బ్రేకింగ్ టీడీపీకి జేసీ గుడ్ బై

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-19 14:55:23

బ్రేకింగ్ టీడీపీకి జేసీ గుడ్ బై

రాజ‌కీయాల్లో ప‌రిచ‌యం అక్క‌ర్లేని వ్య‌క్తి జేసీ దివాక‌ర్ రెడ్డి ఆయ‌న రాజ‌కీయ అరంగేట్రం చేసిన‌ప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి రాయ‌ల‌సీమ రాజ‌కీయాల్లో ఓ వెలుగు వెలిగారు. ఇక తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత తెలంగాణ‌లో మినహా ఏపీలో కాంగ్రెస్ పార్టీ గ‌ల్లంతు కావ‌డంతో జేసీ దివాక‌ర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు.
 
ఆ త‌ర్వాత 2014లో మొద‌టి సారిగా ఎన్నిక‌లు జ‌రిగితే ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ త‌రుపున అనంత‌పురం జిల్లా నుంచి పార్ల‌మెంట్ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు. చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నా కూడా జేసీ త‌న నోటికి మాత్రం తాళం మాత్రం వెయ్య‌లేదు. అనేక సార్లు స‌భా ముఖంగా చంద్ర‌బాబును ఉద్దేసించి జేసీ విమ‌ర్శ‌లు చేశారు. ఒక విధంగా చూస్తే టీడీపీ అధికారంలో ఉండి చేసిన త‌ప్పుల‌ను బ‌హిర్గ‌తం చేశార‌నే చెప్పాలి. 
 
ఇక అదే క్ర‌మంలో మ‌రోసారి జేసీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌స్తుతం వ‌ర్షాకాల పార్ల‌మెంట్ స‌మావేశాల్లో టీడీపీ ఎంపీలు అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ అవిశ్వాస తీర్మానం రేపు లోక్‌స‌భ‌లో చ‌ర్చ జ‌రుగనుంది. అయితే ఈ చ‌ర్చ‌కు తాను హాజ‌రుకాన‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. 
 
ఇక ఆయ‌న ప్ర‌క‌ట‌న చూసి టీడీపీ నాయ‌కులు భ‌యాందోళ‌న‌కు చెందుతున్నారు. ఎందుకు జేసీ ఇలాంటిని నిర్ణ‌యం తీసుకున్నారు అని ఒక్కొక్క‌రు ఒక విధంగా ఆలోచిస్తున్నారు. అయితే విస్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం జేసీ ప్ర‌క‌ట‌న వెనుక పెద్ద రాజ‌కీయమే ఉంద‌ని భావిస్తున్నారు. ఆయ‌న టీడీపీ తీర్థం తీసుకున్న‌ప్ప‌టి నుంచి పార్టీ నాయ‌కులు ప‌రోక్షంగా వ్య‌తిరేకిస్తూ రాజ‌కీయంగా సీనియ‌ర్ అయినా కూడా స‌రైన ప్రాధాన్య‌త ఇవ్వ‌డంలేద‌ని ఆయ‌న చాలా సంద‌ర్భాల్లో బాద‌ప‌డ్డార‌ట‌. 
 
అందుకే మాజీ ఎమ్మెల్యే మ‌ధుసుద‌న్ గుప్తా టీడీపీలో చేరేందుకు సిద్ద‌మైనా కూడా ఆయ‌న‌ను అడ్డుకున్నార‌ట‌. ఇక త‌న డిమాండ్ల‌న్నిటికి పార్ట‌మెంట్ స‌మావేశాలు అయిపోయిన త‌ర్వాత స్పందించాల‌ని లేక‌పోతే  పార్టీకి కూడా రాజీనామా చేస్తానని ఆయన చెప్పినట్టు సమాచారం.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.