పోలీసులు కొజ్జాలు నేను కొజ్జానే నీ అబ్బా రే మాధ‌వ్ .. నా.... నాలుక కోస్తావా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jc divakar reddy and police officer madhav
Updated:  2018-09-21 03:43:05

పోలీసులు కొజ్జాలు నేను కొజ్జానే నీ అబ్బా రే మాధ‌వ్ .. నా.... నాలుక కోస్తావా

అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి రాజ‌కీయం కాస్త నువ్వానేనా అన్న‌ట్లు మారుతుంది. వినాయ‌క నిమ‌ర్జ‌నం సంద‌ర్భంగా ప్ర‌బోధానంద‌స్వామీ వ‌ర్సెస్ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి అనుచ‌రులుగా మారిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఈ వివాదం కాస్త మ‌లుపులు తిరిగి పోలీస్ వ‌ర్సెస్ జేసీ దివాక‌ర్ రెడ్డిగా మారి భ‌య బ్రాంతుల‌కు గురి చేస్తుంది. 
 
ఈ వివాదాల నేప‌థ్యంలో జేసీ దివాక‌ర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పోలీస్ వ్య‌వ‌స్థ కొజ్జాల్లా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇక ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై పోలీస్ అధికారి మాధ‌వ్ తాజాగా స్పందించారు. పోలీస్ వ్య‌వ‌స్థ‌ను కొజ్జాలు అని ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడితే నాలుక కోస్తాన‌ని జేసీకి వార్నింగ్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.
 
ఇదే క్ర‌మంలో జేసీ నేడే స్పందిస్తూ మాధ‌వ్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను ప‌లానా వ్య‌క్తిని పేరు పెట్టి కొజ్జా అని  పిలిచిఉంటే ఆ పోలీస్ అధికారికి క్ష‌మాప‌ణ చెబుతాన‌ని అలాగే వారి కాళ్లు మొక్కుతాన‌ని తెలిపారు. అయినా కొజ్జా అనే ప‌దం వాడితే త‌ప్పేముంద‌ని మీడియా ద్వారా ప్ర‌శ్నించారు జేసీ. ప్ర‌బోధానంద స్వామి ఆశ్ర‌మం వ‌ద్ద అల్ల‌ర్లు జ‌రుగుతంటే అంత మంది పోలీసులు ఉండి అయుధాలు ఉండికూడా ఏమీ చెయ్య‌లేక‌పోయార‌ని జేసీ విమ‌ర్శ‌లు చేశారు. 
 
గ‌తంలో మాద‌వ్ త‌న చుట్టు ఎన్ని సార్లు ప్ర‌ద‌క్ష‌ణ‌లు చేశారో ఆయ‌న‌కే తెలుస‌ని జేసీ స్ప‌ష్టం చేశారు. మీడియా ముందు మీసాలు తిప్పాడ‌ని ఈ మీసాలు ఆడ‌మ‌గ కాని వాళ్ల‌కు కూడా ఉంటాయ‌ని జేసీ ఎద్దేవా చేశారు. తాను రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పాల‌నుకుంటున్నాను కానీ త‌నను కొంద‌రు వ‌చ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయ‌మంటున్నారు. మ‌రికొంద‌రు మంత్రి కావాలంటున్నారు మ‌రికొంద‌రు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుని తోసేసి మీరు ముఖ్య‌మంత్రి కావాలంటున్నార‌ని అలాంటి త‌న నాలుక తెగ కోస్తే ఇంకొక చిన్ననాలుక కోపించుకుంటా క‌ద‌రా నీ అబ్బా..రే అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు జేసీ.
 
త‌న 45 అసంవ‌త్స‌రాల రాజ‌కీయ జీవితంలో మొద‌టిసారిగి పోలీసుల‌తో పాటు తాను కూడా కొజ్జాల్లా ప‌రిగెత్తాన‌ని అన్నారు.  అందుకే తాను పోలీసుల వెంట ప‌రిగెత్తినందుకు తానుకూడా కొజ్జా నా కొడుకునని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.