నెక్ట్స్ కేంద్రంలో ఆ పార్టీదే అధికారం జేసీ సంచ‌ల‌నం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-10 18:09:40

నెక్ట్స్ కేంద్రంలో ఆ పార్టీదే అధికారం జేసీ సంచ‌ల‌నం

రాజ‌కీయాల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని వ్య‌క్తి అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి. ఈయ‌న రాజ‌కీయంగా నాటి నుంచి నేటి వ‌ర‌కు ఓ వెలుగు వెలిగారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా కూడా త‌న ప్ర‌త్య‌ర్థుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించారు. ఇక తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో జేసీ టీడీపీ తీర్థం తీసుకున్నారు. రాష్ట్రం విడిపోయిన త‌ర్వాత రాజ‌కీయ భ‌విష్య‌త్ ఇచ్చిన చంద్ర‌బాబును కూడా అనేక సంద‌ర్భాల్లో విర్శించారు జేసీ. 
 
అయితే ఇదే క్ర‌మంలో మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు జేసీ. ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ, దేశ రాజ‌కీయాల‌పై 2019 ఎన్నిక‌ల్లో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వ‌స్తుందో జేసీ మీడియా ద్వారా త‌న జోస్యాన్ని చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ఏపీకి ఎటువంటి ఫ‌లితం లేద‌ని, తాను ఇదే విష‌యాన్ని మొదటి నుంచి చెబుతున్నాన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 
 
ఏపీ విష‌యానికి వ‌స్తే బీజేపీ నాయ‌కులు దున్న‌పోతు మీద‌ వ‌ర్షం కురిసిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. తాను ఎంపీగా ఉన్న‌ప్ప‌టి నుంచి సంతృప్తి చెంద‌లేద‌ని ఈ నాలుగు సంవ‌త్స‌రాల్లో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ఒక్క రోజు కూడా స‌భ ముందుకు తీసుకురాలేద‌ని ఆయ‌న ఆవేద‌న చెందారు. 
 
ప్ర‌తీసారి కేంద్రానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు తెలప‌డానికే స‌రిపోతుంద‌ని జేసీ దివాక‌ర్ రెడ్డి వాపోయారు. ఆంధ్ర‌ప్రదేశ్ ఎంపీలే కాదు ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన ఎంపీలు కూడా ప్ర‌ధాని మోడీపై నిరంకుశంగా ఉన్నార‌ని, ఆయ‌న మూర్క‌త్వంతో ప‌ని చేస్తున్నార‌ని జేసీ మండిప‌డ్డారు. రాష్ట్రంలో జ‌రిగే విష‌యాలు మోడీకి చెబితే అర్థం చేసుకునే వ్య‌క్తి కాద‌ని జేసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 
 
ప్ర‌ధాని మోడీనే కాదు  ఆ పార్టీకి చెందిన మంత్రుల వ్య‌వ‌హార శైలి కూడా ఇలానే ఉంద‌ని జేసీ మండిప‌డ్డారు. మోడీ అధికారంలో ఉన్నంత వ‌ర‌కు రాష్ట్రానికి ఏదో మేలు చేస్తార‌నే న‌మ్మ‌కం త‌న‌కు లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నేత్రుత్వ ఏర్ప‌డే అవ‌కాశం ఉందా! దానికి మీరు మ‌ద్ద‌తు ఇస్తారా అని మీడియా అడ‌గ‌గా అందుకు జేసీ బ‌దులు ఇస్తూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వ‌స్తుంద‌నే న‌మ్మ‌కం లేద‌ని ప్ర‌స్తుత రాజకీయ ప‌రిస్థితిని చూస్తుంటే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి అంత ఊపులేద‌ని, కొన్ని సీట్లు పెరుగుతాయి త‌ప్ప వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ బీజేపీనే అధికారంలోకి వ‌స్తుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.