ప‌వ‌న్ పై జేసి కామెంట్లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-21 13:05:02

ప‌వ‌న్ పై జేసి కామెంట్లు

రాజ‌కీయాల్లో ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేని వ్య‌క్తి అనంత‌పురం ఎంపీ జేసి దివాక‌ర్ రెడ్డి... ఎలాంటి విష‌యం అయినా ముక్కుసూటిగా మాట్లాడే వ్య‌క్తి జేసి... గ‌తంలో తెలుగుదేశంపార్టీ అధినేత ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుని   కూడా లెక్క‌చేయ‌కుండా జేసి ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి మ‌నంద‌రికీ తెలిసిందే... చంద్ర‌బాబునే కాకుండా ఆయ‌న‌కు అత్యంత స‌న్నిహితంగా ఉన్న వ్య‌క్తుల‌పై కూడా ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌ల్లో నిలుస్తుంటారు జేసి.
 
ఇక తాజాగా జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై కూడా మరోసారి తన దైన శైలిలో విమర్శలు గుప్పించారు...ఈ సంద‌ర్భంగా జేసి మాట్లాడుతూ రాజ‌కీయ రంగంపై  ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఏ మాత్రం అవ‌గాహన లేద‌ని అన్నారు..ఆయ‌న‌కు ఎలాంటి సినిమాలలో న‌టిస్తే హిట్ అవుతాయి... ఎలాంటి సినిమాలు  హిట్ అవ్వ‌వు  అనేదానిపై ప‌వ‌న్ కు పూర్తి అవ‌గాహ‌న‌ ఉంద‌ని,  సినిమాలే త‌ప్ప రాజ‌కీయాల‌పై జీరో నాలెడ్జ్ అని ఆయ‌న కామెంట్ చేశారు..ప్రజా సమస్యలపై ఆయ‌న‌కు కొంచం కూడా అవ‌గాహ‌న లేద‌ని జేసి మండిప‌డ్డారు.
 
సినిమాల్లో నటించినట్లుగా ప్రజా జీవితంలో నటించడం కుదరదని, పవన్ కల్యాణ్ ఓ బచ్చా అని ఆరోపించారు..అలాగే ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్న‌ చిరంజీవిపై కూడా ఆయన విమర్శలు చేశారు. కులాన్ని అడ్డుపెట్టుకుని నాడు ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి స్థాపించారని, ఆ పార్టీ ఏమైందో అందరికీ తెలిసిన విషయమేనని, జనసేన పార్టీ పరిస్థితి కూడా అంతేనని జేసీ అభిప్రాయపడ్డారు.
 
దీనిపై మెగా అభిమానులు అప్పుడు ఫేస్ బుక్ లో జేసి పై మండిప‌డుతున్నారు ప‌ద‌వుల కోసం పార్టీలు మారే మీరు ప‌వ‌న్ పై విమ‌ర్శ‌లు చేయ‌డమా మీకు నీ సోద‌రుడు ఎమ్మెల్యే జేసి ప్ర‌భాక‌ర్ రెడ్డికి ప‌క్క‌వారికి గౌర‌వం ఇవ్వ‌డం చేత‌కాదు, మీరు గ‌తంలో జ‌గ‌న్ త‌ల్లిని దూషించ‌లేదా మీరా సంస్కారం గురించి మాట్లాడేది.. ప‌వ‌న్ బ‌చ్చా అయితే మీరు దానికి వంద రెట్లు అంటూ విరుచుకుప‌డుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.