జేసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-23 15:09:27

జేసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకి అనేక‌ స‌మ‌స్య‌లు తెచ్చిపెడుతూనే ఉన్నారు. ఇక వాటిని ప‌రిష్క‌రించే క్రమంలో చంద్ర‌బాబు ఉంటే మ‌రికొన్ని స‌మ‌స్య‌లను నెట్టింట తెచ్చిపెడుతున్నారు టీడీపీ నాయ‌కులు. కాగా ఇప్ప‌టికే  సైకిల్ యాత్ర, మినీ మ‌హానాడు పేరుతో  టీడీపీ నాయ‌కులు రాష్ట్ర వ్యాప్తంగా కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. 
 
ఈ కార్య‌క్ర‌మంలో టీడీపీ నాయ‌కులు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శలు చేసుకుంటూ తామంటే తాము ఈ స‌భ‌ల్లో హైలెట్ కావాలనుకుంటూ తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. ఇక ఈ విమ‌ర్శ‌ల్లో రాయ‌ల‌సీమ‌ అగ్ర‌స్థానం ద‌క్కించుకుంది. ఇక ఇప్ప‌టికే మంత్రి ప‌ద‌విలో ఉన్న అఖిల ప్రియ‌కు టీడీపీ నాయ‌కుడు ఏవీ సుబ్బారెడ్డి మ‌ధ్య గొడ‌వ ఏ విధంగా చోటు చేసుకుందో అంద‌రికి తెలిసిందే. ఇదే క్ర‌మంలో అనంత‌పురం జిల్లాలో కూడా చోటు చేసుకుంది.
 
తాజాగా టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మధుసూదన గుప్తాతో కలిసి ఈ రోజు గుత్తిలో పర్యటించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జేసీ దివాక‌ర్ రెడ్డి సంచ‌ల‌నం సృష్టించారు. గుత్తిలో ఉన్న మున్సిపల్‌ చైర్ పర్సన్‌ తులసమ్మ తనయుడు శీనుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నేను త‌లుచుకుంటే  నువ్వు, నీ అమ్మ, గుత్తి మున్సిపల్‌ కమిషనర్‌ ఉండరంటూ శీనుని జేసీ బెదిరించారు. దీంతో అక్కడ‌ కొద్దిసేపు ఉదృక్త‌త నెలకొంది. ఎంపీ ప‌ద‌విలో ఉన్న వ్య‌క్తి ఇలా ఇష్టానుసారంగా మాట్ల‌డం ఏంట‌ని ప్ర‌జ‌లు విమ‌ర్శిస్తున్నారు. 
 
ఇక మ‌రో వైపు టీడీపీ స‌భ్య‌త్వం లేని వ్య‌క్తి గుప్తాతో జేసీ దివాక‌ర్ రెడ్డి గుత్తిలో ప‌ర్య‌టించ‌డంపై గుంత‌క‌ల్ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ అసంతృప్తితో ఉన్నార‌ని తెలుస్తోంది. ఇదంతా జేసీ 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో త‌న‌కు పోటీగా తెచ్చేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నార‌ని జితేంద్ర గౌడ్  ఆవేద‌న‌తో ఉన్న‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి టీడీపీ నాయ‌కులు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో వారికి అనుకులంగా ఉన్న వ్య‌క్తుల‌ను రంగంలో దించేందుకు సిద్ద‌మ‌య్యార‌ని తెలుస్తోంది. దీంతో రానున్న రెండు నెలల్లో సైకిల్ నాయ‌కులు టీడీపీకి గుబై చెప్పేందుకు సిద్ద‌మ‌య్యార‌ని తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.