బాలయ్య త‌మ‌ను మోసం చేశారు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-01 17:44:25

బాలయ్య త‌మ‌ను మోసం చేశారు

ఆంధ్ర‌ప్రదేశ్, క‌ర్ణాట‌క రాష్ట్రాల‌కు స‌రిహ‌ద్దుల్లో ఉన్న హిందూపురం నియోజ‌క‌వ‌ర్గం... 1952లో ఏర్ప‌డింది. తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాకుడు మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు 1985,1989, 1994 ఎన్నిక‌ల్లో హిందూపురం నుంచి విజ‌యం సాధించారు.1989లో మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా క‌ల్వ‌కుర్తి, అలాగే అనంత‌పురం జిల్లా హిందూపురం నుంచి పోటీ చేసి కేవ‌లం ఎన్టీఆర్ హిందూపురం నుంచే గెలిచారు. దీంతో హిందూపురంతో నంద‌మూరి ప్యామిలీకి మ‌రింత అనుభందం పెరిగింది. ఇక ఎన్టీఆర్ మ‌ర‌ణంతో 1996లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో ఎన్నీఆర్ త‌న‌యుడు నంద‌మూరి హ‌రికృష్ణ హిందూపురం నుంచే పోటీ చేసి గెలిచారు. 
 
ఇక ఎన్టీఆర్ న‌ట వార‌స‌త్వాన్నే కాదు రాజ‌కీయ వార‌స‌త్వాన్ని కొన‌సాగించాల‌నుకున్న ఆయ‌న త‌న‌యుడు నంద‌మూరి బాల‌కృష్ణ 2014 సార్వ‌త్రిక‌ ఎన్నిక‌ల్లో రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ఫ్యామిలీ సెంటిమెంట్ ప్ర‌కారం హిందూపురం నుంచి పోటీ చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి న‌వీన్ నిశ్చ‌ల్ పై 16 వేల 196 ఓట్ల ఆధిక్య‌త‌తో గెల‌పొందారు. హిందూపురం ఓట‌ర్ల సంఖ్య‌ను ఒక్క‌సారి గ‌మ‌నించిన‌ట్లు అయితే   ఇక్కడా మొత్తం ఓట్లు 2 ల‌క్ష‌ల 6 వెల 646 ఓట్లు ఉండ‌గా వారిలో పురుష ఓట‌ర్ల‌సంఖ్య 1 లక్ష 4 వేల 989 ఓట్లు ఉన్నాయి. ఇక మ‌హిళా ఓట‌ర్లు  1 లక్షా 16 వంద‌ళ 53 ఓట్లు వున్నాయి.
 
ఎన్నిక‌ల సంద‌ర్భంగా అంద‌రిలా బాల‌కృష్ణ కూడా హిందూపురం ప్ర‌జ‌ల‌కు అనేక హామీల‌ను ఇచ్చారు. గ‌త ఎన్నిక‌ల్లో కుటుంబ స‌భ్యుల‌తో ఇంటింటా ప్ర‌చారం చేసిన బాల‌య్య‌బాబు త‌న‌ను గెలిపిస్తే హిందూపురంలోనే ఉంటూ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిస్క‌రిస్తాన‌ని త‌న బావ చంద్ర‌బాబు ద్వారా ఎలాంటి స‌మ‌స్య అయినా ఇట్టే తీరుస్తాన‌ని ప్ర‌జ‌ల‌కు ఎంతో న‌మ్మ‌కంగా చెప్పారు. దీంతో పాటు హిందూపురం ప్ర‌జ‌ల‌కు సుమారు 18 హామీల‌ను ఇచ్చిన బాలయ్య‌బాబు వాటి అమ‌లులో మాత్రం పూర్తిగా విఫ‌లం చెందారు. 
 
బాల‌కృష్ణ హామీల్లో అత్యంత ప్ర‌ధాన‌మైన‌ది హిందూపురం నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లకు సాగు తాగు నీరు తీరుస్తాన‌న్న‌ది. ద‌శాబ్దాలుగా హిందూపురంలో తాగు నీటి క‌ష్టాలు ఉన్నాయి. ఒక బిందే నీరు కావాలంటే సుమారు 5 నుంచి 6 రూపాయ‌లు వెచ్చిస్తున్నారు. అయితే త‌న‌ను గెలిపిస్తే ఎన్టీఆర్ సుజ‌ల ద్వారా రెండు రూపాల‌కే రెండు లీట‌ర్ల నీటిని స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని గ‌త ఎన్నిక‌ల్లోహామీ ఇచ్చారు. అయితే ఆయ‌న గెలిచి నాలుగు సంవ‌త్సారాలు అయినా ఆయ‌న హామీ ఎందుకు నిల‌బెట్టుకోలేద‌ని, తాగు నీటి కొసం ప్ర‌తీ నెల వేల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు పెడుతున్నామ‌ని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. 
 
త‌న‌ను గెలిపిస్తే హంద్రీనివా ప్రాజెక్ట్ ద్వారా హిందూపురం నియోజ‌క‌వ‌ర్గాన్ని స‌స్య‌శ్యామ‌లం చేస్తాన‌ని, హిందూపురం లేపాక్షి, చిల‌మ‌త్తురు మండ‌ల‌లా ప‌రిధిలోని అన్ని గ్రామాల చెరువుల‌కు నీరు ఇస్తామ‌ని బాల‌కృష్ణ హామీ ఇచ్చారు. కానీ హంద్రీ నివానీరు త‌మ కు ఇవ్వ‌లేద‌ని వ‌ర్ష‌పు నీటికి జ‌ల‌హార‌తి ఇచ్చి చేతులు దులుపుకున్నార‌ని రైతులు మండిప‌డుతున్నారు.త‌మ స‌మ‌స్య‌ల‌ను చెప్పుకునేందుకు వెళ్తె ఆయ‌న సిబ్బంది అనుచ‌రులు త‌మ‌ను మెడ‌ప‌ట్టుకుని బ‌య‌ట‌కు గెంటేస్తున్నార‌ని వారు వాపోతున్నారు.
 
 
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.