మోడీ ఫ్యాక్ష‌నిస్ట్ అంటూ జేసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

pm modi and jc divakar reddy
Updated:  2018-11-06 04:02:10

మోడీ ఫ్యాక్ష‌నిస్ట్ అంటూ జేసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌ధాని మోడీ ఒక ఫ్యాక్ష‌నిస్టుగా మారుతున్నార‌ని ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ అనంత‌పురం జిల్లా ఎంపీ జేసీ దివాక‌రెడ్డి మండిప‌డ్డారు. ఈ రోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ మోడీ వెనుక బ‌డిన జిల్లాల‌కు కేటాయించిన నిధుల‌ను కూడా వెన్న‌క్కు తీసుకునే దుర్మాగ్గుడంటూ జేసీ నిప్పులు చెరిగారు. 
 
ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రాయుడు పార్టీని కాపాడుకోవ‌డం, రాష్ట్రాన్నికాపాడుకోవ‌డం పెద్ద స‌మ‌స్య కాద‌ని తెలిపారు. మోడి ప్ర‌ధాన మంత్రిగా ఉన్నంత‌కాలం రాష్ట్రం బాగుప‌డ‌ద‌ని ఎద్దేవా చేశారు. మోడీ ప‌రిపాల‌న‌లో ప్ర‌స్తుతం భార‌త దేశం సంక్షోభంలో ఉంద‌ని అందుకే  ఆయ‌న ఫ్యాక్ష‌నిస్టులా మారుతున్నార‌ని జేసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు 2019లో ఏపీలో టీడీపీ-కాంగ్రెస్ పొత్తుల‌పై కూడా స్పందించారు జేసీ.
 
తాము దేశ భ‌విష్య‌త్ కోసం కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నామ‌ని జేసీ అన్నారు. తాజాగా క‌ర్ణాట‌క ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ జేడీఎస్ మ‌హాకూట‌మిలు క‌లిసి బీజేపీని చిత్తుచిత్తుగా ఉడాయించాయ‌ని అయితే ఇదే ఫ‌లితాలు తెలంగాణలో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుగ‌తున్న నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇదే ఫ‌లితాల‌ను రుచి చూస్తార‌ని జేసీ దివాక‌ర్ రెడ్డి ఎద్దేవా చేశారు.

<