ప‌వ‌న్ పోటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-09 19:07:28

ప‌వ‌న్ పోటీ

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో అన్ని సెగ్మెంట్ల‌లో జ‌న‌సేన పోటీ చేస్తుంది అని ఇప్ప‌టికే తెలియ‌చేశారు.. అలాగే జ‌న‌సేన పార్టీ ఇప్ప‌టికే ఆ కార్యాచ‌ర‌ణ‌లో ముందుకు వెళుతోంది అని అంటున్నారు జ‌న‌సేన అభిమానులు, పార్టీ నాయ‌కులు.. అయితే ప‌వ‌న్ రాయ‌ల‌సీమ నాలుగు జిల్లాలపై పోటికి ఫోక‌స్ చేశారు అని, గ‌తంలో వార్త‌లు వినిపించాయి.
 
మ‌రీ ముఖ్యంగా ప‌వ‌న్ అనంత‌పురం నుంచి పోటీ చేస్తారు అని అంద‌రూ అనుకున్నారు. ఆయ‌న అనంతపురం జిల్లా నుంచి ఏదో  ఓ సెగ్మెంట్లో పోటీ చేస్తాను అని తెలియ‌చేశారు.. అలాగే ఆయ‌న త‌న ప్ర‌ణాళిక వేసుకుంటున్నారు అని అనుకున్నారు అంద‌రూ. అయితే ఈ స‌మ‌యంలో ఓ ఇంట్ర‌స్టింగ్ అంశం బ‌య‌ట‌కు వ‌చ్చింది.
 
వచ్చే ఎన్నికల్లో కృష్ణాజిల్లా అవనిగడ్డ నుంచి  ప‌వ‌న్ పోటీ చేసేందుకు  ఆలోచన చేస్తున్నారని ఆ జిల్లా జనసేన పార్టీ ఇన్‌చార్జ్‌ ముత్తంశెట్టి కృష్ణారావు తెలిపారు.అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేనను మరింత బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని ఆయ‌న  చెప్పారు. సమావేశంలో ముత్తంశెట్టి విజయనిర్మల పాల్గొన్నారు. అయితే ప‌వ‌న్ ఈ స్టేట్ మెంట్ చెయ్య‌లేదు కాని, పార్టీ  నాయ‌కులు చేసిన కామెంట్లు పై ఇప్పుడు అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు.
 
గ‌తంలో తెలియ‌చేసిన‌ట్టు అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని పవన్‌ కల్యాణ్ చెప్పిందే చేస్తారు అని అభిమానులు అంటున్నారు. మరోప‌క్క కొంద‌రి వెర్ష‌న్ ఆయ‌న  తిరుపతి నుంచి పోటీ చేస్తారన్న వార్త‌లు వినిపిస్తున్నాయి... పవన్‌ ఎక్కడి నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారనే దానిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. జనసేన పార్టీ దీనిపై ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. మ‌రిచూడాలి అనంత లేదా, కృష్ణాలో అవ‌నిగ‌డ్డ లేదా తిరుప‌తా అనేది జ‌న‌సైనికుడే క్లారిటీ ఇవ్వాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.