జేసి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jc comments on bjp
Updated:  2018-04-10 12:56:22

జేసి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు ?

ప్ర‌ధాని నరేంద్ర‌మోదీ ఇంటి ముట్ట‌డితో దేశంలో ఎంతో పెద్ద పేరు సంపాదించాము అనే సంతోష ఆనంద డోలిక‌ల్లో ఉన్నారు తెలుగుదేశం ఎంపీలు...మా పార్టీ అధినేత సీఎం చంద్ర‌బాబు ఇచ్చిన ఆదేశాల మేర‌కు తాము ఈ నిర్ణ‌యం తీసుకున్నాము అని చెబుతున్నారు. అయితే ఇక్క‌డ వ‌ర‌కూ బాగానే ఉంది...
 
ముందు ప్ర‌త్యేక ఫ్యాకేజీ బాగుంది ప్ర‌త్యేక హూదా వద్దు అని చెప్పిన ఎంపీలు సుజ‌నా సీఎం ర‌మేష్ జేసి లాంటి వారు ఇప్పుడు బీజేపీని విమ‌ర్శించ‌డం, ప్ర‌జ‌లు కూడా ఆలోచ‌న‌లో ప‌డ్డారు... నాడు ఈ ఎంపీలు మాట్లాడింది ఏమిటి?  ఇప్పుడు ఈ ఎంపీలు అంద‌రూ యూట‌ర్న్ చంద్ర‌బాబులా తీసుకున్నారు అని అంద‌రూ విమ‌ర్శిస్తున్నారు... అదే కోణంలో బీజేపీ ప్ర‌శ్నిస్తోంది.
 
ఇక తాజాగా జేసీ దివాక‌ర్ రెడ్డి ప్ర‌ధానిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.. ప్ర‌ధానిగా మోదీ ఉన్నంత‌కాలం ఏపీకి ఎటువంటి ఫ‌లితం ఉండ‌దు, మేలు జ‌రుగ‌దు.. ఆయ‌న ఉన్నంత కాలం ప్ర‌త్యేక హూదా రాదు అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇక ఏపీకి 2019 లో ఎవ‌రు అధికారంలోకి వ‌స్తారో వారి ద్వారానే మేలు జ‌రుగుతుంది.. వారినే మ‌నం సాయం చేయ‌మ‌ని కోరాలి అని తెలియ‌చేశారు ఎంపీ జేసి దివాకార్ రెడ్డి.
 
చ‌ట్టాన్నిఅమ‌లు ప‌ర‌చాల్సిన వ్య‌క్తి ప్ర‌ధాని మోదీ, కాని ఆయ‌నే వెన‌క్కి వెళ్ల‌డం ఏమిటో అర్దం కాని ప‌రిస్దితి అని ఆయ‌న అన్నారు... బీజేపీ ప్ర‌త్యేక హూదా ఇస్తుంది అనే న‌మ్మ‌కం లేదు అని అన్నారు జేసి దివాక‌ర్ రెడ్డి.దున్న‌పోతు మీద వ‌ర్షం కురిస్తే ఎలా విదిలించుకుంటుందో అలా ఉంది అని అన్నారు జేసి దివాక‌ర్ రెడ్డి. రాజీనామాల వ‌ల్ల ఎటువంటి ఉప‌యోగం లేదు అని రాజీనామాల చేస్తే ఉప‌యోగం ఏమిటో కాస్త తెలియ‌చేయండి అని ఆయ‌న అన్నారు.. 
 
మొత్తానికి వైసీపీ రాజీనామాల దీక్ష‌లు చేస్తున్న స‌మ‌యంలో ఇటువంటి నిర్ణ‌యం తెలుగుదేశం తీసుకోవ‌డం ప‌ట్ల అంద‌రూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు... మీరు రాజీనామాలు చేయ‌రు  చేసిన వారివి దొంగ రాజీనామాలు అని అంటున్నారు అని ప్ర‌జ‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.