లోకేష్ అవినీతికి ఆధారాలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-22 17:29:09

లోకేష్ అవినీతికి ఆధారాలు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడైన‌ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా  చేస్తున్న అవినీతికి సంబంధించి తమ వద్ద అన్ని ఆధారాలున్నాయని జనసేన నేతలు చెబుతున్నారు. ఇటీవ‌ల జ‌న‌సేన పార్టీ ఆవిర్బావ దినోత్స‌వంగా పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అదే విధంగా మంత్రి లోకేష్ పై అవినీతి ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం అంద‌రికి తెలిసిందే.
 
తాజాగా జ‌న‌సేన నేత‌లు మీడియాతో మాట్లాడుతూ లోకేష్  చేసిన అవినీతి ప్ర‌తి ఒక్క‌టి తెలుస‌ని దానికి సంబందించిన ఆధారాలున్నాయని వారు తెలిపారు. అంతేకాకుండా టీడీపీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు జ‌న‌సేన‌లోకి రావ‌డానికి సిద్దంగా ఉన్నార‌ని జ‌న‌సేన నాయ‌కులు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు....  ఆ 40 మంది  ఎమ్మెల్యేలు ఎవ‌ర‌నేది టీడీపీ అధినేత సీఎం చంద్ర‌బాబుకు కూడా తెలుస‌ని అన్నారు.
 
మంత్రి లోకేష్ అవినీతి పై ఢిల్లీ స్థాయి ఏజెన్సీతో విచారణ చేపట్టాలని కోరుతామని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయ‌కులు చేసిన అక్ర‌మాల‌ను వెల్ల‌డించేందుకు జ‌న‌సేన సిద్దంగా ఉంద‌ని పార్టీ నేత‌లు తెలిపారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అమ‌రావ‌తిలో కొన్న భూములుకు సంబందించి అన్ని లెక్క‌లు త‌మ వ‌ద్ద  ఉన్నాయ‌ని వారు తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.