జ‌యేంద్ర స‌ర‌స్వ‌తి శివైక్యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jayendrasaraswathi image
Updated:  2018-02-28 11:23:19

జ‌యేంద్ర స‌ర‌స్వ‌తి శివైక్యం

కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి(82) కన్నుమూశారు.. గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో భాద‌ప‌డుతున్న ఆయ‌నకు ,గ‌త‌ రాత్రి ఒక్కసారిగా శ్వాస సమస్యలు తలెత్తడంతో,  శిష్యులు కంచి మఠానికి చెందిన ఆస్పత్రికి తరలించారు... అయితే ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందించిన‌ప్ప‌టికి ఫలితం లేకపోయింది. దీంతో బుధవారం ఉదయం 9 గంటల సమయంలో ఆస్పత్రిలోనే ఆయన తుదిశ్వాస విడిచారు.
 
జయేంద్ర సరస్వతి  స్వ‌స్థ‌లం  తమిళనాడులోని తంజావూరు. 1935, జులై 18నఆయ‌న జ‌న్మించారు. జయేంద్ర సరస్వతి అసలు పేరు సుబ్రహ్మణ్య మహాదేవ అయ్యర్‌. 1954, మార్చి 24న కంచి పీఠానికి 69వ పీఠాధిపతిగా నియమితులవ్వ‌డంతో జయేంద్ర సరస్వతిగా పేరు మార్చుకున్నారు.
 
కంచి పీఠాధిప‌తిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత ఆయ‌న ఆధ్వ‌ర్యంలో  అనేక సామాజిక కార్యక్రమాలను చేపడుతోంది పీఠం. పాఠశాలలు, కంటి ఆస్పత్రులు ఈ పీఠం ఆధ్వర్యంలో నడుస్తున్నాయి..కంచి కామకోటి పీఠానికి జయేంద్ర సరస్వతి 69వ అధిపతి. రెండు దశాబ్దాల క్రితం చంద్రశేఖరేంద్ర సరస్వతి మరణంతో జయేంద్ర సరస్వతికి కంచి పీఠం బాధ్యతలు దక్కాయి. ఇప్పుడు జయేంద్ర సరస్వతి కీర్తిశేషులవడంతో కంచి కామకోటి పీఠం తదుపరి అధిపతిగా శంకర విజయేంద్ర సరస్వతి నియమితులైనట్లు తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.