జ‌న‌సేన పాద‌యాత్ర‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-05 11:24:49

జ‌న‌సేన పాద‌యాత్ర‌

ఏపీ రాజ‌కీయాలు రోజుకో మ‌లుపు తిరుగుతున్నాయి. ప్ర‌త్యేక‌హోదా ఉద్య‌మం మొద‌లైన‌ప్ప‌టి నుంచి రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల్లో  ఊహించ‌ని ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాలంటే త‌ప్ప‌కుండా ప్ర‌త్యేక‌హోదా పోరాటంలో భాగ‌స్వామై ఉండాల‌ని గ్ర‌హించిన రాజ‌కీయ పార్టీలు దానికి అనుగుణంగా వ్యూహాలు ర‌చించుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ఇప్ప‌టికే రాష్ట్రంలో ఉన్న అన్ని రాజ‌కీయ పార్టీలు హోదా పై పోరాటం కోన‌సాగిస్తున్నాయి.
 
ప్ర‌త్యేక‌హోదా కోసం ప్ర‌తిప‌క్ష వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రం పై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశపెట్టింది. అప్ప‌టికి కూడా హోదా ప్ర‌క‌టించ‌క‌పోతే  పార్ల‌మెంట్ చివ‌రి రోజున వైసీపీ  ఎంపీలు రాజీనామాలు స‌మ‌ర్పించి దిల్లీలో ఉన్న ఏపీ భ‌వ‌న్‌లో ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేస్తార‌ని  పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. అధికార తెలుగుదేశం పార్టీ ప్ర‌త్యేక‌హోదా కోసం కేంద్రంలో ఉన్న మంత్రి ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసి చివ‌రికి ఎన్డీయే ప్ర‌భుత్వంలో ఉన్న మిత్ర‌ప‌క్షంలో నుంచి కూడా వైదోలిగిన విష‌యం తెలిసిందే.ఇక వామ‌ప‌క్ష పార్టీలు త‌న‌దైన శైలిలో పోరాటాలు కొన‌సాగిస్తోంది.
 
ప్ర‌త్యేక‌హోదా పోరాటానికి జ‌న‌సేన సిద్దం అయిన‌ట్లు పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌క‌టించారు. వామపక్షాలతో భేటీ ముగిసిన త‌ర్వాత మీడియాతో మాట్లాడిన ప‌వ‌న్ ఈ నెల 6వ తేదీన జాతీయ రహదారులపై పాదయాత్ర నిర్వహించ బోతున్నామ‌ని తెలిపారు.  ఉదయం పదిగంటలకు అన్ని చోట్ల ఈ పాదయాత్రలు ప్రారంభమవుతాయని అన్నారు. విభజన హామీల అమలు చేయనందుకుగాను కేంద్రానికి వ్య‌తిరేకంగా చేప‌డుతున్న ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మంలో పార్టీ శ్రేణులందరూ పాల్గొనాలని పవన్ పిలుపు నిచ్చారు.  
 
ఏపీకి  ప్రత్యేక హోదా ప్ర‌క‌టించ‌డంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వం మోసం చేసింద‌ని అన్నారు.  ఏపీలో ఉన్న రాజ‌కీయ పార్టీలు అవిశ్వాసం పెడితే చర్చకు రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటుందన్నారు. జాతీయ రహదారులు లేని ప్రాంతాల్లో ముఖ్యమైన రోడ్లలో పాదయాత్రలు చేయాలని పార్టీ శ్రేణుల‌కు సూచించారు. టీడీపీ, వైసీపీలు కేవలం విమర్శలకే పరిమితమయ్యాయన్నారు. కేంద్రంపై ఒత్తిడి తేవడంలో ఘోరంగా విఫలమయ్యాయన్నారు పవన్ కల్యాణ్. ప్రత్యేక హోదా కోసం తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంలో సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, మధు పాల్గొన్నారు. ఈ పాదయాత్రలు మొదటి హెచ్చరిక మాత్రమేనని వారు చెప్పారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.