జేసీ బ్ర‌ద‌ర్స్ చివ‌రకి మ‌హిళ‌ల‌ను కూడా వ‌ద‌ల‌డం లేదు..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jc prabhakar reddy
Updated:  2018-10-06 01:30:39

జేసీ బ్ర‌ద‌ర్స్ చివ‌రకి మ‌హిళ‌ల‌ను కూడా వ‌ద‌ల‌డం లేదు..

ఎలాంటి విషయం అయినా ముక్కుసూటిగా మ‌ట్లాడే జేసీ బ్ర‌ద‌ర్స్ మ‌రోసారి మీడియా సాక్షిగా ప్ర‌జ‌లంద‌రి స‌మావేశంలో మ‌హిళ‌ల‌ను ఉద్దేశించి ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా నియోజ‌క‌వ‌ర్గంలోని జేసీ, నాగిరెడ్డి షాదీఖాన‌లో ఏర్పాటు చేసిన దుల్హన్ ప‌థ‌కం మంజూరు పంపిణి కార్య‌క్ర‌మంలో తాడిప‌త్రి ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి మాట్లాడుతూ... టీవీ సీరియ‌ల్స్ వ‌ల్ల మ‌హిళ‌ల‌కు ఎంలాంటి ఉప‌యోగం లేద‌ని ప్ర‌త్య‌క్షంగా వారిపై మండిప‌డ్డారు. 
 
ఈ న‌వీన యుగంలో బుల్లితెర‌లో ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్స్ లో అస‌లు నీతి ఉందా అని జేసీ మ‌హిళ‌ల‌ను ప్ర‌శ్నించారు. కేవ‌లం ధ‌నార్జ‌నే ద్యేయంగా చేసుకుని సీరియ‌ల్స్ ను చిత్రిస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.  అయితే వీటివ‌ల్ల జ‌నాల‌కు ఉప‌యోగం లేద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. 
 
సీరియ‌ల్స్ వ‌ల్ల కుటుంబాల్లో ఈర్ష్య, ద్వేషాలు, ప‌గ‌, ప్ర‌తీకారాలతో రెచ్చ‌గొడుతున్నాయ‌ని జేసీ ఆరోపించారు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌వేశ పెట్టిన ఈ ప‌థ‌కం ద్వారా మ‌హిళ‌ల‌కు 50 వేల రూపాల‌య‌లు ఫిక్స్ డ్ డిపాజిట్ చేయ‌డ‌మో లేక ఉపాధికోసం ఉప‌యోగించ‌డ‌మో జ‌రుగుతుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.