జేసి బాట‌లో తెలుగుదేశం ఎంపీలు..?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jc divakar reddy image 3
Updated:  2018-03-14 03:40:54

జేసి బాట‌లో తెలుగుదేశం ఎంపీలు..?

తెలుగుదేశం బీజేపీ నుంచి బ‌య‌ట‌కు రావ‌డంతో తెలుగుదేశం ఎంపీలు ఎటువంటి డైల‌మాలో ఉన్నారో తెలిసిందే... ఇక తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్ద‌రు ఎంపీలు త‌మ‌కు తాముగా బ‌య‌ట‌కు  కేంద్రంలో మంత్రి వ‌ర్గం నుంచి బ‌య‌ట‌కు రావ‌డంతో బీజేపీ కూడా ఎటుంటి మాట మాట్లాడ‌టం లేదు... అస‌లు ప్ర‌ధాని మోదీ అయితే ప‌ది నిమిషాల్లో రాజీనామాలు తీసుకుని ఆ శాఖ‌ల‌ను వేరే వారికి అప్ప‌గించారు.. అయితే బీజేపీతో క‌లిసి కొన‌సాగాలి అంటే ప‌రిస్ధితి ఇలా ఉండ‌దు క‌దా అంటున్నారు.
 
ఇక లోక్ స‌భ‌లో తమ గ‌ళం వినిపిస్తున్నారు ఎంపీలు, ఇటు వైసీపీ ఎంపీలు ప్ల‌కార్డులు ప‌ట్టుకుని నిర‌స‌న తెలియ‌చేస్తుంటే అనంత ఎంపీ జేసి దివాక‌ర్ రెడ్డి కూడా వారిపై మండిప‌డిన విష‌యం తెలిసిందే.. జేసి తెలుగుదేశం త‌ర‌పున ముందు నుంచి ఒక‌టే చెబుతున్నారు ఏపీకి బీజేపీ ఎటువంటి సాయం చేయ‌దు అని , ఇంకా సీఎం చంద్ర‌బాబు ఏపీకి ప్ర‌త్యేక హూదా వ‌స్తుంది ప్ర‌త్యేక ప్యాకేజీ బాగుంది అని ప‌లు షేడ్లు చూపించారు ఆయ‌న వ్యాఖ్య‌ల్లో, కాని జేసి ముందు నుంచి ఏపీకి బీజేపీ ఎటువంటి న్యాయం చేయ‌దు అని చెబుతున్నారు చివ‌ర‌కు అదే జ‌రిగింది..
 
తాజాగా భారతీయ జనతా పార్టీపై టీడీపీ ఎంపీలు ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ ఏమీ ఇవ్వదని ఎప్పుడో అర్ధమైందని ఆ పార్టీకి చెందిన అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్‌రెడ్డి పేర్కొన్నారు. సో దినిక‌న్నా రీజ‌న్ ఏముంది.. జేసి ఈ మాట‌లు ఏనాడో చెప్పారు ఇప్పుడు కూడా అవే చెబుతున్నారు ఇక  బీజేపీ మాత్రం ఏపీకి ఎటువంటి  న్యాయం చేయ‌లేదు..
 
కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి మాట్లాడుతూ... బీజపీ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోందని, రాజీనామాకు దారితీసిన పరిణామాలను వివరించాలనుకున్నానన్నారు.ఇదిలా ఉండగా... మరో ఎంపీ మాగంటి బాబు బుధవారం ఢిల్లీలో ఫ్లోర్ లీడర్లకు తిరుపతి ప్రసాదాలు అందజేశారు. ప్రత్యేక హోదాకు సహకరించాలని కోరుతూ.. ఫ్లోర్ లీడర్లకు తిరుపతి ప్రసాదాలను అందించారు. మొత్తానికి అంద‌రూ జేసి రూట్లోకి వెళితే బెటర్ అని మిగిలిన ఎంపీలు అంటున్నారు మ‌రి ఆనాడే చెప్పారు జేసి, ఈ నాడు అదే జ‌రిగింది బీజేపీ ఏపీకి చెంబుడు నీళ్లు గుప్పెడు మ‌ట్టి ఇచ్చింది అని అంటున్నారు తెలుగు త‌మ్ముళ్లు.

షేర్ :

Comments

1 Comment

  1. నిజమే.

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.