ఆ పాపం టీడీపీ-కాంగ్రెస్ పార్టీల‌దే జేసీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jc divakar reddy
Updated:  2018-08-29 05:06:53

ఆ పాపం టీడీపీ-కాంగ్రెస్ పార్టీల‌దే జేసీ

తెలుగు రాష్ట్రాల‌ను విభ‌జించిన పాపం జాతీయ కాంగ్రెస్ పార్టీ-తెలుగుదేశం పార్టీల‌దే అని ఆ పార్టీ అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి త‌న‌దైన శైలిలో వ్యాఖ్య‌లు చేశారు.ఈ రోజు అమ‌రావ‌తిలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు క‌లిసిన త‌ర్వాత ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ పొత్తుల‌పై స్పందించారు.
 
ప్ర‌స్తుతం తెలంగాణ‌లో టీడీపీ పార్టీ బ‌ల‌హీనంగా ఉంద‌ని ఈ ప‌రిస్థితిలో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తుపెట్టుకుంటే ఏపీ ప్ర‌జ‌లు హ‌ర్షిస్తార‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 
 
అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీలో టీడీపీ పొత్తుపెట్టువాల్సిన అవ‌స‌రం లేద‌ని జేసీ తెలిపారు. గ‌తంలో తాము బీజేపీతో పొత్తు పొట్టుకుని మోస‌పోయామ‌ని గుర్తు చేశారు.అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని న‌మ్మితే త‌ప్పేమి లేద‌ని పైగా వారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే ఏపీ క‌చ్చిత‌మై హామీ ఇస్తామ‌న్నార‌ని జేసీ తెలిపారు. న‌మ్మినవాడు ఎప్పుడు మోస‌పోడ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. 
 
అయితే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ముస్లిం ఓట్లు దూరం అవుతుండ‌టంతో  ఆయ‌న ముంద‌స్తు ఎన్నిక‌లకు సిద్ద‌మ‌వుతున్నార‌ని జేసీ ఆరోపించారు. అంతేకాదు వ‌చ్చేఎన్నిక‌ల్లో కేసీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటార‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.