చంద్రబాబుకు బిగ్ షాక్ ఇచ్చిన జేసీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu,jc image
Updated:  2018-04-15 11:42:27

చంద్రబాబుకు బిగ్ షాక్ ఇచ్చిన జేసీ

రాజ‌కీయాలకు ప‌రిచ‌యాలు అక్క‌ర్లేని వ్య‌క్తి జేసీ దివాక‌ర్ రెడ్డి... ఎలాంటి విష‌యం అయినా ముక్కుసూటిగా మ‌ట్లాడుతారు ఆయ‌న..గ‌తంలో  కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా పేరుమోసిన పార్టీ నాయ‌కులు అనంత‌వెంక‌ట‌రామి రెడ్డి, ర‌ఘువీరా రెడ్డితో కూడా విభేదాలు పెట్టుకుని వ్య‌వ‌హ‌రించారు జేసీ.. ఆ త‌ర్వాత మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అకాల మ‌ర‌ణంతో కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు స‌మ‌క్షంలో సైకిల్ ఎక్కారు జేసీ దివాక‌ర్ రెడ్డి.
 
టీడీపీలోకి చేరినా కూడా తాను ఆడిందే ఆటా పాడిందే పాట అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్త‌న్నారు జేసీ... 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున ఎంపీగా గెలిచినా ఆ పార్టీ నేత‌ల‌తోనూ ఎమ్మెల్యేల‌తో రచ్చలు కొనసాగుతూనే ఉన్నాయి... ఇక‌ ఏపీ ముఖ్య‌మంత్రి అని చూడ‌కుండా చంద్ర‌బాబుపై గ‌తంలో అనేక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు దివాకర్ రెడ్డి..
 
ఇత తాజాగా మ‌రోసారి అనంత‌పురం జిల్లాలో త‌న ఆదిప‌త్య‌ పోరును సాధించాల‌ని చూస్తున్నారట జేసీ.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సుమారు ఇంకా ఏడాది కాల వ్య‌వ‌ధి వ‌న్నా కానీ టీడీపీ లో అసెంబ్లీ సీట్ల‌ర‌గ‌డ ర‌గ‌డ మొద‌లైట్లు రాజ‌కీయ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి...
 
ఈ సీట్ల ర‌గ‌డ‌లో జేసీ దివాక‌ర్ రెడ్డి ముందంజ‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది... వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో త‌నకు ఎకంగా ఐదు సీట్లు త‌మ నియంత్ర‌న‌లో  ఉండాలన్నట్టుగా జేసీ సోదరులు వ్య‌వ‌హ‌రిస్తోన్న‌ట్లు తెలుస్తోంది.. అందులో భాగంగానే ద‌ర్మ‌వ‌రం సెగ్మెంట్ పై కూడా జేసీకి క‌న్నుప‌డిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.. అయితే ఇదే సెగ్మెంట్ లో కాలువ శ్రీనివాసులు ప్ర‌స్తుతం ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.... ఈ నియోజ‌క వ‌ర్గంలో బీసీ వ‌ర్గానికి చెందిన కుల‌స్తులు ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా చంద్ర‌బాబు కాలువ శ్రీనివాసులును పోటీ చేయించే చాన్స్ ఎక్కువ‌గా ఉంది..
 
ఇంత‌లో జేసీ క‌న్ను రాయ‌దుర్గం పై ప‌డ‌డంతో ఆ సీటు కూడా త‌న ఆదీనంలోకి తెచ్చుకుని వ‌చ్చే ఎన్నిక‌ల్లో జేసీ కుటుంబానికి అత్యంత స‌న్నిహితుడైన గురునాథరెడ్డిని పోటీ చేయించాలనేది జేసీ ఆలోచనగా తెలుస్తోంది. అనంతపురం మాజీ ఎమ్మెల్యే అయిన గురునాథ్‌ రెడ్డితో జేసీ సోదరులకు మొదటి నుంచి సత్సంబంధాలున్నాయి. ఆ సంబంధాలే ఇటీవల గురునాథరెడ్డిని టీడీపీలోకి చేర్పించాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు గురునాథ్‌ రెడ్డికి రాయదుర్గం సీటును ఇప్పించే ప్రయత్నాల్లో ఉన్నాడట దివాకర్‌ రెడ్డి. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.