పార్ల‌మెంట్ స‌మావేశాల‌కు డుమ్మా కొడాతా కార‌ణం ఇదే జేసీ సంచ‌ల‌నం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-19 12:31:22

పార్ల‌మెంట్ స‌మావేశాల‌కు డుమ్మా కొడాతా కార‌ణం ఇదే జేసీ సంచ‌ల‌నం

2019 ఎన్నికలు ద‌గ్గ‌రకు వ‌స్తున్న త‌రుణంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు రెండు నాలుక‌ల ధోర‌ణి మ‌రోసారి బ‌ట‌ప‌డింది. వ‌ర్షాకాల పార్ల‌మెంట్ స‌మావేశాలు మొద‌లైన మొద‌టిరోజు నాడే టీడీపీ ఎంపీలు విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన ప్ర‌త్యేక హోదాను డిమాండ్ చేస్తూ కేసీనేని శ్రీనివాస్ కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ అవిశ్వాస తీర్మానంపై తాజాగా అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.
 
ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, త‌మ పార్టీ ఎంపీలు పెట్టిన అవిశ్వాస తీర్మానం చ‌ర్చ జ‌రుగుతుంది కానీ అది స‌భ‌లో విరిగిపోవ‌డం ఖాయ‌మ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం రాజ‌కీయ వాతావ‌ర‌ణం బాగాలేదని అందుకే తాను పార్ల‌మెంట్ స‌మావేశాల‌కు హాజ‌రు కాన‌ని కుండబ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్పారు. టీడీపీ ఎంపీలు ప్ర‌వేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్ర‌వారం చ‌ర్చ జ‌రగునున్న‌ నేప‌థ్యంలో ఆ పార్టీ ఎంపీల‌కు విప్ జారీ చేశారు. కానీ తాను పార్ల‌మెంట్ కు వెళ్ల‌న‌ని జేసీ స్ప‌ష్టం చేశారు. 
 
తాము ప్ర‌వేశ పెట్టిన అవిశ్వాసంపై పార్టీ ఎంపీలు ఇద్ద‌రు లేక ముగ్గురు మాట్లాడుతార‌ని, అయితే త‌న కంటే హిందీ, ఇంగ్లీష్ భాష బాగా వచ్చిన వారు ఉన్నార‌ని వారే మాట్లాడుతార‌ని వ్యంగంగా వ్యాఖ్య‌లు చేశారు. ఇక ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై ప్ర‌తిప‌క్షాలే కాకుండా సాధార‌ణ ప్ర‌జ‌లు కూడా త‌ప్పుబ‌డుతున్నారు. రాష్ట్రానికి అమ‌ర సంజీవ‌ని అయిన ప్ర‌త్యేక హోదా సాధ‌న పై అధికార నాయ‌కుల‌కు ఏ మాత్రం చిత్తశుద్ది ఉందో ఇట్టే అర్థం అవుతోంద‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. 
 
త‌మ అవిశ్వాసానికి పార్ల‌మెంట్ సాక్షిగా ఆ పార్టీ నాయ‌కులు మ‌ద్ద‌తు ఇస్తున్నారు ఈ పార్టీ నాయ‌కులు మ‌ద్ద‌తు ఇస్తున్నార‌ని టీడీపీ నాయ‌కులు పైకి చెబుతున్నా సొంత‌పార్టీ నాయ‌కులే ప్ర‌త్యేక హోదాకు సానుకూలంగా లేర‌ని మండిప‌డుతున్నారు. జేసీ వ్యాఖ్య‌ల‌తో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకి ఆయ‌న కో ల‌కు ప్ర‌త్యేక హోదాపై ఎంత మాత్రం చిత్తశుద్ది ఉంతో తెలుస్తోందని ప్ర‌జ‌లు ఆరోపిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.