జీసీ దివాక‌ర్ రెడ్డి V/S మంత్రి కాలువ శ్రీనివాస్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jc divakar reddy and kaluva srinivas
Updated:  2018-07-28 05:00:09

జీసీ దివాక‌ర్ రెడ్డి V/S మంత్రి కాలువ శ్రీనివాస్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మాచార‌, గృహ‌నిర్మాణ‌ శాఖ‌ మంత్రి కాలువ శ్రీనివాస్ అనంత‌పురం జిల్లాలోని రాయ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గానికి ప్ర‌స్తుతం ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. గ‌తంలో తెలుగుదేశ పార్టీ త‌ర‌పున ఎంపీగా ప‌నిచేసిన కాలువ శ్రీనివాస్... 2014 సార్వత్రిక ఎన్నిక‌ల్లో తొలి సారిగా రాయ‌దుర్గం నుంచి పోటీచేసి త‌న ప్ర‌త్య‌ర్థిపై గెలిచారు. 
 
అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చెయ్యాల‌ని చూస్తున్న కాలువకు అసంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి త‌న అల్లుడు దీప‌క్ రెడ్డికి రాయ‌దుర్గం నుంచి టికెట్ కేటాయించాల‌ని ముఖ్యంత్రి చంద్ర‌బాబు వ‌ద్ద ప‌ట్టు బ‌డుతున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. ఇక ఈ పరిణామాలు తెలుసుకున్న మంత్రి ఒక్క‌సారిగా అల‌ర్ట్ అయి జేసీ చేస్తున్న అక్ర‌మాల‌కు పెద‌బాబుకు, అలాగే చిన్న బాబుకు కొన్నిసాక్షాలు కూడా ఇచ్చార‌ని టీడీపీలో చ‌ర్చ జ‌రుగుతోంది. 
 
ఇక జేసీ, మంత్రి కాలువ మ‌ధ్య నెల‌కొన్న ఆధిప‌త్య‌పోరు ఎటువైపు దారి తీస్తుందో అని జిల్లా టీడీపీ నాయ‌కుల‌తో పాటు కార్య‌క‌ర్త‌లు కూడా బ‌య‌ప‌డుతున్నారు. టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క‌రామారావు నాటి నుంచి నేటి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వ‌ర‌కు కంచుకోట‌గా ఉన్న ఈ జిల్లా జేసీ, కాలువ వ్య‌వ‌హారం వ‌ల్ల వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ కంచుకోట‌కు బీట‌లు వాలే ఆస్కారం ఎక్కువ‌గా ఉంద‌ని తెలుస్తుంది. చుద్దాం వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏం జ‌రుగుతుందో.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.