుకు చేయ‌లేదో చెప్పిన త‌ర్వాతే ఓట్ల‌కోసం రావాలంటూ ప్ర‌జ‌లు నిల‌దీస్తున్నారు. మ‌రి వారికి య‌ర‌ప‌తినేని ఏం స‌మాధానం చెబుతారో వేచి చూడాలి

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.