జేడీ క్లారిటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-01 15:11:25

జేడీ క్లారిటీ

మాజీ సీబీఐ జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ అంటే రాష్ట్రంలో తెలియ‌ని వారు ఉండ‌రు. గ‌తంలో జ‌గ‌న్ అక్రమాస్తుల‌కు పాల్ప‌డ్డార‌నే నేప‌థ్యంలో ఆయ‌న‌పై గ‌తంలో కేసులు పెట్టారు. అయితే ఈ కేసులో జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ కీల‌క పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే.ఒక విధంగా చెప్పాలంటే జ‌గ‌న్ ద్వారా ల‌క్ష్మీ నారాయ‌ణ ఫేమ‌స్ అయ్యార‌నే చెప్పాలి. అయితే ఈ మ‌ధ్య కాలంలో ఆయ‌న త‌న బాధ్య‌త‌ల‌కు ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు. ఇక‌ అదే ఫేమ్ తో ప్ర‌జ‌ల ప‌క్షాన‌ నిలుస్తూ వారి క‌ష్టాల‌ను ప్ర‌భుత్వాం దృష్టికి తీసుకువెళ్తున్నారు.
 
తాజాగా ఆయ‌న ఏ పార్టీలో చేరుతార‌నే ఊహాగానాలు త‌లెత్తుతున్నాయి. గ‌తంలో జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ, ప‌వ‌న్ క‌ల్యాణ్ స్థాపించిన జ‌న‌సేన పార్టీలో చేరుతార‌ని వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయ‌న బీజేపీలో చేర‌బోతున్నార‌ని, 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ త‌ర‌పున ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా జేడీ పోటీ చేయ‌నున్నార‌ని ప్ర‌చారం రాష్ట్ర వ్యాప్తంగా జ‌రుగుతోంది .
 
ఇక త‌న గురించి వ‌స్తున్న ఈ వార్త‌ల‌పై స్పందించారు జేడి ల‌క్ష్మీ నారాయ‌ణ‌. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, కొంత కాలంగా వ‌స్తున్న వార్త‌ల్లో ఏ మాత్రం వాస్త‌వం లేద‌ని, తాను ఏ పార్టీలో చేర‌న‌ని స్ప‌ష్టం చేశారు. జిల్లా ప‌ర్య‌ట‌న పూర్తి అయిన త‌ర్వాత రాజ‌కీయ ప‌రంగా తాను ఓ నిర్ణ‌యం తీసుకుంటాన‌ని తెలిపారు. అలాగే రైతుల‌కు కేటాయించిన ప‌థ‌కాలు స‌రిగ్గా అంద‌డం లేద‌ని అన్నారు. దీంతో పాటు రైతులు పండించిన పంట‌కు గిట్టుబాటు ధ‌ర వ‌స్తే చాలని అంటున్న‌రాని ఆయ‌న తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.