ప‌వన్ కు ల‌క్ష్మి నారాయ‌ణ‌ మెసేజ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

pawan kalyan and jd lakshmi narayana
Updated:  2018-03-26 18:09:31

ప‌వన్ కు ల‌క్ష్మి నారాయ‌ణ‌ మెసేజ్

మహారాష్ట్ర అడిషనల్ డీజీ పదవికి  లక్ష్మీనారాయణ ఇటీవ‌ల‌ రాజీనామా చేసిన విషయం అంద‌రికి తెలిసిందే. అయితే ఆయన త్వరలో రాజకీయాల్లో చేరడానికే ప‌ద‌వికి రాజీనామా చేశార‌ని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. స‌మాజం  పై పూర్తి అవ‌గాహ‌న ఉన్న‌  ల‌క్ష్మి నారాయ‌ణ‌ ఏ పార్టీలో చేరతారన్నది మాత్రం అభిమానుల‌కు ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది. ఆయన సొంత పార్టీ పెట్టబోతున్నారా?  లేక‌పోతే జాతీయ పార్టీ అయిన బీజేపీలోకి వెళతారా?  లేదా జ‌న‌సేన‌లో చేర‌తారా అని ఎదురుచూస్తున్నారు..
 
గ‌తంలో గాలి కేసుల స‌మ‌యంలో ఆయ‌నకు ఏపీలో మరింత క్రేజ్ వ‌చ్చింది.. ఆ స‌మ‌యంలో ఆయ‌న అంద‌రికి రోల్ మోడ‌ల్ గా మారారు.. అయితే జ‌గ‌న్ పై కేసుల్లో సీబీఐ అత్యుత్సాహాం చూపించింది అనేక విమ‌ర్శ‌లు రావ‌డంతో ఆయ‌న విచార‌ణ పై ప‌లు విమర్శ‌లు వ‌చ్చాయి.
 
ఒక వైపు జ‌న‌సేన‌కు సంబందించిన నాయ‌కులు ఆయ‌న పార్టీలోకి వ‌స్తున్నార‌ని, అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ తో ఆయ‌న చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు అని ఆయ‌న ట‌చ్ లో ఉన్నారు అని అంటున్నారు ఇవే  వార్త‌లు ఇప్ప‌డు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి..
 
దీనికి స్పందించిన జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనలోకి వస్తే ఆహ్వానిస్తామని అన్నారు... లక్ష్మీనారాయణకు స‌మాజం ప‌ట్ల, రాజ‌కీయ ప‌రిపాల‌న పై మంచి ప‌ట్టుంద‌ని  ప‌వ‌న్ తెలిపారు..
 
ఇప్పటి వరకూ లక్ష్మీనారాయణను  ఒక్కసారి మాత్రమే కలిశానని, అయితే అప్పుడు ఎలాంటి రాజ‌కీయ చ‌ర్చ‌లు జ‌ర‌ప‌లేద‌ని చెప్పారు... ఆ తర్వాత ఆయనతో మాట్లాడడం కానీ, కలవటం కానీ జరగలేదన్నారు... జేడీ రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలను తాను కూడా గమనిస్తున్నానని ప‌వ‌న్‌ చెప్పారు. ఇటీవల గుంటూరులో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభకు ముందు లక్ష్మీనారాయణ తనకు ‘ఆల్‌ ది బెస్ట్’ అని టెక్ట్స్ మెసేజ్ పెట్టారని పవన్ వెల్లడించారు.
 
ఇంక ఇంత కన్నా హింట్ ఏమి ఉంటుంది నాధా.. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.