జేపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jaya prakash narayana and pawan kalyan
Updated:  2018-03-30 04:55:46

జేపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలుగుదేశం కోట‌రీలో ఒక్కొక్క‌రు బ‌య‌ట‌కు వ‌స్తున్నారు అనేలా ఇటీవ‌ల నాయ‌కుల మాట‌లు భావ‌న‌ను క‌లిగిస్తున్నాయి..మ‌రీ ముఖ్యంగా తెలుగుదేశం నాయ‌కులు ప‌వ‌న్ పై విమర్శ‌లు చేయ‌డం, అస‌లు ప‌వ‌న్ ప్లీన‌రీలో మాట్లాడిన మాట‌లు ఇప్పుడు తెలుగుదేశంలో ఏదో ఓ మూల వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ విమ‌ర్శ‌ల జోరు చూస్తుంటే తెలుగుదేశానికి ఎంతటి ప‌రిస్ధితి ప‌వ‌న్ తీసుకువ‌చ్చారా అని అనిపిస్తోంది.
 
ఇక ప‌వ‌న్ ఓ క‌మిటి వేసిన సంగ‌తి తెలిసిందే...జేఎఫ్‌సీ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ క‌మిటీ ఈ క‌మిటీలో మాజీ ఐఏఎస్ అధికారి జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ ఓ మెంబ‌ర్ గా ఉన్న విష‌యం తెలిసిందే... అయితే ఇప్పుడు ఆయ‌న ప‌వ‌న్ క‌ల్యాణ్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.
 
జేఎఫ్‌సీపై పవన్‌ అంతగా శ్రద్ధ చూపించట్లేదని ఆయన వ్యాఖ్యానించారు..... ఇక తాజాగా మరో కమిటీతో ముందుకు రాబోతున్నట్లు ఆయ‌న ప్రకటించారు. జేఎఫ్‌సీపై పవన్ మొదట్లో చూపించినంత శ్రద్ధ ఇప్పుడు కనబరచ‌టం లేదు. అధ్యయనం, చర్చలు  చేసి లెక్కలు తీస్తే.. దానిపై ఎలాంటి పురోగతి కనిపించటం లేదు. పవన్‌ కూడా ఎందుకనో ఆసక్తికనబరచటం లేదు. అందుకే కొత్తగా స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేశాంఅని జేపి అన్నారు.
 
జేఎఫ్‌సీ మొదటి దశ అయితే ఇది రెండో దశ. కేంద్రం సమయం కేటాయిస్తే వెళ్లి కలిసి చర్చిస్తాం అని జేపీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రత్యేక హోదా అసలు తెర పైకి తెచ్చిందే తానని జేపీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మొత్తానికి ప‌వ‌న్ పై జేపీ ఇలా అన‌డం ఆ క‌మిటీ మెంబ‌ర్ అయిన జేపీ అంత‌రంగీక ఆలోచ‌న ఏమిటా అని ఇప్పుడు జ‌న‌సేన నాయ‌కులు అభిమానులు  చ‌ర్చించుకుంటున్నారు.

షేర్ :

Comments

2 Comment

  1. DONGA NATAKALU APANDI JP GARU. MEERU, MEE GOPPATANAM PRAJALA KI TELISINDI. BODI GUNDUKI MOKALU KI MUDIPETTADAM MANANDI. SPECIAL STATUS MEEDA EPPUDU AYINA MATLADARA? KULA GAJJI VEHSALU VEYYAVADDU. PRAJALA NI ANYAYAM CHEYYAVADDU. EKKU VA KALAM PRAJALA NI MOSAM CHEYYALERU. AP PRAJALA KI MEE NATAKALU, D

    DONGA NATAKALU APANDI JP GARU. MEERU, MEE GOPPATANAM PRAJALA KI TELISINDI. BODI GUNDUKI MOKALU KI MUDIPETTADAM MANANDI. SPECIAL STATUS MEEDA EPPUDU AYINA MATLADARA? KULA GAJJI VEHSALU VEYYAVADDU. PRAJALA NI ANYAYAM CHEYYAVADDU. EKKU VA KALAM PRAJALA NI MOSAM CHEYYALERU. AP PRAJALA KI MEE NATAKALU, D

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.