మరోసారి జేసీ వివాదాస్పద వ్యాఖ్యలు...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-03 08:35:38

మరోసారి జేసీ వివాదాస్పద వ్యాఖ్యలు...

రాజ‌కీయాల‌కు ప్ర‌త్యేక పరిచయం అక్క‌ర్లేని వ్య‌క్తి  జేసీ దివాక‌ర్ రెడ్డి. ఈ య‌న అధికార పార్టీలో ఉన్నా, ప్ర‌తిప‌క్ష‌పార్టీ ఉన్నా త‌ప్పుచేస్తే ఎవ‌రినైనా ముక్కు సూటిగా మాట్లాడే వ్య‌క్తి జేసీ దివాకర్ రెడ్డి. అందుకేనేమో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కూడా ఈ నాలుగేళ్లపాల‌న‌లో త‌ప్పుచేసిన‌ట్లు తెలుస్తుంది అందుకే ఆయ‌న‌ను జేసీ దివాక‌ర్ రెడ్డి ప్ర‌శ్నించారు. 
 
మొన్న మినీ మహానాడులో కూడా ఒక వైపు చంద్ర‌బాబు నాయుడు పొగుడుతూనే, మ‌రో వైపు అధికారంలో జ‌రిగిన త‌ప్పుల‌ను స‌భ స‌మ‌క్షంలో  వివ‌రించారు.  టెలీకాన్ఫ్ రెన్స్, జ‌న్మ‌భూమి క‌మిటీలు వల్లప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని నేరుగా ముఖ్యమంత్రికే చెప్పారు జేసీ దివాకర్ రెడ్డి... 
 
ఇదే కాదు ఇంతకు ముందు కూడా ఎన్నో సార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు జేసీ. ఇప్పుడు మరోసారి విలేకర్ల సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు జేసీ...నా శవయాత్ర చేశారు. అంతమంది కొడుకులు నాకున్నారని తెలీదు. శవాన్ని తీసుకెళ్లి ఊరేగింపు నిర్వహించి దహనం చేసేది కొడుకులే. ఈ జిల్లాలో నాకు ఇంత మంది కొడుకులా? ఎప్పుడు కన్నానో ఏమో నాకే తెలీదు అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు...ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు, దళితులు, గిరిజనులు మండిపడుతున్నారు... 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.