జేసి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-27 14:37:42

జేసి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

రాజ‌కీయాల్లో ప‌రిచ‌యం అక్క‌ర్లేని వ్య‌క్తి జేసి దివాక‌ర్ రెడ్డి ... ఎక్క‌డ మీడియా దొరికితే అక్క‌డ‌ త‌న ప్ర‌త్య‌ర్థుల‌ను వాక్చాతుర్యంతో సంచ‌ల‌న విమ‌ర్శ‌లు చేస్తూనే ఉంటారు జేసీ దివాక‌ర్ రెడ్డి.... 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి చంద్ర‌బాబు స‌మ‌క్షంలో తెలుగుదేశం పార్టీ కండువా క‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే...  చంద్ర‌బాబు అండ‌తో గ‌డిచిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున పోటీ చేసి త‌న‌కున్న బ‌లంతో త‌న ప్ర‌త్య‌ర్థిని ఓడించి ఎంపీ స్థానాన్ని ద‌క్కించుకున్నారు జేసి... అలా మ‌ళ్లీ రాజ‌కీయ జీవితాన్ని ఇచ్చిన చంద్ర‌బాబును సైతం లెక్క‌చేయ‌కుండా మీడియా స‌మ‌క్షంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూనే ఉంటారు ఎంపీ జేసి దివాక‌ర్ రెడ్డి.
 
ఇక తాజాగా కాస్టింగ్ కౌచ్ పై కూడా స్పందిచారు జేసి దివాక‌ర్ రెడ్డి..  ఇదే విష‌యంపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి కూడా ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ఇటీవ‌ల‌.. కాస్టింగ్ కౌచ్ అన్ని చోట్లా ఉందని, పార్లమెంటు కూడా దానికి అతీతం కాదని ఆమె  చెప్పిన సంగ‌తి తెలిసిందే.. ఇక ఇదే అంశంపై జేసి దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, అన్ని చోట్లా ఉన్నట్టే రాజకీయాల్లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉందని చెప్పారు. అయితే పార్లమెంటులో ఉన్నట్టు మాత్రం తనకు తెలియదని అన్నారు.
 
దీంతో పాటు ప్ర‌త్యేక‌ హోదాపై కూడా స్పందించారు... తాను ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు గ‌తంలో ప్ర‌త్యేక హోదా కేంద్రం ఇవ్వ‌ద‌ని చెప్పాన‌ని స్ప‌ష్టం చేశారు.. అయితే చంద్ర‌బాబు త‌న రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన వ్య‌క్తి కాబ‌ట్టి , అలాగే తెలివైన వ్యక్తి కాబట్టే కేంద్రంతో నాలుగేళ్లు కలిసి ఉన్నారని జేసి దివాక‌ర్ రెడ్డి తెలిపారు.. రాష్ట్రాన్ని అభివృద్ది  ప‌ర‌చాల‌ని ప్ర‌తీ ఒక్క‌రికి ఉంటుంద‌ని అయితే అది ఒక్క‌రి వ‌ల్ల సాధ్యం కాద‌ని ప్ర‌తీ ఇక్క‌రూ చేయ్యిక‌లిపితేనే అది సాధ్యం అవుతుంద‌ని తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.