ఆవిష‌యంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప‌నికిరాని వేధ‌వ‌లు జేసీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-11 13:54:08

ఆవిష‌యంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప‌నికిరాని వేధ‌వ‌లు జేసీ

ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి మ‌రోసారి త‌న వాక్చాతుర్యంతో టీడీపీ ఎమ్మెల్యేల‌కు ఎంపీలకు ముచ్చెమ‌ట‌లు పుట్టించారు. అనంత‌పురం జిల్లా గార్ల‌దిన్నె మండ‌లం, మ‌ర్తాడు క్రాస్ రోడ్ లో ఏర్పాటు చేసిన రైతుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలంద‌రూ ప‌నికి రాని వెధ‌వ‌లు అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు జేసీ దివాక‌ర్ రెడ్డి. 
 
2014లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాల్లో చంద్రన్న‌ భీమా త‌ప్ప మిగిలిన ప‌థ‌కాల‌న్ని కూడా బాగాలేవ‌ని ఈ విష‌యాన్ని తాను చంద్ర‌బాబు ద‌గ్గ‌ర ధైర్యంగా చెబుతాన‌ని జేసీ స్ప‌ష్టం చేశారు. అయితే ఈ ప‌థ‌కాలు స‌రిగ్గా అమ‌లు కాక‌పోవ‌డానికి కార‌ణం టీడీపీ ఎమ్మెల్యేలే అని ఆయ‌న మండిప‌డ్డారు. ఈ ప‌థ‌కాలు బాగాలేవ‌ని చంద్ర‌బాబు నాయుడు ద‌గ్గ‌ర ఒక్క ఎమ్మెల్యే కూడా ధైర్యంగా చెప్ప‌లేర‌ని ఆయ‌న మండిప‌డ్డారు. అంతేకాదు ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన రూపాయికి కిలో బియ్యం ప‌థ‌కం పై కూడా జేసీ దివాక‌ర్ రెడ్డి స్పందించారు. 
 
ఈ ప‌థ‌కం ద్వారా ఎవరికి ఉప‌యోగం లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. రేష‌న్ కార్డ్ ఉన్న ప్ర‌తీ ఒక్క‌రు రూపాయికి కిలో బియ్యాన్ని తీసుకుని బ‌య‌ట బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నార‌ని జేసీ ఆరోపించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రి అయితే త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌రు ఒకవేళ ఇచ్చినా కూడా తాను చేసే విమ‌ర్శ‌లు త‌ట్టుకోలేర‌ని ఆయ‌న అన్నారు. 
 
ఎందుకంటే ఎక్క‌డైనా అన్యాయం జ‌రిగితే తాను త‌ట్టుకోలేన‌ని దానికి ప‌రిష్కారం ప్ర‌జ‌ల స‌మ‌క్షంలో జ‌ర‌గాల‌ని కోరుకుంటాన‌ని జేసీ దివాక‌ర్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. అలాగే క‌మ్యూనిస్ట్ పార్టీ నాయ‌కుల‌పై కూడా ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు జేసీ. తాను అసెంబ్లీకి వెళ్ల‌క ముందు వారిపై మంచి అభిప్రాయం ఉండేద‌ని కానీ ఇప్పుడు అంద‌రూ దొంగ‌లేనని జేసీ దివాక‌ర్ రెడ్డి మండిప‌డ్డారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.