వైసీపీ కీల‌క నాయ‌కుడి పై హ‌త్యాయ‌త్నం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-28 10:36:16

వైసీపీ కీల‌క నాయ‌కుడి పై హ‌త్యాయ‌త్నం

తెలుగుదేశం పార్టీ నాయ‌కుల ఆగ‌డాలు రోజు రోజుకు శృతిమించిపోతున్నాయి. ఇప్ప‌టికే క‌బ్జాలతో రాష్ట్రంలో తెలుగు త‌మ్ముళ్ల పేరు మార్మోగిపోతోంది. ఇక అనంత‌పురం జిల్లాలో జేసి వ‌ర్గీయుల ఆగ‌డాల‌కు అడ్డు అదుపు లేకుండా పోతోంది.
 
తాజాగా వైఎస్‌ఆర్‌సీపీ మైనార్టీ విభాగం అధ్యక్షుడు గయాజ్‌ బాషా అలియాస్‌ మున్నాపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. జేసీ వ‌ర్గీయులు ఈ ఘటనలో జేసీ వర్గీయుల నుంచి మున్నా తృటిలో తప్పించుకున్నారు.
 
తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం రాత్రి ఓ వ్యక్తిని పరామర్శించి వస్తున్న సమయంలో, జేసీ వర్గీయులు దాడి చేసినట్లు తెలుస్తోంది.. ఈ దాడిలో వారి నుంచి మున్నా ప్రాణాలతో బయటపడ్డారు. అతనికి సంబంధించిన రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దీంతో ఆయ‌న తృటిలో త‌ప్పించుకున్నారు.
 
వైఎస్‌ఆర్‌సీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న మున్నాను హతమార్చేందుకు జేసీ వర్గీయులు కుట్రపన్నారని విమ‌ర్శిస్తున్నారు. ఇప్ప‌టికే  వక్ఫ్‌ ఆస్తుల అన్యాక్రాంతం, నిధుల గోల్‌మాల్‌ వెనుక టీడీపీ నేతల పాత్రపై మున్నా ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో దాడికి ప్లాన్‌ చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో  ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి అరాచకాలపై వైఎస్సార్‌ సీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు... దీనిపై పోలీసులు కూడా ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు అని విమ‌ర్శిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.