క‌డ‌ప జిల్లా రాజ‌కీయ చ‌రిత్ర పై జ‌న‌హితం స్పెష‌ల్ స్టోరి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

kadapa
Updated:  2018-10-10 11:23:25

క‌డ‌ప జిల్లా రాజ‌కీయ చ‌రిత్ర పై జ‌న‌హితం స్పెష‌ల్ స్టోరి

తిరుమ‌లేసుని తొలిగ‌డ‌ప క‌డ‌ప జిల్లాలో రాజ‌కీయాలు ఎప్పుడు చూసినా హాట్ గానే న‌డుస్తుంటాయి. రాయ‌ల‌సీమ‌కు న‌డిబొడ్డు అయిన క‌డ‌ప జిల్లాలో రాజ‌కీయ చైత‌న్యం కాస్త ఎక్కువ‌గానే ఉంటుంది. ఇదే జిల్లాకు చెందిన వైస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మ‌ర‌ణంతో రాష్ట్ర రాజ‌కీయ ముఖ చిత్రంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ వ్య‌తిరేకిస్తూ వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ మోహ‌న్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించ‌డంతో రాష్ట్ర రాజ‌కీయం మారిపోయింది.
 
తెలుగు రాష్ట్రాలు విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత ఏపీలో మొద‌టి సారిగా 2014లో ఎన్నిక‌లు జ‌రిగితే ఆ ఎన్నిక‌ల్లో వైసీపీ హ‌వానే న‌డిచింది. ఆ త‌ర్వాత ఊహించ‌ని ప‌రిణామాలు నేథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి జ‌మ్మ‌లమ‌డుగు ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ రెడ్డి టీడీపీలోకి జంప్ అయ్యారు. వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ రెడ్డి మంత్రిని చేసి జిల్లాలో ఆయ‌న‌నే ముందు పెట్టి క‌డ‌ప జిల్లాలో రాజ‌కీయాల‌ను సాగిస్తోంది తెలుగుదేశంపార్టీ. ఇక‌ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వైఎస్ కుటుంబం నుంచి పోటీచేసిన వైఎస్ వివేకా నంద‌రెడ్డిని ఓడించి టీడీపీ అధిష్టానం పైచెయి సాధించింది. ఇక అప్ప‌టినుంచి జిల్లా ప‌ట్టు సాధిస్తున్నామ‌నే ధీమాతో రాజ‌కీయాల‌ను న‌డుపుతోంది టీడీపీ. 
 
రెండు ద‌శాబ్దాల రాజ‌కీయాల‌ను ప‌రిశీలిస్తే 1999లో కాంగ్రెస్ వ‌ర్సెస్ టీడీపీగా ఉండేది క‌డ‌ప రాజ‌కీయం. 1999లో కాంగ్రెస్ నాలుగు స్థానాల‌కే ప‌రిమితం అయితే తెలుగుదేశం సుమారు ఏడు సీట్లను ద‌క్కంచుకుంది. అలాగే ఆ ఎన్నిక‌ల్లో రెండు ఎంపీ స్థానాల‌ను కాంగ్రెస్ పార్టీనే కౌవ‌సం చేసుకుంది. ఇక 2004 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ సుమారు తొమ్మిది స్థానాల‌ను గెలుచుకుని టీడీపీని ఒక్క‌స్థానానికి ప‌రిమితం చేసింది. 
 
వైఎస్ నేతృత్వంలో కాంగ్రెస్ ఘ‌న విజ‌యం సాధించి అధికారంలోకి రావ‌డంతో క‌డ‌ప జిల్లా రాజ‌కీయాలకు రాష్ట్ర స్థాయి గుర్తింపు ద‌క్కింది. వైఎస్ రెండు సార్లు పార్టీ త‌ర‌పున పీసీసీగా ప‌ని చేస్తూ, ఎంపీగా గెలుస్తూ వ‌చ్చినా, క‌డ‌ప‌జిల్లా రాజ‌కీయాల‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది 2004 త‌ర్వాతే . ఇక 2009 నాటికి కాంగ్రెస్ మ‌రింత బ‌ల‌ప‌డింది. 2004 నుంచి 2014 దాక టీడీపీకి బ‌ల‌ప‌డే అవ‌కాశం లేకుండా పోయింది. 2009లో కూడా కాంగ్రెస్ 9 స్థానాల‌ను గెలుచుకుంది. మ‌ళ్లీ టీడీపీ ఒక్క సీటుకే ప‌రిమితం కావాల్సి వ‌చ్చింది. 
 
2009లో వైఎస్ అకాల మ‌ర‌ణంతో పులివెందుల నుంచి వైఎస్ స‌తీమ‌ని వైఎస్ విజ‌య‌మ్మ ఏక‌గ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ త‌ర్వాత జ‌గ‌న్ కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి పులివెందుల‌నుంచి విజ‌య‌మ్మ క‌డ‌ప నుంచి జ‌గ‌న్ ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఇక ఆ త‌ర్వాత ఎన్నిక‌లు జ‌రిగితే ఆ ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి పోటీచేసి విజ‌యం సాధించారు. 
 
కడ‌ప జిల్లాలో అప్ప‌టిదాక కాంగ్రెస్ పార్టీలో కొన‌సాగుతున్న న‌లుగురు ఎమ్మెల్యేలు త‌మ‌ప‌ద‌వికి రాజీనామా చేసి వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. రైల్వే కోడురు నుంచి కొర‌మ‌ట్ల శ్రీనివాసులు, రాజంపేట‌నుంచి అమ‌ర్ నాథ్ రెడ్డి, రాయ‌చూటి నుంచి శ్రీకాంత్ రెడ్డిలు పోటీ చేసి విజ‌యం సాధించ‌డంతో క‌డ‌ప జిల్లాలో వైసీపీ బ‌లం మ‌రింత పుంజుకుంది. 
 
2014 నాటికి రాష్ట్రంలో బ‌లం పుంజుకున్న వైసీపీ క‌డ‌ప‌జిల్లాలో త‌మ ప‌ట్టు సాదించుకుంది. 2014లో టీడీపీ అధికాంలోకి వ‌చ్చినా క‌డ‌ప‌జిల్లాలో టీడీపీ ఒకే ఒక్క స్థానంతో స‌రిపెట్టుకుంది. 9 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌తో పాటు క‌డ‌ప, రాజంపేట ఎంపీ సీట్ల‌ను కూడా వైసీపీనే గెలుచేకుంది. ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ  ఒక్క స్థాన‌మే ద‌క్క‌డంతో గ‌త నాలుగు సంవ‌త్స‌రాలు ప‌లు విధాలుగా ప్ర‌య‌త్నాలు చేసింది టీడీపీ.
 
రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల కార‌ణంగా జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యేను టీడీపీలోకి చేర్చుకున్నాక‌ అదిష్టానం ఆయ‌న ప్ర‌త్య‌ర్థి రామ‌సుబ్బారెడ్డిని సంతృప్తి ప‌రిచేందుకు ఎమ్మెల్సీ ప‌ద‌విని ఇచ్చింది. స్థానిక సంస్థ‌ల కోటాలో టీడీపీకి చెందిన బీటెక్ ర‌వి ఎమ్మెల్సీగా గెల‌వ‌డం మ‌రో రాజ‌కీయ ప‌రిణామం. 
 
ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వైఎస్ వివేకానంద‌రెడ్డి ఓట‌మి జ‌గ‌న్ కు షాక్ ను ఇచ్చింది. గెలుస్తామ‌న్న సీటు చేతులారా చేజారిపోవ‌డంతో ఊహించ‌ని ప‌రినామ‌మే. జిల్లాలోని క‌డ‌ప రాజంపేట పార్ల‌మెంట్ స్థానాల‌ను ద‌క్కించుకునేందుకు రెండు ప్ర‌ధాన పార్టీలు పోరాటం చేస్తున్నాయి. 1999 నుంచి పార్ల‌మెంట్ స్థానంలో వైఎస్ కుటుంబ‌మే హవా న‌డుస్తోంది. 1999లో రాజంపేట‌లో టీడీపీ గునిపాటి రామ‌య్య‌గెలిచినా 2004,2009 ఉప‌న్నికల్లో  వైఎస్ స‌న్నిహితుడు సాయి ప్ర‌తాప్ గెలిచారు. ఇక 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గెలిచారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థిగా శ్రీనివాసులు రెడ్డి పోటీచేసే అవ‌కావాలు క‌నిపిస్తున్నాయి. గ‌త ఎన్నికల్లో పొత్తులో భాగంగా టీడీపీ ఎంపీ సీటును బీజేసీకి కేటాయించిన సీటులో ఇంకా ఎవ్వ‌రిని నిల‌బెట్టాల‌నేది స్ప‌ష్ట‌త లేదు.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.