జ‌గ‌న్ కు తిరుగేలేదు 2019లో ఖ‌చ్చితంగా గెలుస్తారు..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jagan and jc divakar reddy
Updated:  2018-10-23 12:16:50

జ‌గ‌న్ కు తిరుగేలేదు 2019లో ఖ‌చ్చితంగా గెలుస్తారు..

అధికార తెలుగుదేశం పార్టీ, అనంత‌పురం జ‌ల్లా ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి ఎలాంటి విష‌యంలో అయినా ముక్కుసూటిగా మాట్లాడే వ్య‌క్తి. ఒకానొక సంద‌ర్భంలో 2014లో రాజ‌కీయ జీవితాన్ని ఇచ్చినచంద్ర‌బాబు నాయుడుపై కూడా అనేక సంద‌ర్భాల్లో స‌భా ముఖంగా జేసీ దివాక‌ర్ రెడ్డి విమ‌ర్శ‌లు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఇదే క్ర‌మంలో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తి స‌చివాలయంలో ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు జేసీ.
 
ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీకి చెందిన సుమారు 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేల‌పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఎక్కువ‌గా ఉంద‌ని వారు పోటీ చేసే స్థానాల్లో కొత్త‌వారిని చంద్ర‌బాబు నాయుడు టీడీపీ త‌ర‌పున పోటీ చేయిస్తే 2019లో మ‌ళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని సంచ‌ల‌న వ్య‌ఖ్య‌లు చేశారు. అంతేకాదు ప్ర‌తిప‌క్షనేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు జేసీ. 
 
వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ 175 నిమోజ‌క‌వ‌ర్గాల్లో ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేసినా ఖ‌చ్చితంగా గెలుస్తార‌ని స్ప‌ష్టం చేశారు. మిగిలిన వైసీపీ పోటీ అభ్య‌ర్థుల గెలుపు ఓట‌మిల‌ను తాను చెప్ప‌లేన‌ని అన్నారు. ఇక జేసీ చేసిన వ్యాఖ్య‌ల‌పై అనంత‌పురం టీడీపీ నాయ‌కులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఎందుకంటే చాలా కాలంగా జేసీ వ‌ర్సెస్ అనంత‌పురం టీడీపీ ఎమ్మెల్యేల మ‌ధ్య పోటీ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాల‌ను దృష్టిలో పెట్టుకుని జేసీ ఈ వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని వ్య‌తిరేక శ‌క్తులు భావిస్తున్నాయి.

షేర్ :

Comments

0 Comment