చంద్ర‌బాబు జేసీని తీవ్రంగా అవ‌మానించారు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu naidu and jc divakar reddy
Updated:  2018-09-19 12:32:44

చంద్ర‌బాబు జేసీని తీవ్రంగా అవ‌మానించారు

అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి ప్ర‌స్తుతం రాష్ట్ర రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారుతున్నారు. అయితే ఇదే క్ర‌మంలో తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చెయ్య‌న‌ని రాజ‌కీయంగా రాజీనామా చేస్తాన‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు స‌భాముఖంగా సంచ‌ల‌నం రేపారు. అంతేకాదు 2019 లో మ‌ళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌స్తే త‌నకు చంద్ర‌బాబు నాయుడు మంత్రి ప‌ద‌వి ఇస్తాడ‌న్న‌ న‌మ్మ‌కం త‌న‌కు లేద‌ని జేసీ వ్యాఖ్యానిస్తున్న‌ సంగతి తెలిసిందే.
 
ఇదే క్ర‌మంలో జేసీ దివాక‌ర్ రెడ్డి ప‌లు విష‌యాలను ప్ర‌స్తావిస్తూ అసెంబ్లీ ప్రాంగ‌ణంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడును త‌న‌కోసం కాస్త స‌మ‌యం పాటించాల‌ని ప్రాదేయప‌డ్డారు. చంద్ర‌బాబు ప‌దినిమిషాలను కేటాయించి ఈ వీడియోను చూడాల‌ని జేసీ కోరారు. ఈ వీడియోను త‌న‌కోసం ఐదునిమిషాల‌ను కేటాయించి చూస్తే ఎవ‌రెలాంటివారో మీకే అర్థం అవుతుంద‌ని జేసీ దివాక‌ర్ రెడ్డి అన్నారు.
 
త‌న గురించి కొంద‌రు నాయ‌కులు అవాస్తవాలు చెబుతున్నార‌ని, ఈ వీడియోను చూస్తే వాస్త‌వాలు బ‌య‌ట‌ ప‌డ‌తాయ‌ని అన్నారు. అయితే చంద్ర‌బాబు నాయుడు మాత్రం ఈ వీడియోను చూడ‌లేద‌ని అన్నారు. దీంతో ఆయన‌ను ముఖ్య‌మంత్రి అవ‌మానించిన‌ట్లు అయింది. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.