జేసీని బ‌య‌పెడుతున్న టీడీపీ ఎమ్మెల్యే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-26 16:03:54

జేసీని బ‌య‌పెడుతున్న టీడీపీ ఎమ్మెల్యే

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో అంత‌పురం జిల్లా ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డిలో టెన్ష‌న్ మొద‌లైందా, టీడీపీ త‌ర‌పున త‌న కుమారుడికి సీటు క‌న్ఫామ్‌ అయినా కూడా బ‌య‌ప‌డుతున్నారా అంటే అవున‌నే అంటున్నారు రాజకీయ విశ్లేష‌కులు.ఈ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అందులో టీడీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే 13 మంది ఉన్నారు. అయితే అందులో ఒక‌రు ఫిరాయింపు ఎమ్మెల్యే ఉన్నారు. 
 
ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా ఈ 13 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు టీడీపీ త‌ర‌పున పోటీ చేసేందుకు సిద్దమ‌య్యారు. కానీ ఊహించ‌ని ప‌రిణామాల నేప‌థ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పోటీ చేసే స్థానాల్లో ఎంపీ జేసి దివాక‌ర్ రెడ్డి జోక్యం చేసుకుని వారికి వ్య‌తిరేకంగా జిల్లా వ్యాప్తంగా ప్ర‌చారం చేయిస్తున్నారు. దీంతో అనంత‌పురం జిల్లాలో టీడీపీ నాయ‌కులు రెండు వ‌ర్గాలుగా విడిపోయి మీడియా సాక్షిగా ఒక‌రిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు.
 
వ‌చ్చే ఎన్నిక‌ల్లో జేసీ త‌న కుమారుడు ప‌వ‌న్ రెడ్డిని బ‌రిలో దించేందుకు సిద్ద‌మ‌య్యారు. అయితే ఇందుకు టీడీపీ అధిష్టానం కూడా సుముఖంగా ఉంది. ఇక ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేలు త‌న కుమారుడికి స‌పోర్ట్ చేస్తారా లేదా అన్న‌ది పెద్ద ప్రశ్న‌గా మారింది. వాస్త‌వంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ రెడ్డి తాడిప‌త్రి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే జేసీకి పెద్ద టెన్ష‌న్ ఉండ‌దు. 
 
కానీ అంత‌పురంలో ఎంపీగా పోటీ చేస్తే తీవ్ర ఇబ్బందిగా మారుతోంది. ఎందుకంటే పార్ల‌మెంట్ ప‌రిధిలో ఏడు నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. వ‌చ్చే ఎన్నికల్లో మ‌ళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోటీ చేస్తే ద‌గ్గ‌రుండి జేసీ కుమారుడిని ఓడించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తారు. ఎమ్మెల్యే ఓటు టీడీపీకి వేసి, ఎంపీ ఓటు వైసీపీకి వేసుకోండని ప్రచారం చేసినా చేస్తారు. అందుకే ఇప్పుడు జేసీ టెన్షన్ కు గురి అవుతున్న‌ట్లు రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.