కేంద్రం పై జేసి కీల‌క వ్యాఖ్యలు....

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-07 11:24:20

కేంద్రం పై జేసి కీల‌క వ్యాఖ్యలు....

ఏపీకి ప్ర‌త్యేక హూదా ఉద్య‌మం తీవ్ర‌రూపం దాల్చింది అనే చెప్పాలి.. అస‌లు ఈ ప్ర‌త్యేక హూదా అనే పిలుపు అందుకోక పోతే తెలుగుదేశం ప్ర‌త్యేక హూదా కాకుండా ప్ర‌త్యేక ప్యాకేజీకి మెగ్గుచూపేది అనేది తేలిపోయింది.. అస‌లు కేంద్రంతో పోరాటం చేయ‌డం మాని త‌మ ఎంపీల‌ను కొన‌సాగిచండం కేంద్ర కేబినెట్లో మంత్రుల‌ను కొన‌సాగించ‌డం ప‌ట్ల విమ‌ర్శ‌లు వ‌స్తున్నా, ఓపిక ప‌డ‌దాం మ‌న‌కు ప్యాకేజీ చాలు అనేవిధంగా తెలుగుదేశం ముందుకు వెళ్లింది.. కాని తెలుగుదేశం తీరుపై ఇటు ఏపీలో నిర‌స‌న‌లు పెరిగాయి.. కేంద్రంతో ఎందుకు ఇటువంటి స‌యోధ్య‌పూర‌క మాట‌లు మాట్లాడుతున్నారు అని విమ‌ర్శ‌లు కోట‌లు దాటుతున్నాయి ప్ర‌జ‌ల నుంచి.
 
అయితే ఓటుకు నోటు అంశంకాదు, ఏకంగా ఏదో పెద్ద విష‌యం ఉండి, బాబు కేంద్రానికి ఇలా భ‌య‌ప‌డుతున్నారు అని మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి లాంటి నాయ‌కులు కూడా ప‌లు సంద‌ర్బాల‌లో త‌మ వెర్ష‌న్ తెలియ‌చేశారు. ఎప్పుడూ వార్త‌ల్లో ఉండే అనంత‌పురం ఎంపీ జేసి దివాక‌ర్ రెడ్డి  కూడా సీఎం చంద్ర‌బాబు పై గ‌తంలో అనేక సార్లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కేంద్రం మ‌ధ్య‌న అమిత్ షా మోదీ విష‌యంలో బాబు ఇరుక్కున్నారు అని ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.
 
తాజాగా ఏపీలో ప్ర‌త్యేకహూదా ఉద్య‌మంలో ఆయ‌న మ‌రోమారు సంచ‌ల‌న వ్యాఖ్య‌లుచేశారు.. బీజేపీ వైఖ‌రి బాగోలేద‌ని, ఇటువంటి వైఖ‌రి ఉంటుంది అని తాము అనేకోలేదు అని అన్నారు ఆయ‌న‌. ఇక  కేంద్రం ఇదే వైఖ‌రి ఏపీపై చూపితే తాము సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంటాము అన్నారు.. ఆ నిర్ణ‌యం కూడా తెలియ‌చేశారు జేసి.. ఏపీ త‌ర‌పు నుంచి కేంద్ర మంత్రి వ‌ర్గంలో కొన‌సాగుతున్న ఇరువురు తెలుగుదేశం  మంత్రులు రాజీనామా చేస్తార‌ని మంత్రి వ‌ర్గం నుంచి వైదొలుగుతాం అని అన్నారు..
 
మా నిరసనలు చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టుగా ఉందన్నారు... కాని  కేంద్రం నుంచి వైదొలిగితే వచ్చే పప్పుబెల్లాలు కూడా రావు... కానీ.. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వెళ్లాల్సిందేనని ఎంపీ జేసి అన్నారు. ఈ విష‌యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని జేసి అన్నారు.. ఇక గ‌త మూడు సంవ‌త్స‌రాలుగా ఇదే మాట చెబుతున్నారు అని, ఇటు మేధావి వ‌ర్గం తెలుపుతోంది.. అయితే చూడాలి ఇక కేవ‌లం ఓ సంవ‌త్స‌రం మాత్ర‌మే స‌మ‌యం ఉంది ఎన్నిక‌ల‌కు .. ఈ స‌మ‌యంలో బాబు  నిర్ణ‌యం తీసుకుంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ డెసిష‌న్  తెలుగదేశం ఫ్యూచ‌ర్ పై ఆధార‌ప‌డి ఉంటుంది అంటున్నారు పార్టీ త‌మ్ముళ్లు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.