జేపీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-17 10:57:14

జేపీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సార‌ధ్యంలో ఏర్పాటు చేసిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ క‌మిటీ (జేఎఫ్ సీ) లో అప్పుడే అంత‌ర్యుద్దం మొద‌లైంది. విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాల‌ను కేంద్రం అమ‌లు చేయ‌క‌పోవ‌డంతో పాటు కేంద్రం నుండి రాష్ట్రానికి వ‌చ్చిన లెక్కల‌పై నిజనిర్ధార‌ణ‌కు ఏర్పాటు చేసిన ఈ క‌మిటీ మూన్నాళ్ల ముచ్చ‌ట‌గానే మారేట‌ట్లు క‌నిపిస్తోంది.
 
శుక్ర‌వారం ఏర్పాటు చేసిన జేఎఫ్ సీ మీటింగ్ లో లోక్ స‌త్తా వ్య‌వ‌స్ధాప‌కుడు  చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. కేంద్రం ఇచ్చిన నిధులు రాష్ట్ర ప్ర‌భుత్వం ఎలా ఖ‌ర్చు చేసిందంటూ ప్ర‌శ్నించ‌డాన్ని జేపీ త‌ప్పుబ‌ట్ట‌డం గ‌మ‌నార్హం. కేంద్రం లెక్క‌లు అడ‌గ‌డాన్ని జేఫ్ సీ ఖండిస్తోంద‌ని చెప్ప‌డం విడ్డూరంగా మారింది. 
 
ఈ విష‌యంపై జేఎఫ్ సీలో స‌భ్యుడైన మాజీ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు ఖండించారు. కేంద్రం విడుద‌ల చేసిన నిధుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం లెక్క‌లు చెప్పాల్సిందేన‌ని అన్నారు. యుటిలైజేషన్ సర్టిఫికేట్‌ ఇవ్వాల్సి ఉంటుందని జేపీ గుర్తు చేశారు. 
 
కేంద్ర ప్ర‌భుత్వం ఇస్తున్న నిధులను నిర్ధిష్ట కార్యక్రమాలకు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని.. వాటి కోస‌మే నిధుల‌ను  ఖర్చు పెట్టారో లేదో యూటీసీలు ఇవ్వాల్సి ఉంటుందని కృష్ణారావు  స్పష్టం చేశారు. దీంతో జేఎఫ్ సీలు ఇద్ద‌రు కీల‌క‌మైన వ్య‌క్తుల మ‌ధ్య భిన్నాభిప్రాయాలు రావ‌డం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. 
 
మ‌రోవైపు ఈ క‌మిటీని ఏర్పాటు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాన్ కు ప్రాధాన్య‌త త‌గ్గింద‌నే వార్త‌లు కూడా ఇప్పుడు తెర‌పైకి వ‌చ్చాయి. జేఎఫ్ సీకి సంబంధించి కీల‌క పాత్ర‌ను జేపీ వ్య‌వ‌హరిస్తున్నార‌ని, దీంతో ప‌వ‌న్ కు అక్క‌డ అంత ప్రాముఖ్య‌త ఏమీ లేద‌ని తెలుస్తోంది. దీంతో పాటు ప‌వ‌న్ ఉత్త‌ర భార‌త‌దేశం, ద‌క్షిణ భార‌త‌దేశం అంటూ విభ‌జ‌న వాదాన్ని ప్ర‌స్తావించ‌డం కూడా వివాదాస్ప‌దంగా మారింది. మ‌రి క‌మిటీ ఆదిలోనే ఏర్ప‌డ్డ ఈ అంత‌ర్యుద్దం ఎలాంటి ప‌రిణామాల‌కు దారి తీస్తుందో చూడాలి. 
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.