జేసి సంచ‌ల‌న వ్యాఖ్యలు...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jc divakar reddy image 1
Updated:  2018-03-12 04:13:09

జేసి సంచ‌ల‌న వ్యాఖ్యలు...

రాజ‌కీయ నాయ‌కుల‌పై వెరైటి వ్యాఖ్య‌లు చేస్తూ ప్ర‌తీ సారి వార్త‌ల్లో నిలుస్తూ ఉంటారు  అనంత‌పురం ఎంపీ జేసి దివాక‌ర్ రెడ్డి... త‌న మ‌నుసులోని మాట‌ల‌ను ఏమాత్రం దాచుకోకుండా ఎంత‌టి వారినైనా విమ‌ర్శిస్తుంటారు జేసి...అయితే గ‌తంలో ముఖ్య‌మంత్రి చంద్రబాబును సైతం లెక్క‌చేయ‌కుండా త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు చేసి వార్త‌ల్లో నిలిచారు ఎంపీ దివాక‌ర్ రెడ్డి.
 
ఇక‌ తాజాగా మ‌రోసారి ప‌లు ఆస‌క్తిక‌ర  కామెంట్లు  చేసి ప్ర‌స్తుతం వార్త‌ల్లో నిలుస్తోన్నారు జేసి... రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా రాద‌ని, అందుకోస‌మే తాను లోక్ స‌భ‌కు వెళ్ల‌కుండా అమ‌రావ‌తిలోనే ఉన్నానని మీడియాతో తెలిపారు... అయితే ఇదే విష‌యాన్ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అడిగార‌ని, మ‌నం వెళ్ల‌క‌పోతే ఫెయిల్ అవుతామ‌ని చెప్పార‌ట ముఖ్య‌మంత్రి... కాని తాను వెళ్లినా, వెళ్ల‌క‌పోయినా తాను ఎప్పుడు పెయిల్ అవ్వ‌లేద‌ని చెప్పుకొచ్చారు జేసి.... తాను మళ్లీ చట్టసభకే పోటీ చేస్తానని, ఎన్నికల‌ ద్వారా సభ‌లోకి రావడం, ఎంపిక ద్వారా సభకు రావడం  ఈ రెండింటి మ‌ధ్య చాలా వ్య‌త్యాసం ఉంద‌ని ఎంపీ తెలిపారు..
 
అయితే మ‌రోవైపు జేసి చేసిన వ్యాఖ్య‌లపై విపక్షాలు మండిప‌డుతున్నాయి... రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా రాకుండా అధికార తెలుగు దేశం పార్టీ నాయ‌కులే అడ్డు ప‌డుతున్నార‌ని విప‌క్షాలు వాపోతున్నాయి... దీంతో పాటు వైసీపీ నాయ‌కులు పార్ల‌మెంటులో పెడుతున్న అవిశ్వాస తీర్మానానికి టీడీపీ నాయ‌కులు మ‌ద్ద‌తు తెలుప‌కుంటే, రాబోయే రోజుల్లో చ‌రిత్ర హినులు అవుతార‌ని విప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.