జేసి మ‌రో సంచ‌ల‌నం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-22 10:49:25

జేసి మ‌రో సంచ‌ల‌నం

అనంత‌పురం ఎంపీ జేసి దివాక‌ర్ రెడ్డి త‌న  విరుచుకుప‌డే పందాని మార్చుకోవ‌డం లేదు.. వివాదాల‌కు కేరాఫ్ అవుతూ రాయ‌ల‌సీమ‌లో మ‌రింత వార్త‌ల్లోకి వ‌స్తున్నారు.. ఇక అనంత‌పురంలో జేసి నాలుగు నుంచి ఐదు నియోజ‌క‌వ‌ర్గాల‌ను త‌న క‌నుసైగ‌ల‌తో శాసిస్తారు అనే ప్ర‌శంస ఉంది.
 
ఇక  జేసి ఫ్యామిలీ నుంచి వార‌సుల ఎంట్రీ ఇవ్వ‌నున్న త‌రుణంలో, జేసి సోద‌రులు కాస్త పొలిటిక‌ల్ గా వార‌సుల‌కు ఫేమ్ తీసుకువ‌స్తున్నారు.. అయితే ఇక్క‌డ జిల్లాలో తెలుగుదేశం రెండువర్గాలుగా చాలా చోట్ల చీలిపోయింది.. ఈ చీలిక పుట్ట‌ప‌ర్తిలో మ‌రింత ఆజ్యం పోస్తోంది తెలుగుదేశంలో.
 
 పుట్ట‌ప‌ర్తిలో ఓ వ‌ర్గం జేసికి అనున‌యులుగా ఉంటే, మ‌రో వ‌ర్గం, ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డికి అనుచ‌రులుగా ఉంటున్నారు. వీరి ఇరువురి నాయ‌క‌త్వంలో రెండు వ‌ర్గాలుగా చీలిపోయింది ఇక్క‌డ రాజ‌కీయం.. తాజాగా ఒక రోడ్డు కాంట్రాక్టు విష‌యంలో ఈ సారి ప‌ల్లెర‌ఘునాథ‌రెడ్డికి జేసి దివాక‌ర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో మ‌రో సంచ‌ల‌నంగా మారింది.
 
ఇటీవ‌ల రోడ్డు నిర్మాణ కాంట్రాక్టు పనులు జేసి త‌న అనుచరుడికి అప్ప‌గించారు.. అయితే ఆ ప‌నుల‌కు సంబంధించిన బిల్లులు రాకుండా ప‌ల్లె అడ్డుకున్నారు అని జేసి వ‌ర్గీయులు నిల‌దీస్తున్నారు.. ఇటీవ‌ల పుట్ట‌ప‌ర్తిలో జ‌రుగుతున్న ఈ విష‌యాన్ని ఎంపీ జేసి దివాకర్ రెడ్డి దృష్టికి తీసుకువ‌చ్చారు ఆయ‌న వ‌ర్గీయ‌లు….  దీంతో పల్లె రఘునాథరెడ్డికి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు దివాక‌ర్ రెడ్డి. చీఫ్ విప్‌ అయితే గొప్పోడివనుకుంటున్నావా.. కార్యకర్తలను కలుపుకుపోలేనప్పుడు చీఫ్ విప్ పదవి ఎందుకు అంటూ ఫైర్ అయ్యారు. పద్దతి మార్చుకోవాలని లేనిపక్షంలో ఇబ్బందులు పడుతావ్‌ అంటూ పల్లెకు వార్నింగ్ ఇచ్చారు జేసీ.
 
జేసి పీఏ దీనిని రికార్డు చేసి సోష‌ల్ మీడియాలో వ‌దిలార‌ని ఇలా చేయ‌డం వ‌ల్ల త‌న‌పరువుకు భంగం క‌లిగింది అని ప‌ల్లె పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.