జగన్ దెబ్బకు రాజకీయాల నుంచి తప్పుకుంటున్న జేసీ దివాకర్ రెడ్డి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-18 18:23:55

జగన్ దెబ్బకు రాజకీయాల నుంచి తప్పుకుంటున్న జేసీ దివాకర్ రెడ్డి

రాజ‌కీయాలకు ప‌రిచ‌యం అక్క‌ర్లేని వ్య‌క్తి అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి. ఈయ‌న ఏ విష‌యం అయినా ముక్కు సూటిగా మాట్లాడ‌తారు. గ‌తంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న‌ప్పుడు జేసీ దివాక‌ర్ రెడ్డి చంద్ర‌బాబు నాయుడుకి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించిన సంగ‌తి తెలిసిందే. 
 
ఇక తెలుగు రాష్ట్రాలు విభ‌జ‌న త‌ర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ నామ‌రూపం లేకుండా పోవ‌డంతో గ‌తంలో జేసీ ఎవ‌రినైతే తీవ్ర స్థాయిలో విమ‌ర్శించారో ఆయ‌న స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు. ఆ త‌ర్వాత 2014 ఎన్నిక‌లు జ‌రిగితే టీడీపీ త‌ర‌పున అనంత‌పురం జిల్లాలో ఎంపీగా పోటీ చేసి గెలిచారు.
 
అయితే పార్టీ మారినా కూడా జేసీ దివాక‌ర్ రెడ్డి మాత్రం విమ‌ర్శ‌లు చేయ‌డం ఆప‌లేదు.2014లో రాజ‌కీయ జీవితం ఇచ్చిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై కూడా గతంలో మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి జేసీ దివాక‌ర్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అలా విమ‌ర్శ‌లు చేస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌ల్లో నిలుస్తున్నారు జేసీ. ఇక ఇప్పుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయ‌న‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు జేసీ దివాక‌ర్ రెడ్డి.
 
తాజాగా ఆయ‌న‌ రాష్ట్ర రాజ‌కీయ నాయ‌కులు షాక్ తినేలా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంద‌ని, వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డినే ముఖ్య‌మంత్రి అవుతార‌ని జేసీ త‌న అనుచ‌రుల ద‌గ్గ‌ర వాపోయార‌నే వార్త తాడిప‌త్రిలో కోడై కూస్తోంద‌ట‌. అంతేకాదు వ‌చ్చే ఎన్నిక‌లకు రాజ‌కీయంగా దూరంగా ఉంటార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. జేసీ ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డంతో తెలుగుదేశం నాయకులు కంగుతింటున్నారు.
 
ఇక ఈ వార్త తెలుసుకున్న వైసీపీ నాయ‌కులు వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అవుతార‌నే భ‌యంతో జేసీ రాజ‌కీయాల‌కు దూరం అవుతున్నార‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మ‌రికొంద‌రు అయితే గ‌తంలో జ‌గ‌న్ ను టీడీపీ నాయ‌కులు ఎవ‌రైతే విమ‌ర్శించారో వారంద‌రికి ఇదే ప‌రిస్థితి వ‌స్తుంద‌ని వైసీపీ నాయ‌కులు అంటున్నారు.

షేర్ :

Comments

1 Comment

  1. HAI

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.