వాడో చోక్రా గాడు వాడు చెప్తే నేను వినాలా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-23 14:50:28

వాడో చోక్రా గాడు వాడు చెప్తే నేను వినాలా

రాజకీయాల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని వ్య‌క్తి  అనంత‌పురం జిల్లా ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి. ఈయ‌న‌ ఏ విష‌యాన్ని అయినా ముక్కు సూటిగా మ‌ట్లాడే వ్యక్తి. అయితే తాగాజా ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పలు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు జేసీ దివాక‌ర్ రెడ్డి. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ త‌న రాజ‌కీయ జీవితంలో ఎప్పుడు అయినా కూడా ఒక్క రూపాయి సంపాదించుకోవాల‌నే ఆలోచ‌న త‌న‌కు లేద‌ని స్ప‌ష్టం చేశారు.
 
ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ నాయ‌కుల‌తో పోలిస్తే తాను ఎమ్మెల్యేగా కంటిన్యూగా గెలిచానని స్ప‌ష్టం చేశారు. రాజ‌కీయ జీవితంలో తాను ఓట‌మిని ఎరుగ‌ని వ్య‌క్తి న‌ని గుర్తు చేశారు. త‌న విజ‌యానికి దోహ‌ద‌ప‌డిని ప్ర‌జ‌ల కోసం తాను ఎవ‌రితో అయినా పోరాడుతాన‌ని ఎందాకైనా పోతాన‌ని తెలిపారు.
 
అలాగే అనంత‌పురం ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ చౌద‌రి విష‌యంపై కూడా స్పందించారు జేసీ. ఎవ‌డో చోక్రాగాడు ఏదో మాట్లాడితే తాను ఎలా రాజకీయాలు మానుకుంటాన‌ని మండిప‌డ్డారు. రోడ్డు మీద ఏనుగులు పోతావుంటే కుక్క‌లు మొరుగుతా ఉంటాయి అయితే తాను వాట‌న్నింటిని పట్టంచుకోన‌ని జేసీ ఆరోపించారు.
 
పార్ల‌మెంట్‌ స‌మావేశాల‌కు తాను త‌న స్వ‌లాభం కోసం వెళ్ల‌న‌ని చెప్ప‌లేద‌ని కేవ‌లం ప్ర‌జ‌లకు మేలు చేసేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నాన‌ని తెలిపారు. తాను త‌న స్వ‌లాభం కోసం ఆలోచించిన‌ట్లు అయితే ప్ర‌జ‌లు త‌న‌ను 40 సంవ‌త్స‌రాలు రాజ‌కీయాల్లో ఉంచారని అన్నారు. త‌న నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కోసం వంద‌సార్లు రాజీనామా చేస్తాన‌ని, వంద‌సార్లు చ‌స్తాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.
 
ఇక జేసీ చేసిన‌ వ్యాఖ్య‌ల‌పై టీడీపీ ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ చౌద‌రి స్పందించారు. రోడ్డు మీద ఏనుగులు పోతావుంటే కుక్క‌లు మొరుతాయ‌న్నారు, అయితే తాను ఎక్కడా మొర‌గ‌లేద‌ని ప్ర‌భాక‌ర్ చౌద‌రి అన్నారు. ఈ మాట‌ల‌ను ఎవ‌రైతే అన్నారు వారికే వ‌ర్తిస్తుంది త‌ప్ప త‌న‌కు వ‌ర్తించ‌ద‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు. తాను ఏనుగు అనుకోలేద‌ని అలా అని కుక్క‌ను కూడా అనుకోలేద‌ని ప్ర‌భాక‌ర్ చౌద‌రి ఆరోపించారు. అయితే జేసీ అన్న మాట‌ల‌ను బ‌ట్టి చూస్తే  కుక్క అయినా విశ్వాసంగా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.