అడ్డంగా దొరికి సంచ‌ల‌నంగా మారిన జేసీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jc divakar reddy and prabodhananda
Updated:  2018-09-19 04:00:19

అడ్డంగా దొరికి సంచ‌ల‌నంగా మారిన జేసీ

అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలో వినాయ‌క నిమ‌ర్జ‌నం రోజు త‌లెత్తిన విభేదాలు నేటికి చ‌ల్లారడం లేదు. ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి వ‌ర్గీయులు, ప్ర‌భోదానంద స్వామి వ‌ర్గీయులు ఘ‌ర్ష‌ణ‌ల‌కు దిగ‌టంతో తాడిప‌త్రి మొత్తం ఉద్రిక్త‌త వాతావ‌రణం చోటుచేసుకుంది. దీంతో పోలీస్ అధికారులు శాంతి బ‌ద్ర‌త రిత్య న‌గ‌రంలో 144 సెక్ష‌న్ అమ‌లు చేశారు. అయినా కూడా న‌గ‌రంలో అక్క‌డ‌క్క‌డా వివాదాలు త‌లెత్తుతూనే ఉన్నాయి.
 
అయితే ఈ నేప‌థ్యంలో త‌న‌కు ప్ర‌భోదానంద‌స్వామి ఎవ‌రో తెలియ‌ద‌ని, ఆయ‌న ఇక్క‌డకి వచ్చి ఆశ్ర‌మన్ని ఏర్పాటు చేసుకున్నార‌ని జేసీ విమ‌ర్శ‌లు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు చంద్ర‌బాబు నాయుడుకు జ‌రిగిన సంఘ‌టన‌ వివ‌రాల‌ను మొత్తం వివ‌రించారు జేసీ దివాక‌ర్ రెడ్డి. కొద్దిరోజుల క్రితం నుంచి  తాడిప‌త్రిలో జ‌రుగుతున్న‌ వాస్త‌వాల‌ను చంద్ర‌బాబుకు తాను వివ‌రించాన‌ని అలాగే వీడియోకి సంబంధించిన క్లింపింగ్స్ కూడా అంద‌జేశానాన‌ని మీడియాకు తెలిపారు జేసీ. 
 
అయితే ఈయ‌న అలా ముఖ్యమంత్రికి వివ‌రించారో లేదో ప్ర‌స్తుతం జేసీ సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నారు. ప్ర‌భోదానంద‌స్వామి త‌న‌కు ఎవ‌రో తెలియ‌ద‌న్న జేసి సాక్షాత్తు వీరిద్ద‌రు 12 సంవ‌త్స‌రాల క్రితం దిగిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. 
 
ప్ర‌భోదానంద‌స్వామి ఆశ్ర‌మాన్ని నిర్మిస్తే ఈ ఆశ్ర‌మానికి జేసీ ప్రారంభోత్స‌వానికి వెళ్లారు. అంతేకాదు ప్ర‌భోదానంద స్వామిని ఉద్దేసించి మాట్లాడిన వ్యాఖ్య‌లు కూడా సోష‌ట్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. అయితే ఈ మ‌ధ్య‌కాలంలో జేసీ బ్ర‌ద‌ర్స్ కు రాజ‌కీయ నేప‌థ్యంలో ప్ర‌భోదానంద స్వామితో విభేదాలు వ‌చ్చాయ‌ని అంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను కింద‌ చూడ‌వ‌చ్చు.
jc
 
ananthapur
divaakr reddy mp
ananthapur

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.