జ‌గ‌న్ పాద‌యాత్ర ఏడాది పూర్తి అయిన సంద‌ర్భంగా జ‌న‌హితం స్పెష‌ల్ స్టోరి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan mohan reddy
Updated:  2018-11-06 13:14:32

జ‌గ‌న్ పాద‌యాత్ర ఏడాది పూర్తి అయిన సంద‌ర్భంగా జ‌న‌హితం స్పెష‌ల్ స్టోరి

ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర నేటితో ఏడాది పూర్తిచేసుకుంది. ఈ సంక‌ల్ప‌యాత్ర‌లో జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ  అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతి, అరాచ‌కాల‌ను ఎండ‌గ‌డుతూ ప్ర‌జల‌ ప‌క్షాన నిలుస్తు వ‌స్తున్నారు.
 
2017 న‌వంబ‌ర్ 6న‌ వైఎస్సార్ క‌డ‌ప జిల్లా పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలోని ఇడుపుల‌పాయ గ్రామంలో ప‌డిన తొలి అడుగు... ఈ అడుగులు వేల అడుగులై అడుగ‌డుగునా జ‌న‌నేత‌కు ప్ర‌జా మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. ఈ యాత్ర‌కు జ‌నం ఇచ్చిన ఉత్సాహ‌మే ఊపిరిగా జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు ఏక ధాటిగా సుమారు 3211 కిలో మీట‌ర్ల‌ను పూర్తి చేసుకుని గిన్నీర్ రికార్డ్ సృష్టించారు.
 
యావ‌త్ భార‌త దేశంలో ఇంత‌వ‌ర‌కు ఏ రాజ‌కీయ నాయ‌కుడు చేయ‌లేని రీతిలో పాద‌యాత్ర చేసి ప్రతిప‌క్ష‌నాయ‌కుడిగా జ‌గ‌న్ స‌రికొత్త రికార్డ్ సృష్టించారు. ఇడుపుల‌పాయ‌లో మొద‌లైన జ‌న‌నేత జ‌గ‌న్ యాత్ర‌ 1739 గ్రామాలు... 205 మండలాలు... 122 నియోజకవర్గాలు... 47 మున్సిపాలిటీలు... 8 కార్పొరేషన్ లు... 12 జిల్లాలు... 42 ఆత్మీయ సదస్సులు... 113 బహిరంగ సభల‌ను పూర్తి చేసుకుని దిగ్విజ‌యంగా విజ‌య‌